- ఇదిగో వాస్తవం..వైసీపీ కొత్త డ్రామాకు తెర
- నాడు 41.15 మీటర్ల ప్రస్తావన చేసింది జగన్‌రెడ్డే
- 2023లో అప్పటి కేంద్రమంత్రే పార్లమెంట్‌లో చెప్పారు
- కేంద్ర మంత్రి ప్రకటనను తప్పుగా చేసి ప్రచారం
- ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ను నాశనం చేసిన జగన్‌రెడ్డి
- తప్పుడు ప్రకటనలతో ఇప్పుడు సుద్దపూస కబుర్లు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది. 2014`19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 72 శాతం పోలవరం పను లు పూర్తి చేస్తే.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి కేవలం 3.8 శాతం పనులు మాత్రమే తూతూమంత్రంగా చేసింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌పై ఏదో వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు వైసీపీ నేతలు, ఎంపీలు గుండెలు బాదుకోవడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కనీస అవగాహన లేకుండా ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించేస్తున్నారు..డీపీఆర్ ప్రకారమే కేంద్రం నిధులు ఇస్తామని ప్రకటన చేసింది.. 41.15 మీటర్ల వరకే ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎడారి అవుతుంది..అంటూ దుష్ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తు న్నారు. పార్లమెంట్‌లోనూ అదే పనిగా ఈ ప్రస్తావన తెస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు ఐదేళ్ల పాటు జగన్‌రెడ్డి పాలనలో పోలవరం ప్రాజెక్టే కాకుండా రాష్ట్రంలో 63కి పైగా ప్రాజెక్టుల పనులను గాలికొదిలేశారు.
సుమారు 15 నెలల పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎటువంటి పనులు చేపట్టకపోగా…2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణ మయ్యారు. పోలవరం నిర్మాణం రికార్డ్ టైంలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో తొడలు కొట్టి సవాల్ విసిరిన నాటి వైసీపీ మంత్రులే…తర్వాత నాకు సంబంధం లేదు.. ఆ ప్రాజెక్ట్ నాకు అర్థం కావడం లేదని చెప్పడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇలాంటి అవగాహన లేని వారికి నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన జగన్‌రెడ్డికి ప్రాజెక్టులపై ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఐదేళ్ల పాటు కమీషన్ల కోసం కాంట్రాక్ట ర్లను మార్చడం, చెరువులు, రిజర్వాయర్ టెండర్లు నచ్చిన వారికి ఇచ్చి డబ్బులు దండు కోవడం తప్పితే… తట్ట మట్టినైనా ఒక ప్రాజెక్ట్ కోసం పోసిన దాఖలాలు ఎక్కడా లేవు.
పోలవరానికి కేటాయింపులపై తప్పుడు ప్రచారం
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేసేందుకు అవస రమైన సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం నిధులు కేటాయించింది. పోలవరం అసలు ఎత్తు 45.72 మీటర్ల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రాజెక్ట్ ను తగ్గించేశారన్న అంశమే ప్రస్తావనకు రాదు. ప్రాజెక్ట్‌కు సంబంధించి నీటి నిల్వను 41.15 మీటర్ల వరకూ చేయడానికి అవసరమైన నిధులను కేంద్రం చెల్లిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు రూ.5,936 కోట్లు బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. అంతే తప్పితే పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల వరకే నిర్మించాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. అసలు ఆ ప్రస్తావనే ఎక్కడా లేదు. ఈ అంశం పై అవగాహన లేకుండా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రకటనలు చేయడం వారి డొల్లతనానికి, దుష్ప్రచారానికి నిదర్శనం.
ప్రాజెక్ట్ తొలిదశ ప్రస్తావన తెచ్చిందే జగన్‌రెడ్డి
2019- 2024 మధ్య కాలంలో సీఎంగా ఉన్న సమయంలో జగన్‌రెడ్డి పోలవరం తొలి దశ అనే మాటను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. ఇదే విషయాన్ని పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యాం ఎత్తును తొలిదశలో 41.15 మీటర్ల వరకే ప్రతిపాదించింది జగన్‌రెడ్డి అంటూ 2023లో కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయంలో 72 శాతం పూర్తయింది.. మళ్లీ చంద్రబాబే అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాజెక్ట్‌ను జూన్ 2021 లోగా పూర్తయిపోయేది. అధికా రంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అవినీతి సొమ్ము కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ ను మార్చేసి వచ్చిన వరదలకు పోలవరం ప్రాజెక్టును నట్టేటముంచేశాడు. కనీసం ప్రాజెక్ట్‌పై అవగాహన లేని వైసీపీ నాయకులు తొలి దశ అంటూ పెద్ద డ్రామాకు తెరతీ శారు. ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు, గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 196.40 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు వైసీపీ హయాంలోనే కుదిం చారన్న ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికే కేంద్రం నిధులు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో కేంద్రం సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేసింది. మొదట కొంతమేర అయినా నీళ్లు నిలుపుకుంటే ఆ తర్వాత ఆర్‌అండ్‌ఆర్ ఇచ్చి మిగిలిన 45.72 మీటర్ల వరకు నీటిని నిలుపుకోవచ్చు.
ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లే
సాంకేతిక పరంగా చూస్తే పోలవరం ఎత్తు తగ్గింపు అనే ప్రతిపాదన ఎక్కడా లేదు. గత ఐదేళ్ల పాటు పోలవరం పనులు నిలిచిపోయాయి. వ్యయభారం సుమారు వేల కోట్లు దాటేసింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించే అంశాన్ని వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చాలా ఖర్చు గా మారాయి. తొలుత పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకుని నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ విషయం తెలియని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై అనవరంగా తప్పుడు ప్రచారానికి తెర తీశారు.
పరుగులు పెడుతున్న పనులు
పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఢల్లీి చుట్టూ అనేకసార్లు తిరిగి రావాల్సిన బకాయిలు, కావా ల్సిన అనుమతులను వెంట వెంటనే వచ్చేలా కేంద్ర మంత్రులను ఒప్పిస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. పోలవరం పనులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. వైసీపీ నిర్వాకం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో డయాఫ్రం వాల్ 2.0 నిర్మాణ పనులు రూ.990 కోట్లతో ప్రారంభించారు. పోలవరం నిర్వాసితులకు జగన్ సర్కార్ ఇస్తానని మోసం చేసిన ఆర్థిక ప్యాకేజీ రూ.1000 కోట్లు విడుదల చేశారు. ఐదేళ్ల పాటు నిలిచిపోయిన పోలవరం ఎడమ కాలువ పనులకు రూ.1,200 కోట్లతో టెండర్లు పిలిచి 8 దశల్లో పనులు ఖరారు చేసి మొదలు పెట్టేలా చేశారు. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి రూ.6,434 కోట్లు అవసరం అవుతాయని లెక్కించారు. ప్రస్తుతం నిర్వాసితుల తరలింపు కోసం 51 కాలనీల్లో వేల ఇళ్ల నిర్మాణా లు మొదలయ్యాయి.
అనలిస్ట్ -ప్రవీణ్ బోయ