- ద్వంద్వ వైఖరి జగన్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నాడు
- కోడికత్తి, గులకరాయి.. ఇప్పుడు సంతకాల డ్రామా
- మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ ఖర్చు చేసింది సున్నా
- పీపీపీ అంటే అర్థం తెలిసీ విషం చిమ్ముతున్నాడు
- సూపర్ సిక్స్ సహా ఎన్నో పథకాలు అమలు చేశాం
- పీపీపీలోనే మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం..
- పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తాం
- మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ మంత్రి సవిత
మంగళగిరి (చైతన్య రథం): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా పాత భ్రమల్లోనే బతుకుతున్నారని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి మంత్రి ఎస్ సవిత ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలను ఏదోక విధంగా తప్పుదోవ పట్టించి ‘డైవర్షన్’ రాజకీయం చేయాలని చూస్తున్నారని, కానీ ప్రజలే ఆయన్ను రాజకీయాల నుండి డైవర్షన్ చేసి ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. ‘‘మెడికల్ కాలేజీల విషయంలో జగన్‌వి పచ్చి అబద్ధాలు. మీ ఎంపీలు ఢల్లీిలో పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీలో పీపీపీ మోడల్‌కు మద్దతు తెలుపుతూ సంతకాలు పెడతారు. కానీ అతను మాత్రం ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. పీపీపీ మోడల్ ద్వారా ఇతర రాష్ట్రాలు ఏవిధంగా అభివృద్ధి చెందుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ ఉంది. గతంలో కోడికత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలతో ప్రజలను నమ్మించవచ్చని భావించారు. ఇప్పుడు మళ్ళీ ‘కోటి సంతకాలు’ అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. గతంలో మిమ్మల్ని నమ్మి మోసపోయామని గ్రహించిన ప్రజలు, ఈసారి కూటమి ప్రభుత్వానికి పట్టంగట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది’’ అని సవిత స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జగన్ మాటల్లో వాస్తవం లేదని దుయ్యబట్టారు.
‘‘17 కాలేజీలు తెచ్చానని చెప్పుకుంటున్న జగన్, వాటి కోసం రాష్ట్రం నుండి పెట్టిన పెట్టుబడి సున్నా. ఖర్చు పెట్టిన రూ.1550 కోట్లు కూడా కేంద్ర నిధులే. కాలేజీలు ఏ దశలో ఉన్నాయి? మీరు చేసిన ఖర్చు ఎంత? అనే విషయాలపై ఆరోగ్య మంత్రి త్వరలోనే లెక్కలతో సహా మీ ముసుగు తొలగిస్తారని సవిత హెచ్చరించారు. నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘‘అందుకే పీపీపీ మోడల్‌లో కాలేజీలను పూర్తి చేయాలని నిర్ణయించాం. ఈ విషయంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నది గొప్ప నిర్ణయం. ప్రజలకు మేలు జరుగుతుంటే దానిమీద కూడా రాజకీయం చేయడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. మేము క్లారిటీగా ఉన్నాం. మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో పూర్తి చేస్తాం. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం. మీలాగా పరిపాలనను గాలికి వదిలేసే ప్రసక్తే లేదు. పీపీపీ మోడల్ అంటే ఏమిటో జగన్‌కు తెలుసు. ఇతర రాష్ట్రాల్లో అది ఎంత సక్సెస్ అయిందో కూడా తెలుసు.
కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే విషం కక్కుతున్నారు. కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరించడం.. ప్రపంచ బ్యాంకుకు ఉత్తరాలు రాసి రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేయడం.. పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకోవడం.. ఇదా మీ రాజకీయం? మీరు ఏంచేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఆఖరికి మీ సొంత తల్లి, చెల్లి కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరంటే మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతోంది’’ అని మంత్రి సవిత ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అన్ని శాఖలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. ‘‘సూపర్ సిక్స్ పథకాలతోపాటు చెప్పని ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఐటీ మంత్రి లోకేశ్ దేశవిదేశాలు తిరిగి భారీగా పెట్టుబడులను, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశాం. రోడ్లపై గుంతలు పూడ్చడం దగ్గర నుండి మహిళా సంక్షేమం వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు.
‘‘జగన్, మీలాగా మేము పరిపాలనను గాలికి వదిలేయలేదు. రాజధానిని నాశనం చేసి, పోలవరాన్ని పడకేయించి, టిడ్కో ఇళ్లను గాలికి వదిలేసిన చరిత్ర మీది. ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చారు. బీసీ భవనాలను, గురుకులాలను పట్టించుకోలేదు. బీసీలపై అక్రమ కేసులు పెట్టారు. మీ దెబ్బకు ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. కానీ మేము మీరు గాలికి వదిలేసిన మెడికల్ కాలేజీలను, టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ప్రజల సొమ్ముతో మొదలైన ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేయాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. మీలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మాకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సలహాలు ఉంటే ఇవ్వండి. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకుంటూ ‘ఆంధ్రప్రదేశ్ ద్రోహి’గా మిగిలిపోవద్దు’’ అని మంత్రి సవిత హితవు పలికారు. మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో పూర్తి చేసి తీరుతామని, ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ‘‘అధికారంలోకి వస్తాం.. గుడ్డలు ఊడదీసి కొడతాం.. పోలీసులు సముద్రంలో దాక్కున్నా వదిలిపెట్టం’’ అంటూ జగన్ అరాచక భాష మాట్లాడుతున్నారు.
జగన్, ముందు ఆ భ్రమల్లోంచి బయటకు రండి. గతంలో ‘నేనే 30 ఏళ్ల ముఖ్యమంత్రిని’ అని రొమ్ము విరుచుకుని చెప్పారు కదా. మరి ప్రజలు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పార్టీ ఉనికి కోల్పోయింది. మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది’’ అని సవిత ఘాటుగా విమర్శించారు. ‘‘మీరు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలకు అర్థమైపోయింది. ఆ కోటి సంతకాలకి ఏవైనా ఆధార్ ప్రూఫ్‌లుంటే అవి కూడా జత చేయండి. ఎందుకంటే ప్రజలు మీతో ప్రయాణించడానికి సిద్ధంగా లేరు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా, ప్రజలు మీవైపు తిరిగి చూసే పరిస్థితి లేదు’’ అన్నారు. రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్రప్రదేశ్’గా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనన్న విషయం గుర్తుంచుకోవాలని జగన్‌కు హితవు పలికారు. రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోకుండా, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధికి సహకరించాలని హితవు చెప్పారు. ప్రజల సొమ్ముతో కట్టిన ఆస్తులను కాపాడుతూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పని చేస్తున్నాం. మీ బెదిరింపులకు, డ్రామాలకు భయపడేది లేదని మంత్రి సవిత తీవ్రస్వరంతో హెచ్చరించారు.















