- అబద్ధాలు మాట్లాడితే నాలుక చీరేస్తాం
- తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదారి పట్టిస్తారా
- అమరావతి, పోలవరాన్ని భ్రష్టుపట్టించింది నీతి కబుర్లా
- వెలిగొండను బాబు పూర్తి చేస్తే మీరు ప్రారంభించారు
- మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి ప్రజాసంక్షేమ బడ్జెట్‌ను ప్రవే శపెడితే వైసీపీ నాయకులు తప్పుడు లెక్కలు చూపి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా స్వరనాశనం చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని శాండ్, ల్యాండ్, లిక్కర్, రేషన్ మాఫియాల మయం చేశారు. 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ జగన్‌కు బుద్ధి రాలేదు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను ప్రవే శపెడితే జగన్ ఓర్వలేక తన నీలి మీడియా ద్వారా విషం కక్కుతున్నాడు. ప్రభుత్వం రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.రూ.8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.4,332 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణకు రూ.1,220 కోట్లు, పాఠశాల విద్యా శాఖకు 31,800 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు కేటాయించడంతో వైసీపీ వారికి బాధే స్తోంది. కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం మొదలు పెట్టారు. పబ్లిక్ డొమైన్‌లో అనౌన్స్ చేసిన దాన్ని వైసీపీ వారు వక్రీకరిస్తున్నారు. బడ్జెట్‌లో తక్కువ కేటాయించారని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
అమ్మఒడితో మోసగించి నేడు అబద్ధాలా..
తల్లికి వందనంకు మేం రూ.9,407 కోట్లు కేటాయిస్తే… కేవలం రూ.8,276 కోట్లు మాత్రమే మేం కేటాయించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గతంలో వైసీపీ నాయ కులు అమ్మఒడి పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. చెప్పినట్లు రూ.15 వేలు ఇవ్వకుండా ఇంట్లో ఒక్కరికి మాత్రమే రూ.13 వేలిచ్చారు. అది కూడా అరకొరగా ఇచ్చారు. వారు ప్రకటించిన దానికన్నా దాదాపు 1,34,400 మందిని వాళ్లే కుదించేశారు. అమ్మఒడిని నాశనం చేశారు. నేడు కూటమి ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారు. అమ్మఒడికి 2019లో రూ.6,349 కోట్లు ఇచ్చి నాన్న బుడ్డి నుంచి రూ. 20,046 కోట్లు లాక్కున్నారు. ఇలా 2020-21, 2021-22, 2022-23, 2023-24 మొత్తం కలిపి వీరు అమ్మఒడికి రూ.26 వేల కోట్లు కేటా యించారు. దానికి రూ.96, 516 కోట్లు మద్యం రూపేణ లాక్కున్నారు. వైసీపీ నాయ కులది నోరో, తాటిమట్టో అర్థం కావడం లేదు. మద్యం రేట్లు విపరీతంగా పెంచారు. డిజిటల్ కరెన్సీని పక్కన పెట్టారు. డైరెక్టుగా క్యాష్ డీల్ చేసి దోచుకున్నారని విమర్శించారు.
దీపం పథకంపైనా వక్రీకరణలా…
మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు దీపం పథకం ప్రవేశపెడితే దాన్ని జగన్ భ్రష్టు పట్టించారు. నేడు దీపం-2 పథకం కింద రూ.2,601 కోట్లు కేటా యించడమే కాకుండా గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోనే వారికి సిలిండర్ అందించ డంతో పాటు వాళ్ల ఖాతాల్లోకి రూ.800 నుంచి రూ.900 వరకు వేస్తూ 93 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ లెక్కలను వైసీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు. వైసీపీ హయాంలో గ్యాస్ ధర పెరిగితే.. అంతమంది వైసీపీ ఎంపీలను పెట్టుకుని కూడా గ్యాస్ ధరలు తగ్గించమని ఏనాడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. నేడు ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూటమి ప్రభుత్వం ఇస్తోంది. వైసీపీ హయాంలో నిరుద్యో గులు ఉద్యోగాలు కావాలని కోరితే మటన్, చికెన్, ఫిష్ అమ్ముకోండన్నారు. కష్టపడి బాగా చదువుకుని హుందాగా ఉండదలచుకున్న వారికి ఇలానేనా సలహాలా ఇచ్చేది? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులేమో మనీ ల్యాండరింగ్, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకు ని లాభపడ్డారు. 20 లక్షల మందికి పైగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు వచ్చాయంటే అది చంద్రబాబు కృషేని వివరించారు.
వెలిగొండను పూర్తిచేసింది చంద్రబాబే
వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి వైసీపీ నాయకులకు సిగ్గులేదా అని హితవుపలికారు. ఈ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తి చేసింది చంద్రబాబే. పూర్తి చేసిన దానిని వైసీపీ నాయకులు ప్రారంభించుకోవడం సిగ్గుచేటు. 2014 నుంచి 2019 వరకు బడ్జెట్‌లో చంద్రబాబు రూ.1973 కోట్లు కేటాయించి రూ.1319 కోట్లు ఖర్చు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ కూడా చంద్రబాబు హయాంలో చేశారు. దానికి సంబంధించి ఏ యక్షన్ తీసుకోలేదు. ఆర్‌ఆర్ ప్యాకేజీ వైసీపీ ప్రభుత్వ బడ్జెట్‌లోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. అందుకు కూటమి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తుంటే వైసీపీ నాయకులు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. జబర్దస్త్ రోజా అమరావతి గురించి అనవసర మాటలు మాట్లాడారు. రోజా నోటికి కళ్లెం పడే రోజు దగ్గరలోనే ఉంది. నారా లోకేష్‌ను ఏకవ చనంతో మాట్లాడారు. అంతకంటే దారుణంగా ఉచ్చరించి మాట్లాడారు. అమరావతి అనేది సెల్ఫ్ సబ్‌స్టైనబుల్ ప్రాజెక్టు అని చంద్రబాబు మొదటి నుంచి చెబుతున్నారు. వైసీపీ సన్నాసులకు అది ఏంటో తెలియదు. వైసీపీకి సంపద సృష్టించడం రాదు. సంపద సృష్టించి దాన్ని సంక్షేమానికి ఖర్చు చేయాలనే ధ్యాస లేదని విమర్శించారు.
అమరావతి, పోలవరాన్ని భ్రష్టుపట్టించింది మీరే
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులే అవసరం లేదు. అమరావతి సబ్ స్టైనబుల్ ప్రాజెక్టు అని ఈ బడ్జెట్‌లో నిరూపించారు. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి రెండు లక్షల కోట్లు ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఆధీ నంలో ఉన్న భూములను దశలవారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పు లను వడ్డీతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బును 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాజధాని వైపు వైసీపీ వాళ్లు ఉమ్మేయడం సబబుకాదు. వైసీపీ వారికి ఆంధ్ర రాష్ట్రమంటే లెక్కే లేదు. పోలవరం ప్రాజెక్టును బాబు 72 శాతం పూర్తి చేశారు. మిగతాది పూర్తి చేయండని ప్రజలు వైసీపీకి మ్యాండెట్ ఇస్తే డయాఫ్రమ్ వాల్ పగలగొట్టేలా చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. అదే ముందుకు తీసుకెళ్లి ఉంటే దాదాపు 600 గ్రామాలకు సాగు, తాగునీరు అంది ఉండేది. ఉత్తరాం ధ్రలో ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందేవి. 20 టీఎంసీ నీరు వాడుకునే వారు. సంపద సృష్టిం చడం కూటమి ప్రభుత్వానికి రాలేదని బుగ్గన మాట్లాడడం అతని అవివేకం. పట్టిసీమ ప్రాజెక్టు గురించి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. చంద్రబాబు ఆలోచన వల్ల నేడు పట్టిసీమ వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తోందని గుర్తుచేశారు. చంద్రబా బు కక్ష సాధింపు ఏరోజు చేయరు..చేయమని ఇతరులు చెబితే సహించరని స్పష్టం చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఉగాది నుంచి ఉచిత బస్సును కూడా ప్రవే శపెట్టబోతున్నాం. మే నుంచి తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు కేటాయించడం జరిగింది. జగన్ నవరత్నాలేమయ్యాయి..బంగాళా ఖాతంలో కలిసిపోయాయి. మేం సూపర్ 6 సూపర్‌గా అమలు చేస్తున్నాం. వైసీపీ హయాంలో దోచుకోవడానికి నాలుగు జోన్లలో నలుగురిని పెట్టారు. వారిలో ఒకరు రాజీనామా చేశారు. ఇప్పటికైనా బడ్జెట్‌పై అబద్ధాలు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.