- మంత్రి గొట్టిపాటి పిలుపు
- ఏర్పాట్లపై కూటమి నాయకులతో మంత్రి సమీక్ష
- మోదీ పర్యటన నేపథ్యంలో మంత్రి గొట్టిపాటికి కీలక బాధ్యతలు
మంగళగిరి (చైతన్యరథం): ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ, జనసేన నాయకులతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గం మీదగా సభకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతను తెలుగుదేశం అధిష్టానం మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో పాటు జనసేన, బీజేపీ నాయకులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి.. నినాదంతో ప్రతీ కుటుంబం నుంచి ఒకరు మోదీ సభకు వచ్చేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తు చేసుకని కసిగా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి తరలి రావాలని మంత్రి గొట్టిపాటి కోరారు. ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. దివంగత ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చితే… జగన్మోహన్ రెడ్డి తన తుగ్లక్ చర్యలతో తెలుగువారి పరువును ప్రపంచ స్థాయిలో తీశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం నచ్చే రాజధానిగా అమరావతిని నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా సమపాళ్లలో ముందుకు తీసుకు వెళ్తున్న నాయకత్వ దక్షత కేవలం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జగన్ హయాంలో స్కీముల పేరుతో పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ పోయి స్కాంలుగా మిగిలాయని ఎద్దేవా చేశారు.
“