- నిర్వాసితులకు ఏడాదిలోనే రూ.1894 కోట్ల విడుదల
- వారంలో వెలిగొండ పనులను సీఎం పరిశీలిస్తారు
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
విజయవాడ (చైతన్యరథం): పోలవరం పనుల పురోగతిని కళ్లుండి చూడలేని కబోదిలా వైసీపీ తయారైందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. చుయ్యబట్టారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల పురోగ తిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కరపత్రిక సాక్షిలో పోలవరం పనుల పురోగతిపై విమర్శ లు చేయడం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అధికారం ఇస్తే 2 శాతం పనులు మాత్రమే చేయగలిగారని, అలాంటప్పుడు ఆ పార్టీ పోలవరం పనుల గురించి మాట్లాడటం, విమర్శలు చేయడం విడ్డూరం కాకపోతే మరి ఏమిటన్నారు. 2014 -19 హాయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తి అయినట్లు మంత్రి వివరించారు. పోలవరం పనులు పరుగులు పెడుతున్న విషయాన్ని ఆయన వివరించారు.
2027 సంవత్సరం చివరికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణ, శ్రద్ధాసక్తులతో ఈ ప్రాజెక్టు నిర్దేశిత గడువు కంటే ముందుగా 2027 గోదావరి పుష్కరాలు నాటికి పూర్తి చేయాలని సూచించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో, లేదో చెప్పలేమని అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఇరిగేషన్ మంత్రులు, సాక్షాత్తు నాటి ముఖ్యమం త్రి జగన్ ఈరోజు మాట్లాడటానికి అనర్హులన్నారు. నాడు కేంద్రం రీయింబర్స్ చేసిన 3,000 కోట్ల నిధులను మళ్లించేసి పోలవరాన్ని ముంచేసిన ఘనుడు జగన్ అని దుయ్యబట్టారు. జగన్ విధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ స్థానే కొత్త డయాఫ్రం వాల్ నేటికి పూర్తి చేయగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరంలోనే నిర్వాసితులకు ఏడాదిలోనే రూ.1894 కోట్లు విడుదల చేసిన ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2026లో అనకాపల్లి వరకు నీరు ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ పనులు
రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురో గతిని వివరించారు. 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో తమ శాఖ పనిచేస్తుందన్నారు. జనవరి మొదటివారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని చెప్పారు. రూ456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులు చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. అలాగే రాయలసీమలోని హంద్రీనీవా, ఉత్తరాంధ్రలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించు కుని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహా దారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి పాల్గొన్నారు.











