మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను సారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో ‘‘ప్రజావేదిక’’ కార్యక్రమం జరుగుతుంది. డిసెం బరు 30న సోమవారం నుంచి జనవరి 11 వరకు ప్రజావేదికలో పాల్గొనే మంత్రులు, నాయకుల వివరాలను కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 30వ తేదీన మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ ప్రెసిడెంట్, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, 2న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, 3న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావు, 4న రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి పొంగూరు నారాయణ, ఎన్టీఆర్ వైద్యసేవ చైర్మన్ సీతారామ సుధాకర్, 6న మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, 7న మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, 8న మంత్రి ఎన్.ఎం. డి.ఫరూక్, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ పీతల సుజాత, 9న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఏపీ విమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావలి గ్రీష్మ, 10న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, 11న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అర్జీలు స్వీకరిస్తారు. ఆయా తేదీల్లో వారు ప్రజలు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారు.