- అనుకున్న సమయానికే పూర్తి చేసేలా చర్యలు
- నిధులను సాధించి చంద్రబాబు వేగం పెంచారు
- జగన్‌రెడ్డి పాలనలో ప్రాజెక్టుకు తీవ్ర నష్టం
- ఆ పార్టీ నాయకులకు మాట్లాడే అర్హత లేదు
- మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పను లను శరవేగంగా పూర్తి చేయనున్నట్లు మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేసి ప్రతి ఆయకట్టుకు నీరందించి రైతుల కళ్లల్లో సంతోషాన్ని చూడాలనేదే చంద్రబాబు ఏకైక లక్ష్యం. విభజనతో రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. అంతకంటే ఎక్కువగా వైసీపీ పాల నలో జరిగింది. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రూ.11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. జగన్ హయాంలో రూ. 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో 3 శాతం మాత్రమే పనులు జరిగాయి. చేసిన పనులు కూడా నాసిరకంగా జరిగాయి. తెలుగుదేశం హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యా యి. వైసీపీ హయాంలో పోలవరం నిధులను పూర్తిగా దోచేశారు. వైసీపీ హయాంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. జగన్ తప్పి దం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినట్లు నీతిఆయోగ్ కూడా నిర్ధారించింది. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, రాజధాని లేనప్ప టికీ చెట్టుకింద ఉండి పరిపాలన సాగించారు. అప్పుడు ఉద్యోగస్థులు కూడా టీడీపీకి సహకరించడం గొప్ప విషయం. పోలవరంలోని 7 ముంపు మండలాలు ఏపీలో కలపా లని రాజ్యసభ, లోక్‌సభలో పట్టుబట్టారు. బిల్ అయితేనే తప్ప తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని మొండికేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అనేక సంస్కరణలు తీసుకొ చ్చారు. రైతుల కోసం, పోలవరం ముంపు నిర్వాసితుల కోసం, ముంపు మండలాల ప్రజల కోసం ఆయన పనిచేశారు.
జగన్‌రెడ్డి గాలికొదిలేశారు
జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పనిలేదని చేతులు దులుపుకున్నారు. పోలవరం నిర్మాణాన్ని జగన్ గాలికొదిలేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పరు గులు పెట్టించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తోంది. రూ.12,157 కోట్లు మంజూరు చేసి అందులో మొదటి విడతగా రూ.5,050 కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఆయన కృషి, పట్టుదల, చొరవ మనకు కనిపిస్తున్నాయి. 72 శాతం పనులు దగ్గరుండి పూర్తి చేయించారు. 82 సార్లు పోలవరాన్ని పర్యటించారు. జగన్ కాకమ్మ కబుర్లు చెప్పారు తప్ప చేసిం దేమీ లేదు. జగన్ పోలవరానికి ఎన్నిసార్లు వెళ్లారో, ఏమేమి పనులు చేశారు, ఎంతమంది నిర్వాసితులను కాపాడారో చెప్పాలని ప్రశ్నించారు. డిసెంబర్ 20 కల్లా పోలవరాన్ని పూర్తి చేసేస్తామని అప్పటి వైసీపీ ఇరిగేషన్ మంత్రులు మాట్లాడారు. పర్సంటా? అరపర్సంటా? వెయిట్.. తొందరెందుకన్నా.. వెయిట్ 2021 కల్లా పూర్తి చేసేస్తామని అప్పటి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అంటే.. ఆ డయాఫ్రమ్ వాల్ ఏందో, ఆ క్యూసెక్కులంటే ఏందో నాకు తెలియదని, నన్నెందుకు అడిగి చంపుతారని ఆనాటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. వారి నాయకుడు జగన్ 2021 ఖరీఫ్ కల్లా రైతుల పంట పొలాలకు నీరిచ్చేస్తామని చెప్పి ఇవ్వకుండా మొత్తం పోల వరాన్ని నాశనం చేశారు.
చంద్రబాబు ఒక లక్ష్యంతో, ఒక సంకల్ప బలంతో పోలవ రాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. కేంద్రం అప్పట్లో పీపీఏ వద్దంటున్నప్పటికీ జగన్ రివర్స్ టెండర్‌లో వెళ్లారు. రూ.25 వేల కోట్లు రాష్ట్రానికి నష్టం కలిగించారు. నదుల సంధానానికి పోలవరం గుండెలాంటిది. అటువంటి పోలవరం విషయంలో జగన్ క్షమించరాని నేరం చేశారు. పోలవరం నిర్మాణంలో జాప్యం కారణంగా ఆనాడు రూ.40 వేల కోట్ల పంట నష్టం జరిగింది. బిల్లులు చెల్లిం చని కారణంగా కాంట్రా క్టర్లు ఇబ్బందుల పాలయ్యారు. బకాయిలు చెల్లించడానికి కూటమి ప్రభుత్వం ముందు కొచ్చింది. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచే స్తాం. అనుకున్న సమయానికి ప్రతి ఎకరాకి నీరందించేందుకు కృషి చేస్తాం. వైసీపీ పాలకుల స్వార్థ రాజకీయాల కోసం పోలవరం ప్రాజెక్టును, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చరిత్ర వైసీపీది. అందుకే వైసీపీ నాయకులు చరిత్ర హీనులుగా నిలిచారు. పోలవరం ప్రాజెక్టు విష యంలో అన్యాయం చేసిన వైసీపీకి పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని హితవుపలికారు.