చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త

by చైతన్యరధం
August 20, 2022
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
ఏపీ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త
Share on FacebookShare on TwitterShare on Whatsapp

్జ రాష్ట్రం పెనువిపత్తులో కూరుకుపోయే ప్రమాదం
్జ జగన్‌రెడ్డి దిగేనాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న అప్పులు
్జ చెల్లింపుల భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు
్జ ఆర్థిక అత్యవసర పరిస్థితి తప్ప కేంద్రానికి మరో మార్గంలేదు.
్జ సంక్షేమ పథకాలకన్నా సాక్షిలో యాడ్స్‌కే అధిక ప్రాధాన్యం
్జ పతనం అంచుల్లో వైసీపీ
్జ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

అమరావతి: జగన్‌రెడ్డి అధికారం నుంచి దిగిపోయేనాటికి ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరనున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, శాసన మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఏపీ ప్రజలను తస్మాత్‌ జాగ్రత్త! అని శుక్రవారం ఆయన ఒక ప్రటనలో హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిసిన జగన్‌రెడ్డి ఏపీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాడన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని, ఉపాధి కల్పన గుండు సున్నా అని, యువతలో అశాంతి నెలకొందని పేర్కొన్నారు. బాధిత వర్గాల ప్రజలే వైసీపీకి బుద్ధిచెప్పడం ఖాయన్నారు. జగన్‌రెడ్డి సృష్టించిన ఆర్థిక సంక్షోభం, వ్యవస్థల విధ్వం సంకారణంగా ఆంధ్రప్రదేశ్‌ సరిదిద్దలేని అప్పుల ఊబి లోకి కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి బయటపడే దూరదష్టి, ప్రణాళికలు ఆయన వద్దలేవన్నారు. బహిరంగ మార్కెట్‌ అప్పులకు, కార్పొరేట్‌ రుణసేకరణకు కేంద్రం అడ్డుకట్ట వేయకపోతే, రాష్ట్రానికి పూడ్చలేని నష్టం వాటిల్లుతుందన్నది ప్రజాభిప్రాయమని పేర్కొన్నారు. ఏపిలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధింపు మినహా కేంద్రానికి మరో మార్గం కనిపించని పరిస్థితి నెలకొందన్నారు. కార్పొరేట్‌ బారోయింగ్స్‌, బడ్జెటేతర రుణాలను రాష్ట్రం అప్పులుగానే పరిగ ణిస్తామని, పార్లమెంటులో కేంద్రం ఇటీవలే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే వాటి చెల్లింపులను రాష్ట్ర బడ్జెట్‌ నుంచే చేస్తుందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంన్నట్లు తెలిపారు. ఈ చెల్లింపుల భారం రాష్ట్రంపైనే పడటం వల్ల ఆర్థికంగా దివాలాతీసే దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి మరిన్ని అప్పులు చేస్తుండటమే దీనికి కారణమని తెలిపారు.

జగన్‌రెడ్డి దిగిపోయేనాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న అప్పులు
జగన్‌రెడ్డి దిగిపోయే నాటికి బడ్జెటేతర అప్పులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.10లక్షల కోట్లకు చేరు కుంటాయని హెచ్చరించారు. ఈ అప్పుల కారణంగా చెల్లింపుల భారమే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు కానుందన్నారు. బడ్జెట్‌ అంచనాలు, మొత్తం వ్యయంలో వృద్ధి నత్తనడకన ఉంటే, తిరిగి చెల్లింపులు చాంతాడంత కానున్నట్లు హెచ్చరించారు. ఉదాహరణకి 2022-23 బహిరంగ మార్కెట్‌ అప్పులు తొలి 3 నెలల్లోనే రూ.38 వేల కోట్ల (బడ్జెట్‌లో పెట్టింది రూ.48 వేల కోట్లు) పైచిలుకుకు చేరడం ఆందోళనకరమన్నారు. ఈ అప్పుల బరితెగింపు పై కేంద్రం ఇంకెన్నాళ్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుందని ప్రశ్నించారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే జగన్‌ రెడ్డి ఈవిధంగా రాష్ట్రాన్ని భవిష్యత్తులో కూడా తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బ తీయాలని చూస్తున్నాడ న్నారు. రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడం, ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై జగన్‌కు ఆసక్తి లేదని విమర్శించారు. ఆయనకు ఎంతసేపూ స్వలాభం, పార్టీ ప్రయోజనాలపైనే దృష్టి అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ప్రజాతీర్పును కాలరాసేందుకే జగన్‌ రెడ్డి అవినీతి కుంభకోణాలకు, అక్రమార్జనకు తెగబడ్డాడని ధ్వజమెత్తారు. జగన్‌ అవినీతి, అక్రమ సం పాదన నేలమాలిగలు వెలికితీసే పనిపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు.

రాష్ట్రం పెనువిపత్తులో కూరుకుపోయే ప్రమాదం
భవిష్యత్తులో పేదల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి నయాపైసా లేకుండా పెనువిపత్తులో రాష్ట్రం కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆకాశాన్నంటిన ఆర్థిక సంక్షోభానికి జగన్‌ రెడ్డిదే పూర్తి బాధ్యత అన్నారు. ఈ లెక్కాజమా లేని అప్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు తెలిపారు. దానికి తోడు ఇటీవలి మంత్రిమండలి మార్పు వైసీపీ కొంపలో కుంపటైందన్నారు. జగన్‌ అనుభవ రాహిత్యం, అహంభావం రాష్ట్రాన్ని అన్నిరంగాలలో అధ: పాతాళానికి దిగజార్చాయని, ప్రజా కంటక ప్రభుత్వంగా మార్చాయని, శ్రీలంక తరహాలోనే రాష్ట్ర ప్రజల్లో నిరాశానిస్పృహలు ప్రబలాయని తెలిపారు. ఆ దేశాధ్యక్షుడు కూడా ఇలాగే తన వైఫల్యాలను కప్పిపెట్టి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటించాడన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పతనం అంచుల్లో ఉందని తెలిపారు. జగన్‌ పాలనతో ప్రజలంతా విసిగిపోయారన్నారు. నవరత్నాల పేరుతో దారుణంగా మోసగించిన జగన్‌ రెడ్డిని తిరిగి అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. గత 3ఏళ్ల పాలనలో పేదరికం ప్రబలిందని, ధనికులు, పేదల మధ్య అంతరం బాగా పెరిగిపోయిందని, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, జగన్‌ డీబీఎఫ్‌ (ప్రత్యక్ష నగదు బదిలీ) పథకం ఒక ఫార్స్‌ గా మారిందని ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష నగదు బదిలీలో ఏపీ 19వ స్థానంకు పడిపోయిందన్నారు. సంక్షేమ పథకాల అమలుకన్నా సాక్షిలో వాటి యాడ్స్‌ కే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని, ఉపాధి కల్పన గుండుసున్నా అని, ఈ పరిణామంతో యువతలో అశాంతి ప్రబలుతోందని పేర్కొన్నారు. జగన్‌ రెడ్డి యువతను కూడా దారుణంగా మోసగించాడని మండిపడ్డారు. బాధిత వర్గాల ప్రజలే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెబుతారని యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Tags: అధికారంఅప్పులుఆర్థిక సంక్షోభంఉపాధి కల్పనఉల్లంఘనఏపీ ప్రభుత్వంజగన్‌రెడ్డితస్మాత్‌ జాగ్రత్తదివాలాపెట్టుబడులుపెనువిపత్తుపేదలుబడ్జెట్‌యనమల రామకృష్ణుడురాజ్యాంగంవిధ్వంవ్యవస్థలుసంక్షేమం
Previous Post

వైసిపి నేతలు మా భూమిని కబ్జా చేశారయ్యా

Next Post

రైతు బజార్లను నిర్వీర్యం చేసిన జగన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

November 4, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

మరింత అంకితభావంతో పనిచేస్తాం

November 4, 2026
మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం
ఆంధ్రప్రదేశ్

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

November 4, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
Next Post
రైతు బజార్లను నిర్వీర్యం చేసిన జగన్‌ రెడ్డి

రైతు బజార్లను నిర్వీర్యం చేసిన జగన్‌ రెడ్డి

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

మరింత అంకితభావంతో పనిచేస్తాం

by చైతన్యరధం
November 4, 2026

విజేతలకు 'ఎక్స్' వేదికగా అభినందనలు అమరావతి (చైతన్యరథం): 'మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.