- గత ఎన్నికల్లో ఆయన అనుచరులు వేధించారు
- ఏజెంట్లుగా పనిచేయకుండా కేసులు పెట్టారు
- న్యాయం చేయాలని ప్రజావినతుల్లో బాధితులు
- వైసీపీ నాయకుల భూకబ్జాలపైనా ఫిర్యాదులు
- అర్జీలు స్వీకరించిన కంభంపాటి, అశోక్‌బాబు
మంగళగిరి(చైతన్యరథం): తమపై పెద్దిరెడ్డి, వారి అనుచరులు అక్రమ కేసులు పెట్టి హింసించి గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎలక్షన్ ఏజెంట్లుగా పనిచేయకుండా తమను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారని చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన జి.సుబ్బరాజు, ఎల్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యా దు చేశారు. నేటికీ స్థానిక పోలీసులు, అధికారులు పెద్దిరెడ్డి కుటుంబానికి తొత్తులుగా పనిచేస్తున్నారని.. కేసులు పెట్టినా పట్టించుకోవడం లేదని తెలిపారు. టీడీపీ సానుభూతి పరుల సమస్యలంటేనే పక్కన పెడుతున్నారని వివరించారు. దీనిపై విచారించి ఆ అధి కారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, బ్రాహ్మణ సాధికార సమి తి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్ అర్జీలు స్వీకరించారు.
` గత 30 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలుగా ఉన్న తాము వైసీపీ నాయకుల మాట విన లేదని భూమిని కబ్జా చేసి రికార్డులు మార్చి షేక్ ఖాతిజాబీ పేరున మార్చారని కడప జిల్లా గోపవరం మండలానికి చెందిన వైకుంఠం రామకేశయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
` తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని వల్లంకి రాజారావు వారి కుటుంబసభ్యులు ఆక్రమించుకున్నారని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన బల్లంకి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. వారి కబ్జా నుండి తన ఇంటిని విడిపించాలని వేడుకున్నాడు.
`క్రికెట్ బెట్టింగ్, దొంగ లాటరీ వ్యాపారంతో తెనాలి పట్టణ వైసీపీ కౌన్సిలర్ పారం సంజీవరెడ్డి సమాజాన్ని చెడగొడుతున్నాడని… అతనిపై విచారణ జరిపించి చర్యలు తీసు కోవాలని తెనాలికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
` కోర్టులో ఉన్న భూమికి రూ.10 లక్షలు లంచం తీసుకుని మ్యూటేషన్ చేసిన తహసీల్దారు గోపాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన గరికపాటి లింగారావు ఫిర్యాదు చేశారు.
` గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గ్రామా భివృద్ధికి సహకరించాలని అల్లూరి జిల్లా ఏటపాక మండలం గౌరీదేవి పేటకు చెందిన రంగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూల్చి కొత్తది నిర్మించాలని కోరారు.
` తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన కాశీ విజయలక్ష్మి తెలిపారు. అధికారులకు అర్జీలు పెట్టుకున్న పట్టించుకోవడంలేదని..తన భూసమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
` తనకు వారసత్వంగా వచ్చిన భూమిని తన అన్న అక్రమంగా మొత్తం ఒక్కడే తన పేరు మీద ఎక్కించుకున్నాడని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన పండు తిరుపతిదాసు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారించి తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశాడు.
` తమ భూమిని మరొకరి పేరుపై తప్పుగా ఆన్‌లైన్ చేశారని.. దాన్ని సరిచేసి తమ భూమి తమకు ఆన్‌లైన్ అయ్యేలా చూడాలని అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండ లం నాయునిచెరువుపల్లె గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాసులు కోరాడు.
` శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లి గ్రామానికి చెందిన జి.విజయ్‌కుమార్ సమస్యను వివరిస్తూ తాము గత 20 ఏళ్ల నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ లో పనిచేస్తున్నామని వివరించారు. 2019 వరకు తమకు జీతాలు సక్రమంగా అందా యని. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో తమకు రావాల్సిన జీతాలను శ్రీ లక్ష్మీ నరసింహ మోటార్ ఇండస్ట్రీ వారు ఇవ్వలేదని తెలిపారు. వారు బిల్లులు చేసుకుని తమకు జీతాలు ఎగ్గొట్టారని..న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశాడు.
` తాను టీడీపీకి సానుభూతిపరుడినని గత ప్రభుత్వం తనకు వస్తున్న పింఛన్‌ను అకారణంగా తొలగించిందని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసము ద్రం గ్రామానికి చెందిన రామయ్య ఫిర్యాదు చేశాడు. తనకు తొలగించిన పింఛన్‌ను పునరుద్ధరించి న్యాయం చేయాలని కోరారు.
` తనను కులాంతర వివాహం చేసుకున్న తన భర్త మోడెం స్వామికొండ పెళ్లి అనం తరం విడాకుల కోసం చిత్ర హింసలు పెట్టాడని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన గొర్ల శిరీష ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న బంగారం డబ్బులు తీసుకుని తనకు తెలి యకుండా మరో పెళ్లి చేసుకున్నాడని..అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసింది.