చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పిన్నెల్లి పాపం పండింది

అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలు దోపిడీ

by చైతన్యరధం
Jun 27, 2024 at 6:52am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పిన్నెల్లి పాపం పండింది
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ముందస్తు బెయిల్‌ పిటిషన్ల కొట్టివేతతో అరెస్ట్‌
  • అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలు దోపిడీ
  • దాడులు, హత్యలు, మారణకాండకు నిలయంగా మాచర్ల
  • పిన్నెల్లి మాఫియా చేతిలో 8 మంది హతం
  • 79 మందిపై దాడులు
  • రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ

అమరావతి, చైతన్యరథం: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విజ్ఞత మరిచి జగనాసుర టెర్రరిస్టు మార్గంలో నడిచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్లలో మారణహెరీమం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేట్‌ ఎస్టేట్‌గా భావించారు. మాఫియాలతో ప్రైవేట్‌ సైన్యం నిర్మించారు. మాచర్ల ప్రజలను బానిసలు అనుకున్నారు. సహజ వనరులను కొల్లగొట్టారు. ప్రశ్నిస్తే పైశాచిక దాడులు చేశారు. రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తించారు. ప్రజాదరణతో కాకుండా భయకంపితులను చేసి ఎల్లకాలం పాలన చేయవచ్చునన్న పిచ్చి భ్రమల్లో తేలియాడారు. ఎన్నికల సమయంలో ప్రజలు తిరుగుబాటు చేయడంతో పారిపోయారు. ప్రజాకోర్టులో శిక్షించబడ్డ పిన్నెల్లి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోవడంతో నాలుగు కేసులకు సంబంధించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయమని మరోసారి రుజువైంది. పిన్నెల్లి మాఫియా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. వివిధ వర్గాలకు చెందిన 79 మందిపై దాడులు చేశారు. ఇందులో బడుగు, బలహీన వర్గాల ప్రజలే అధికంగా ఉన్నారు. ఒకప్పుడు అప్పుల్లో మునిగిపోయిన పిన్నెల్లి సొదరులు ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారు. 2011`12 ఏడాదిలో ఏడాదికి రెండు లక్షల రూపాయల ఆదాయంగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆస్తులు ప్రస్తుతం రెండు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ముఠా చేసిన హత్యలు
1 తోట చంద్రయ్య, వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామం
2 కంచర్ల జల్లయ్య యాదవ్‌, దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం
3 బత్తుల సుబ్బులు, దాచేపల్లి మండలం తంగెడ గ్రామం
4 ఖాదర్‌ భాషా, మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం
5 అరెద్దుల కోటయ్య యాదవ్‌, దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామం
6 బయలమడుగు పిచ్చయ్య, పందిటివారి పాలెం గ్రామం
7 గన్నెబోయిన గంగరాజు, మాజీ సర్పంచ్‌ కొత్త పుల్లారెడ్డిగూడెం, వెల్దుర్తి మండలం
8 పంగా వెంకటేశ్వర్‌ యాదవ్‌, వెల్దుర్తి మాజీ ఎంపీపీ

సంబంధితవార్తలు

పిన్నెల్లి ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్‌

పిన్నెల్లి నుంచి ప్రాణహాని

గ్రానైట్‌ మరియు గ్రావెల్‌ దోపిడీ – రూ.1,433 కోట్లు:
1. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్‌ లారీలు పీఆర్కే ట్యాక్స్‌ కింద లారీకి రూ.25 వేల వరకు వసూల్‌ చేస్తున్నారు. రోజుకు 200 లారీలకు పైగా తరలిస్తూ ఐదేళ్లలో రూ.1200 కోట్లు దోచుకుంటున్నారు. ఈ వసూల్‌ బాధ్యతలు బంధువు శివతేజ రెడ్డికి అప్పగించాడు.
2. మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరు, రాయవరం, అలుగురాజుపల్లి, అడిగొప్పల అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వేశారు. గ్రావెల్‌ దోపిడీలో రూ.70 కోట్లు వెనకేశాడు.
3. ఇటుక తయారీ వ్యాపారుల్ని బెదిరించి రూ.5 కోట్లు కప్పం వసూల్‌ చేశాడు. కప్పం కట్టని వారికి మట్టి సరఫరాను నిలిపివేసి వ్యాపారం నడవకుండా అవస్థలు పెట్టాడు.
4. కండ్లకుంట్ల, వెల్దుర్తి మండలాల్లో వందలాది ఎకరాల్లో కంకర తవ్వి అమ్ముకుని రూ.40 కోట్లు వెనకేశాడు.

పీఆర్కే ట్యాక్స్‌ :
1. పేద బడుగు బలహీన వర్గాల కడుపుకొట్టి రేషన్‌ బియ్యాన్ని దారి మళ్లించి రూ.73 కోట్లు దోచుకున్నాడు.
2. నాగార్జున సాగర్‌ సాగునీటి కాల్వల నిర్వహణ, మరమ్మతు పనుల్ని బినామీలకు కట్టబెట్టి పనులు చేయకుండానే బిల్లులు క్లియర్‌ చేయించుకుని రూ.30 కోట్లు తినేశాడు.
పంచాయతీల పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.15 కోట్లు స్వాహా చేశాడు.
3. చిన్న నిర్మాణం చేయాలన్న కప్పం కట్టాల్సిందే. నిర్మాణ వ్యయాన్ని బట్టి ట్యాక్స్‌ వసూల్‌ చేశారు. కనీసం 5శాతం ట్యాక్స్‌ చెల్లిస్తే తప్ప అనుమతులు వచ్చే పరిస్థితి లేదు.
4. రైతులు పొలం పాస్‌ పుస్తకాల కోసం దరఖాస్తు చేస్తే పిన్నెల్లికి రూ.15 వేలు కట్టాల్సిందే.
5. ముడుపులు ఇవ్వనన్నందుకు పరాశక్తి సిమెంటుకు చెందిన ధర్మారెడ్డిపై దాడిచేసి ట్రాన్స్పోర్టు, లేబర్‌, యాష్‌ లాంటి కాంట్రాక్టులన్నీ చేజిక్కించుకున్నాడు.
మద్యం దోపిడీ – రూ.400 కోట్లు:
6. మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీసం 5 బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. నంబర్‌ లేని వాహనాల్లో ‘పి’ బ్రాండ్‌ లిక్కర్‌ తరలిస్తూ అమ్మకాలు చేస్తున్నాడు. క్వార్టర్పై రూ.60 నుండి రూ.150 వరకు అధనంగా వసూల్‌ చేస్తూ ఐదేళ్లలో రూ.400 కోట్లు వెనకేశాడు.
7. తెలంగాణ నుండి నాసిరకం మద్యం దిగుమతి చేసుకుని బార్లు, వైన్‌ షాపుల్లో అమ్మకాలు చేస్తున్నాడు.
8. మాచర్లలోని గ్రీన్‌ పార్క్‌ వెంకటేశ్వర పబ్‌ సహా మరో 7 బార్లు కూడా పిన్నెల్లి చేతుల్లోనే ఉన్నాయి.
పిన్నెల్లి భూ కబ్జాలు – 376 ఎకరాలు :
9. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెదనాన్న పిన్నెల్లి రామిరెడ్డికి నలుగురు కుమార్తెలు ఉండగా వారిని బెదిరించి, 30 ఎకరాల వ్యవసాయ భూముల్ని ఐలవంతంగా తన పేర రాయించుకున్నాడు.
10. సాగర్‌ రోడ్డులో రూ.50 కోట్ల విలువైన 250 ఎకరాల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే కబ్జా చేశాడు.

11. మాచర్ల పట్టణంలోని వినాయకుని గుట్ట వద్ద 7 ఎకరాలు ఆక్రమించి ప్లాట్లుగా మార్చి రూ.20 కోట్లు వెనకేసుకున్నాడు.

12. మాచర్ల పట్టణంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో లే అవుట్‌ వేసి అమ్ముకున్నాడు.

13. మాచర్ల పాత బజార్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి చెందిన 2 ఎకరాలను కబ్జా చేశాడు.

14. విలువైన భూములు కనిపిస్తే తన అనుచరులతో కబ్జా చేయించి, సెటిల్మెంట్ల పేరుతో తక్కువ మొత్తానికి రాయించుకుంటున్నాడు.

15. సాగర్‌ రోడ్డులో కొత్తపల్లి అడ్డురోడ్డులో రూ.15 కోట్ల విలువైన 5 ఎకరాల రైల్వే భూమి ప్లాట్లుగా మార్చి అమ్మేశాడు.
16. వెల్దుర్తిలో రూ.10 కోట్ల విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి అనుచరులు పేర రాయించాడు.
17.  వెల్దుర్తి మండలం కండ్లకుంటలో సర్వే నెం.323, 818లో 22 ఎకరాలను బినామీలతో కబ్జా చేశాడు.
18.  దుర్గి పట్టణంలోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వెనక ఉన్న 42 సెంట్ల ప్రభుత్వ పోరంబోకు భూముల్ని పిన్నెల్లి అనుచరుడు మన్నెయ్య కబ్జా చేశాడు.
19. దుర్గి మండలం కోలగుట్ల గ్రామంలో స్థానిక వీఆర్వో జీరయ్య సాయంతో ప్రభుత్వ, పోరంబోకు భూముల్ని అనుచరుల పేరుతో రాయించాడు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములు కబ్జా:
1. వెల్దుర్తి గ్రామంలో మల్లు స్వామి అనే వైసీపీ నేతను అడ్డు పెట్టుకుని రైతులకు చెందిన 1500 ఎకరాల్లో పేర్లు మార్చి, గంటల వ్యవధిలో బ్యాంకుల నుండి రూ.70 కోట్ల రుణాలు పొంది, తిరిగి ఆ భూముల్ని రైతుల పేర్లతో మార్చాడు.
2. వెల్దుర్తి మండలం, మండాది కానాగు సమీపంలో ఎస్సీలకు చెందిన పట్టా భూముల్ని పేర్లు మార్చి తాకట్టు పెట్టి రూ.10 కోట్లు రుణాలు తెచ్చుకున్నాడు.
3. మాచవరం మండలం పిన్నెల్లి నల్లచెరువులో ఎస్సీ భూముల్లో అక్రమంగా మైనింగ్‌ చేస్తూ, అట్టొచ్చిన ఎస్సీలపై దాడులకు తెగబడ్డాడు.

ఇతరుల ఆస్తుల కబ్జాలు
1. మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్యులకు చెందిన బిల్డింగ్‌ పడగొడతానని బెదిరించి రూ.50 లక్షలు గుంజుకొన్నాడు.
టీడీపీ ముఖ్య నేతకు చెందిన రూ.50 కోట్ల విలువైన పెట్రోల్‌ బంకు, పొలాలను బలవంతంగా లాక్కుని రూ.10 కోట్లు చేతిలో పెట్టి నియోజకవర్గం వదిలి పోవాలని బెదిరించాడు.
2. మాచర్ల పట్టణంలో వీరమాచినేని సుభాష్‌ చంద్రబోస్కు చెందిన ఆస్పత్రిని, భూమిని కబ్జా చేశాడు.
3. మాచర్లలోని దివ్య లాడ్జ్‌ యజమానిని కత్తులతో బెదిరించి అనుచరుల పేర రాయించుకున్నాడు.
4. మాచర్ల మండలం పశువేముల పంచాయతీ పరిధిలో ఉన్న ఎకరానికి పైగా సుగాలీల భూమి, ఆ పక్కనే బీసీ వర్గీయులకు చెందిన 2 ఎకరాలను కబ్జా చేశాడు.

బడుగు బలహీన వర్గాల ప్రజలపై పిన్నెల్లి దాడులు, అక్రమ కేసులు
1. గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య తర్వాత కిరాయి హంతకులతో వైసీపీ నాయకుల్ని హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగం మోపి, చంద్రయ్య బంధువుల్ని అరెస్టు చేశారు.
2. దుర్గి మండలం జంగమహేశ్వరపురంలో కంచర్ల జల్లయ్య యాదవ్‌ హత్య తర్వాత గ్రామంలో పోలీస్‌ పికెట్‌ కొనసాగుతుండగానే టీడీపీ నేతలపై దాడులు జరిగాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను గ్రామాల నుండి. తరిమేశారు. టీడీపీకి గట్టి పట్టున్న గ్రామాల్లో కట్టుబట్టలతో గ్రామాల నుండి తరిమారు.
3. జంగమేశ్వరపాడులో 2020లో నూతన సంవత్సర వేడుకల ముసుగులో టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడి, బెదిరింపుల కారణంగా 60 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి. గుండ్లపాడు నుండి కొన్ని కుటుంబాలు వెళ్లిపోయాయి. బంధుమిత్రులు చనిపోతే చూడడానికి కూడా సొంత గ్రామాలు రాకుండా ప్రాణభయంతో దూరంగా బ్రతకాల్సిన పరిస్థితులు కల్పించారు.

పిన్నెల్లి పైశాచికం
1. మాచర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్‌ వేయనీయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు.
2. తాజాగా ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి, తన సహజ లక్షణమైన నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎం మిషన్‌ ధ్వంసం చేశాడు.
వారించిన పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు తల పగులగొట్టి హత్యా ప్రయత్నం చేశారు..
3. ప్రతి స్టేషన్లోనూ పిన్నెల్లి మనుషులు ఇద్దరో, ముగ్గురో హోంగార్డులుగా పనిచేస్తుంటారు. స్టేషన్లో ఏం జరిగినా క్షణాల్లో పిన్నెల్లికి చేరవేసేస్తారు. వారిని చూసి సీఐ, డీఎస్పీలు కూడా భయపడాల్సిందే.
4. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున నామినేషన్‌ వేద్దామనుకున్న కొందరు అభ్యర్థులకు పోలీసులే ఫోన్లు చేసి, పోటీ ఆలోచన మానుకోవాలని, లేకుంటే గంజాయి కేసులు పెడతామని బెదిరించారు.
5. ఒక పోలీసు అధికారి, వైసీపీ వాళ్లపై టీడీపీ వాళ్లు ఎవరైనా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే తీసుకోరు. ఫిర్యాదు చేసిన వాళ్లు వైసీపీలో చేరే వరకు వేధించడం, లేదా దాడులకు పాల్పడడం సాధారణంగా మారింది. పార్టీ మారిన వారిలో 85 శాతం ఇలా చేరినవారే.
6. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీతో పాటు దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి పదవులన్నీ వైసీపీ అభ్యర్థులకే ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకులను బెదిరించి, ఎవరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారు.
7. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా టీడీపీ శ్రేణులకు అండగా నిలిచేందుకు మాచర్ల వెళ్లిన టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్‌ పారా కిషోర్‌ కారుపై పిన్నెల్లి ఆస్థాన రౌడీ తుర్కా కిషోర్‌ హత్యాయత్నం చేస్తే.. అతనికి ఏకంగా మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ చేశారు. 20 నెలల పాటు ఆ పదవిలో కిషోర్ను అడ్డుపెట్టుకుని అనేక భూకబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు. తర్వాత మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గా నియమించారు.
8. 2022 డిసెంబర్‌ 16న మాచర్లలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం తెలపెట్టగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు విరుచుకుపడి, బీభత్సం సృష్టించారు. మాచర్లను రణరంగంగా మార్చేశారు. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, టీడీపీ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. అంత జరిగినా అప్పటి ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి దాన్ని టీడీపీ నాయకుల తప్పుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
9. దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు ఆవుల కొండలు స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్‌ వేయడానికి ప్రయత్నిస్తే పిన్నెల్లి అనుచరుడు మన్నెయ్య మరియు అతని అనుచరులు దాడి చేశారు.
10. మాచర్ల మండలం కంభంపాడు గ్రామంలో నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న టీడీపీ నేత దందు పెదవెంకయ్య అనే టిడిపి కార్యకర్తపై దాడి చేశారు.
11. వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో పోలీసుల ఎదుటే వైసీపీ నాయకులు బొదలవీడు టీడీపీ యం.పి.టి.సి అభ్యర్థి నామినేషన్‌ పేపర్లను లాక్కుని చించేశారు.
12. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో టీడీపీ నేతలు రాచబోయిన బాబు, రవీంద్ర, శివరాజు పై వైసీపీ నేతలు గొడ్డలితో దాడికి దిగారు. ఒకరి కాలు నరికేశారు.
13. రెంటచింతల టీడీపీ నేత సర్వా రెడ్డిని డీఎస్పీ కార్యాలయం సమీపంలోనే దాడికి తెగబడ్డారు.
14. వెల్దుర్తిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాధనాల నాగేంద్ర నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించేశారు.
15. మాచవరం మండలం కొత్తపాలెంలో టీడీపీకి ఓటేశారనే కక్షతో దళిత వాడపై దాడికి తెగబడ్డారు.
16. పోలీసు హెచ్చరికలను బేఖాతర్‌ చేస్తూ నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వారి చేతుల్లో నుండి నామినేషన్‌ పత్రాలు లాక్కుని అధికారులు, వైసీపీ కార్యకర్తలు చించేశారు.
17. మాచర్ల మండలం జమ్మలమడకలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి భయంతో ఊరు విడిచి వెళ్లిపోయింది.
18. దుర్గి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుంటే ఒక్క స్థానానికీ నామినేషన్‌ వేయనీయలేదు.
19. కారంపూడిలో 15 మండలాలుంటే కేవలం 10 మండలాల్లో నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేశారు.
20. టీడీపీ ఏజెంట్‌ చేరెడ్డి మంజుల నుదిటిపై గొడ్డలితో నరికారు, మరో 10 మందిపైనా దాడి చేశారు.
21. పోలింగ్‌ అనంతరం పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి కారంపూడిలో బీభత్సం సృష్టించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. ఏజెంట్లుగా నిలబడిన వారిపై దాడి చేశారు.
22. కారంపూడిలో కత్తులు, కర్రలు, రాడ్లు పట్టుకుని నడి రోడ్డుపై బీతావహ వాతావరణం సృష్టించారు.

పిన్నెల్లి నేర వారసత్వం:
1. వెల్దుర్తి మండలం కల్లగుంత గ్రామానికి చెందిన భూస్వామి, పేదల పక్షాన నిలిచే నాయకుడు గట్ల నాగిరెడ్డిని అతని కుమారుడు వెంకట్రెడ్డిని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చిన్నాన్న పిన్నెల్లి సుందరరామిరెడ్డి హత్య చేసి, వారి ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. ఆ డబ్బుతోనే 1994 ఎన్నికల్లో పోటీ చేశాడు.
2. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన ఎన్టీఆర్ను అడ్డగించారు. నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం చేయకూడదంటూ బాంబులు, కత్తులతో వీరంగం సృష్టించాడు.
3. తెలుగుదేశం పార్టీ గెలవడంతో అసహనంతో టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేయించాడు. నాగిరెడ్డి కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
4. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా కర్రి పున్నారెడ్డి గెలిచాక పోలీసులు సుందర రామిరెడ్డిని అరెస్టు చేశారు.
5.  బెయిల్పై వచ్చిన సుందర రామిరెడ్డి పేదలపై దాడులు, భూ కబ్జాలకు తెగబడడంతో మాచర్లలోని పెద్ద కాలువ వద్ద సుందర రామిరెడ్డిని నక్సలైట్లు తుపాకీతో కాల్చి హత్య చేశారు.
6. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పెదనాన్న లక్ష్మారెడ్డి 2004లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తూ, ఎన్నికల ప్రచారానికి వెళ్లగా.. మాచర్ల ప్రజలంతా తిరుగుబాటు చేశారు. కారం చల్లి నిరసన తెలిపారు.అసహనంతో ప్రజలపై దాడులకు తెగబడగా ప్రజలంతా ఏకమై చెట్టుకు కట్టేసి కొట్టారు.
7. 2014లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక వెల్దుర్తి మండలం, కొత్తపుల్లాడిగూడెంకు చెందిన 100కి పైగా బీసీ (యాదవ) కుటుంబాలను బెదిరించి గ్రామం నుండి తరిమేశారు.
8. వారి ఇళ్లపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగి, సామాన్లు పగులగొట్టారు. ఆస్తులు ధ్వంసం చేశారు.
9. కొత్తపుల్లాడిగూడెం దాడుల్లో పాల్గొన్న వైసీపీ నేత, వెల్దుర్తి ఎంపీపీ పంగా వెంకటేశ్వర యాదవ్ను 2022లో పిన్నెల్లి ముఠానే హత్య చేసి, కనీసం శవం కూడా దొరక్కుండా చేశారు. వారం తర్వాత బూడిద చూపించారు. ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కల్లకుంట గ్రామానికి చెందిన గన్నెబోయిన లక్ష్మయ్య యాదవ్పై నెట్టి నలుగురు అన్నదమ్ముల్ని జైల్లో పెట్టారు.

Tags: పిన్నెల్లి మాఫియాపిన్నెల్లి రామకృష్ణారెడ్డిమాజీ మాచర్ల ఎమ్మెల్యే
Previous Post

గ్రీన్‌ కో సంస్థ పర్యావరణ ఉల్లంఘనలపై ఫిర్యాదులు

Next Post

కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2025

కార్యకర్త
@ November 17, 2025
ఎన్టీఆర్తోనే బడుగులకు రాజ్యాధికారం
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్తోనే బడుగులకు రాజ్యాధికారం

చైతన్యరధం
@ November 17, 2025
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు

చైతన్యరధం
@ November 17, 2025
సీఎం చంద్రబాబు వల్లే విశాఖ ఉక్కుకు ఊపిరి
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు వల్లే విశాఖ ఉక్కుకు ఊపిరి

చైతన్యరధం
@ November 17, 2025
ఎక్స్ లెన్స్  అంటేనే రామోజీ!
ఆంధ్రప్రదేశ్

ఎక్స్ లెన్స్  అంటేనే రామోజీ!

చైతన్యరధం
@ November 17, 2025
మన విధానం..నేషన్ ఫస్ట్
ఆంధ్రప్రదేశ్

మన విధానం..నేషన్ ఫస్ట్

చైతన్యరధం
@ November 17, 2025
అండగా ఉంటాం
ఆంధ్రప్రదేశ్

అండగా ఉంటాం

చైతన్యరధం
@ November 16, 2025
టెక్స్‌టైల్స్‌లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

టెక్స్‌టైల్స్‌లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

చైతన్యరధం
@ November 16, 2025
Load More

ముఖ్య వార్తలు

ఎక్స్ లెన్స్  అంటేనే రామోజీ!

ఎక్స్ లెన్స్  అంటేనే రామోజీ!

చైతన్యరధం
@ November 17, 2025
మన విధానం..నేషన్ ఫస్ట్

మన విధానం..నేషన్ ఫస్ట్

చైతన్యరధం
@ November 17, 2025
గ్రీన్‌ ఎనర్జీ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో సహకరించండి

గ్రీన్‌ ఎనర్జీ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో సహకరించండి

చైతన్యరధం
@ November 16, 2025
ఇంధన రంగంలో సైబర్‌ రక్షణ అత్యవసరం

ఇంధన రంగంలో సైబర్‌ రక్షణ అత్యవసరం

చైతన్యరధం
@ November 16, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎన్టీఆర్తోనే బడుగులకు రాజ్యాధికారం

ఎన్టీఆర్తోనే బడుగులకు రాజ్యాధికారం

చైతన్యరధం
@ November 17, 2025
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు

చైతన్యరధం
@ November 17, 2025
సీఎం చంద్రబాబు వల్లే విశాఖ ఉక్కుకు ఊపిరి

సీఎం చంద్రబాబు వల్లే విశాఖ ఉక్కుకు ఊపిరి

చైతన్యరధం
@ November 17, 2025
ఎక్స్ లెన్స్  అంటేనే రామోజీ!

ఎక్స్ లెన్స్  అంటేనే రామోజీ!

చైతన్యరధం
@ November 17, 2025
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist