- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరజీవిలో పొట్టి శ్రీరాములు విగ్రహం, స్మృతివనానికి నమూనాల విషయమై కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అధినేత అనిల్‌తో మంగళవారం ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ సమావేశ మయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు స్మృతివనానికి 6.8 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా స్మృతివనం నిర్మాణంపై సంస్థ ప్రతినిధులతో కూలకుషంగా చర్చించారు. గతంలో విజయవాడలో కట్టిన అంబేద్కర్ స్మృతివనంలో ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొట్టి శ్రీరాములు స్మృతి వనం వీలైనంత తొందరలోనే నిర్మిస్తామని వారు తెలపడం జరిగిం ది. విగ్రహం పది కాలాల పాటు దృఢంగా ఉండే విధంగా తీసు కోవలసిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్కిటెక్చర్స్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.