న్యూఢిల్లీ (చైతన్యరథం): పీఎం` శ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద రాష్ట్రానికి అందించే ఆర్థిక కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గత వైసీపీ హయాంతో పోలిస్తే కేటాయింపులను దాదాపు రెట్టింపు చేసింది. టీడీపీ ఎంపీలు జీఎం హరీష్ బాలయోగి, పుట్టా మహేష్ కుమార్ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి బదులిస్తూ వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో 2023`24లో ఆంధ్రప్రదేశ్ రూ.354.85 కోట్ల నిధులకు అనుమతి పొందగా, అందులో రూ.212.91 కోట్లు కేంద్ర వాటా అని వెల్లడిరచారు. అయితే, 2024`25 ఆర్థిక సంవత్సరంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వంలో, మంజూరు చేసిన నిధులు రూ.782.39 కోట్లకు పెరగగా ఇందులో కేంద్ర వాటా రూ.469.43 కోట్లుగా తెలిపారు. ఈ పెరుగుదల దాదాపు 120 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఏపీ ప్రభుత్వ నిబద్ధతకుఈ కేటాయింపులే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 935 పాఠశాలలు పీఎం` శ్రీ పథకం కింద ఎంపికయ్యాయి. ఇందులో ఏలూరు జిల్లాలో 37, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 28 పాఠశాలలు ఉన్నాయి. ఈ పథకం కింద ప్రస్తుత పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, ఫలితాల ఆధారిత అభ్యాసంతో మోడల్ సంస్థలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు.