- అందరికీ పార్టీయే సుప్రీం
- ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసితో పనిచేయాలి
- సభ్యత్వ నమోదులో టీడీపీ చరిత్ర సృష్టించింది
- కార్యకర్తలకు అండగా నిలవాలి
- ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, నేతలకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం
విశాఖపట్నం (చైతన్యరథం): ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఆ ప్రాంత టీడీపీ నేతలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, నాయకులతో మంత్రి లోకేష్ సోమవారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు సంస్థాగత అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై నేతలు దృష్టి సారించాలని చెప్పారు. కోటికి పైగా సభ్యత్వ నమోదుతో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలవాలి. ఎవరికైనా పార్టీ యే సుప్రీం. పార్టీ వల్లే ఈ స్థాయిలో ఉన్నామని నాయకులు గుర్తుంచుకోవాలి. పార్టీ వల్లే నేను యువగళం పాదయాత్ర చేయగలిగా. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసి ఉండాలి. ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నేతలకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు 7 నెలల్లోనే పరిష్కరించాం. అనేక ఐటీి కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు విశాఖ ఎంపీ శ్రీభరత్, ఉతరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.