మంగళగిరి (చైతన్య రథం రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారి, ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈవో) ఆవుల చంద్రశేఖరు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళవారం ప్రశంసా పత్రం, ఘనంగా సత్కారం అందుకున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సంద ర్భంగా ఈ ఏడాది “ఔషధ, సుగంధ మొక్కలు -ఆరోగ్యం-వారసత్వం -జీవనో పాధిని పెంపొందించడం” అనే అంశాన్ని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నుంచి చంద్రశేఖర్ సత్కారం అందుకున్నారు.














