- ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక ఇబ్బందులు
- గత ప్రభుత్వంలో అన్యాయంపై విద్యార్థి ఆవేదన
- న్యాయం చేయాలని ప్రజావినతుల్లో గోడు
- అర్జీలు స్వీకరించిన పల్లె, గుమ్మడి గోపాలకృష్ణ
మంగళగిరి(చైతన్యరథం): తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి తరలి వచ్చారు. వారి నుండి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణలు అర్జీలు స్వీకరించి వెను వెంటనే అధికారులతో ఫోన్లలో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
` తాను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 2020-2024 మధ్య బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా అప్పటి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చెల్లించకపోవడంతో తన సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన వనమాడి ఫణికుమార్ తెలిపారు. దాంతో తాను ఎంటెక్ సీటు కోల్పోవాల్సి వచ్చిందని.. దయచేసి తన సర్టిఫికెట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.
` ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్ పరిధిలో కొన్ని సంవత్సరాలుగా తాము వెదురు బొంగుల ఫిల్లింగ్ టెండర్ తీసుకుని స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నామని గిద్దలూ రుకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఇంకా టెండర్ ఇవ్వలేదని.. వీలైనంత త్వరగా టెండర్ ఇచ్చేలా చూస్తే దాదాపు 1000 మందికి పైగా ఉపాధి దొరుకుతుందని వివరించారు.
` పోలవరం ప్రాజెక్ట్ భూ సేకరణలో భాగంగా గతంలో సర్వే చేసి ఒకసారి భూమికి హద్దులు ఏర్పాటు చేశాక మళ్లీ అధికారులు ఇటీవల వచ్చి భూ సేకరణ పేరుతో పేద రైతులు ఎప్పటి నుండో సాగు చేసుకుంటున్న భూములను తీసుకునేందుకు యత్నిస్తు న్నారని ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేటకు చెందిన పలువురు రైతు లు ఫిర్యాదు చేశారు. దీంతో నష్టపోయే అవకాశం ఉందని.. పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని గూడవల్లి సుబ్బారావుతో పాటు రైతులు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
` తాను ఏపీవీవీపీ(డీఎస్‌హెచ్)లో 2018 నుంచి ఉండటం వల్ల క్రమబద్ధీకరణలో తనకు అన్యాయం జరిగిందని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన డి.జయసుధ విన్నవిం చారు. తనను తన మాతృ సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్‌కు పంపి రెగ్యులర్ చేయాలని వినతిపత్రం అందజేశారు.
` తాను ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అచ్చి నరసింహారావు అనే వ్యక్తి వద్ద ఇల్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోగా ఇల్లు ఖాళీ చేసేందుకు ఐదు నెలలు గడువు కోరి పది నెలలు అయినా ఖాళీ చేయలేదని పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపా డు గ్రామానికి చెందిన యాగంటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. అడిగితే ఖాళీ చేసి వెళ్లేది లేదని బెదిరిస్తూ దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోండని అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇల్లు ఖాళీ చేయించి న్యాయం చేయాలని కోరాడు.