- సెప్టెంబర్ నెలాఖరుకు అన్నిస్థాయిల్లో కమిటీలు పూర్తిచేస్తాం
- జగన్‌ని కలవడానికి ఇప్పుడు కూడా విఐపి పాస్ కావాలంట
- అహంకారంతో కాదు… ప్రేమతో ప్రజల మనసులను గెలవాలి
- కమలాపురం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్
కమలాపురం (చైతన్యరథం): సెప్టెంబర్ చివరినాటికి పార్టీలోని అన్నిస్థాయిల్లో కమిటీలను పూర్తిచేసి, అక్టోబర్ నుంచి పార్టీ బలోపేతంపైనే దృష్టిసారిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లెలో కమలాపురం నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంగళవారం మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…బాదుడే, బాదుడు, బాబు ష్యూరిటీ ` భవిష్యత్తుకు గ్యారంటీ వంటి 10 కార్యక్రమాలను గత అయిదేళ్లలో సమర్థవంతంగా నిర్వహించడం వల్లే 2024లో ఘనవిజయం సాధించామన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని గుర్తించి పదవులు ఇస్తాం, అన్నిస్థాయిల్లో నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలచుట్టూ మీరు తిరిగితే పార్టీ మీ చుట్టూ తిరుగుతుంది. ఎవరి సిఫారసుల వల్ల పదవులు రావు, పనితీరు ప్రాతిపదికగా మాత్రమే గుర్తింపు ఇస్తాం.
ఎన్నికలకు ముందు పార్టీ పిలుపు ఇచ్చిన ఇచ్చి దాదాపు 10 కార్యక్రమాలు, తర్వాత పార్టీ సభ్యత్వం, సుపరిపాలనలో తొలి అడుగు, ఇతర కార్యక్రమాలను బాగా అమలుచేసిన వారిని గుర్తిస్తాం. పార్టీ పదవులను కూడా క్రియాశీలకంగా పార్టీకి పనిచేసిన వారికే ఇచ్చాం. ఏ స్థాయిలో పనిచేశారో పరిశీలించాకే పదవులు ఇచ్చాం. ఈ ప్రక్రియ అంతటినీ అధినేత చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చా. అధినేత చంద్రబాబు, నేను ఎక్కడ పర్యటనకి వెళ్లినా ముందుగా అక్కడ కార్యకర్తలను కలుస్తున్నాం. కష్టపడినవారికి, ఫోటోలు దిగేవారికి వ్యత్యాసం చూపాలని గతంలో కేడర్ కోరారు. టెక్నాలజీని ఉపయోగించి కష్టపడిన వారిని గుర్తిస్తానని ఆనాడు చెప్పాను. ఆ మేరకే కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇస్తున్నాం, కష్టాన్ని, పనిని నమ్ముకుంటే మిమ్మల్ని వెదుక్కుంటూ తాము వస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
ప్రేమతో ప్రజల మనసులు గెలవాలి
అహంకారంతోకాదు, ప్రేమ, ఆప్యాయతలతో మనం ప్రజల మనసులను గెలవాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలి. అహంకారం లేకుండా బాధ్యతగా మెలగాలి. గత ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా కడప, కర్నూలు జిల్లాలో అత్యధిక సీట్లు సాధించాం. ఓర్పు, సహనంతో రాజకీయం చేయడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే ఈ రోజు మన పార్టీ నిలబడిరది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అహంకారంతో విర్రవీగడంతో 151 సీట్లు 11 అయ్యాయి. చంద్రబాబుని అరెస్టు చేసినపుడు ఒక మహిళా మంత్రి స్వీట్లు పంచి, టపాసులు కాల్చారు. ఇప్పుడు కూడా జగన్ ను కలవడానికి వైసీపీ కార్యకర్తలు విఐపి పాస్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆయన కార్యకర్తలను విస్మరిస్తున్నారు. ఒక కార్యకర్తను కారు కింద తొక్కించి చంపేశారు. మనం ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారెవరినీ వదలం. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయంలో మేము చాలా క్లారిటీతో ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పిస్తాం
2019-24మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తాం. ఎస్పీ, డిఐజితో మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడతారు. రూ.120కోట్లు తప్ప ఉపాధి హామీ బిల్లులన్నీ ఇచ్చేశాం, పెండిరగ్‌లో ఉన్న మిగిలిన ఉపాధి హామీ బిల్లులు చెల్లిస్తాం. మార్చిలోగా నీరు-చెట్టు, ఉపాధి హామీ బిల్లులన్నీ చెల్లిస్తాం. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సమస్యలపై చర్చించి నాయకులు ఎక్కడికక్కడే పరిష్కరించాలి. ప్రభుత్వ పథకాల అమలులో పలు సమస్యలను కొందరు నా దృష్టికి తెచ్చారు, అవన్నీ పరిష్కరిస్తాం. సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలన్నీ దాదాపు పూర్తిచేశాం, ఆర్థికంగా ఇబ్బందులున్నందున ఒకటి, రెండు పెండిరగ్‌లో ఉన్నాయి, పాదయాత్రలో ఇచ్చిన హామీలు కూడా పూర్తిచేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి, రెండిరటినీ బ్యాలెన్స్‌గా ముందుకు తీసుకెళతాం. నేను ప్రతి పొలిట్‌బ్యూరో సమావేశంలో కేడర్ తరపున పోరాడుతున్నా. నమ్ముకున్న దాని కోసం పోరాడుతున్నా, అధినేత వద్ద అందరికన్నా నేనే ఎక్కువ తిట్లు తింటున్నా. సమస్యలను నాలుగుగోడల మధ్య చర్చించుకొని నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడాలి. 2029 ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలి. మేము తీసుకునే 10 నిర్ణయాల్లో 3 తప్పు అవుతాయి, వాటిని సరిదిద్దుకుంటామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రెడ్డివారి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.