మాచర్ల (చైతన్యరథం): పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని కిశోర్ అనేక అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డాడు. కారు అద్దాలు బద్దలు కొట్టి దాడికి పాల్పడ్డ ఘటనపై అప్పట్లో కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆయన కనిపించకుండా పోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడితో పాటు ఆయన కూడా పరారయ్యాడు.
మాచర్లలో పిన్నెల్లి అటవిక రాజ్యానికి తురకా కిషోర్ సైన్యాధ్యక్షుడిలా ఉండేవారు. పిన్నెల్లి సోదరులకు నమ్మినబంటుగా ఉండి.. వారు చేయమన్న ఘోరాలన్నీ చేసేవాడు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేస్తూండటంతో పార్టీ తరపున బొండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. వీళ్లిద్దరిపై పట్టణ నడిబొడ్డున కిషోర్ చేసిన దాడి దృశ్యాలు సంచలనంగా మారాయి. మాచర్ల మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకుని తర్వాత కొంత కాలం మున్సిపల్ చైర్మన్ పదవి కూడా నిర్వహించాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన అతడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు నేపట్టారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకొని వెళ్లి అరెస్ట్ చేశారు.
ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదు: బుద్దా
తురక కిషోర్ అరెస్ట్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌ను ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి ఆకు రౌడీలు సమాజానికి హానికరం. ఛైర్మన్ పదవి ఆశ చూపించి తురకా కిషోర్‌ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా పైకి వదిలాడు. తురకా కిషోర్ దాడి నుంచి మేం తృటిలో తప్పించుకున్నామని పేర్కొన్నాడు.