మరావతి (చైతన్య రథం) అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సెక్స్ “సూపర్ హిట్’ విజయోత్సవ సభపై ‘జె గ్యాంగ్ సాగించిన వ్యతిరేక విష ప్రచారం ఏమాత్రం ప్రభావం చూపించలేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయోత్సవ సభకు వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని సమీప గ్రామాల్లో ప్రభుత్వం తరపున చాటింపు వేయించినట్టు వైకాపా నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో వైకాపా నేతలే ఈ కుట్రకు తెరలేపి ఒక వీడియో ప్రచారం చేశారని ఈ దుష్ప్రచారంపై వాస్తవాలు ఏంటని. విచారిస్తే.. అసలు విషయం బయటపడిందన్నారు. వైకాపా నేతలు వారి పార్టీకి చెందిన ఓ కార్యకర్తతో దండోరా వేయించి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రచారం చేసినట్టు వెల్లడైందని మంత్రి తెలిపారు. ద్వాక్రా మహిళలకు సమావేశానికి రాకపోతే జరిమానా విధిస్తారనే తప్పుడు ప్రచారం కోసం ఒక ఆడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులయ్యారని, వైకాపా ఆటలు ఇక సాగవని మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.