- సుప్రీంకోర్టు తీర్పు అనుసరించే తుది నిర్ణయం
- మండలిలో మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి(చైతన్యరథం): వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఒప్పంద ప్రాతి పదికపై నియమించిన ఎంపీహెచ్‌ఏ (మేల్) పారామెడికల్ సిబ్బంది తొలగింపు వ్యవహా రంలో ప్రభుత్వం సుప్రీంకోర్ట్ తుది తీర్పునకు లోబడి వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం మండలిలో సభ్యులు పాల వలస విక్రాంత్, ఇసాక్ బాషా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మల్టీప ర్పస్ హెల్త్ వర్కర్లు గత కొన్ని దశాబ్దాలుగా వైద్య ఆరోగ్యశాఖలో సేవలందిస్తూ ప్రజా రోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పారు. వీరి విషయంలో ప్రభుత్వం కూడా సానుకూల వైఖరినే అనుసరిస్తుందని వివరించారు.