- పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి చర్యలు
- అదనపు ఆదాయానికి ఫాడర్ ప్లస్ ఎఫ్‌పీవోలు
- నూతన సొసైటీలకు సౌకర్యాలు కల్పిస్తున్నాం
- పన్ను తగ్గింపుతో లాభాల బాటకు సుగమం
- వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
- తాడేపల్లిలో సహకారంతో సంవృద్ధి కార్యక్రమం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడి పరిశ్ర మాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కార్యాలయంలో సహకారంతో సంవృద్ధి కార్యక్రమంలో మం త్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 10,212 నూతన బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, మత్స్యకార సహకార సంఘాలను 2023 నుంచి నమోదు చేసి నడిపిస్తున్నారు. ఈ సంద ర్భంగా దేశవ్యాప్తంగా బుధవారం సహకారంతో సంవృద్ధి కార్యక్రమం జరిగింది. ఇందు లో భాగంగా కార్యక్రమం జరిగింది. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పాడి పరిశ్రమ, మత్స్యసంపద వృద్ధికి సహకార వ్యవస్థతో బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తు న్నామని తెలిపారు. రాష్ట్రంలో 932 మహిళా డెయిరీ సహకార సంఘాల ద్వారా రోజుకు 1,60,000 లీటర్ల పాలు సేకరించి ఏజెన్సీలకు సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు. తద్వారా 45,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమాభివృద్ధి, సహకార వ్యవస్థ ద్వారా కొత్తగా ఏర్పడిన సొసైటీలకు మద్దతుగా లాభదాయకమైన ధరను పొందడానికి పాల పరీక్ష యంత్రాలు, శీతలీకరణ సౌకర్యాలను కల్పిస్తుందని వివరించారు.
అదేవిధంగా సొసైటీల సభ్యులకు సహకార సూత్రాలు, ఆచరణీయ మార్గాల్లో పాల వ్యాపారం నిర్వహణపై శిక్షణ, సామర్థ్య పెంపుదల దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశుగ్రాసం పెంపకందారులు, పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్రంలో ఫాడర్ ప్లస్ ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేయను న్నట్లు చెప్పారు. సహకార సంఘాలకు నగదు ఉపసంహరణ పరిమితిని సంవత్సరానికి రూ.కోటి నుంచి రూ.3 కోట్లకు పెంచినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పాల సేకరణలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఉత్తమ పాడి రైతులకు, పాల సంఘాలు, మత్స్యకార సంఘాలకు ప్రశంసా పత్రాలు అందచేశారు. మత్స్య పరిశ్రమలో 2,400, ప్రాథమిక సహకార సంఘాలు 3 లక్షల మందికి చేదోడుగా నిలిచాయని పేర్కొంటూ ఈ సంఘ సభ్యులకు బోట్లు, వలలు, చేప పిల్లలు పంపిణీ చేశారు. వారి ఆర్థిక వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సహ కార సంఘాలకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టిందని, సహకార సంఘాలకు ఆదాయ పన్నును 30 శాతం నుంచి 15 శాతానికి కుదించడం ద్వారా అధిక లాభాల బాటలో పయనించేందుకు మార్గం సుగమం అయిందని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్, డైరెక్టర్ దామోదర నాయుడు, మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్, ఆప్కాబ్ సీజీఎమ్ వెంకటరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.