పెద్దిరెడ్డి, చంద్రబాబును కొట్టాడని.. ఆ కక్షతో మిథున్‌రెడ్డిని జైల్లో పెట్టించారని జగన్ నెల్లూరులో పెద్ద అబద్ధం చెప్పారు. వేలమంది ప్రాణాలు తీసి, లక్షలాదిమంది ఆరోగ్యాల్ని నాశనం చేసిన విషపూరిత జె`బ్రాండ్ మద్యం దోపిడీనుండి ప్రజల దృష్టి మళ్లించడానికే అబద్ధాలు చెబుతున్నాడు. పరామర్శల పేరుతో అరాచకం సృష్టిస్తున్నాడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి పెద్దిరెడ్డి ఆర్థిక, రాజకీయ స్థితి సామాన్యమైనదే. కక్షతో పెద్దిరెడ్డిని ఏమైనా చేయాలనుకుంటే 1996`2004 మధ్య చంద్రబాబు సీఎంగా వున్నపుడే చేసేవారు. అప్పుడు పెద్దిరెడ్డి చిన్న కాంట్రాక్టరు మాత్రమే. 2004లో వైఎస్ సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో పెద్దిరెడ్డి ఒక వెలుగు వెలిగాడు. 2019`24 మధ్య జగన్ పాలనలో వేలకోట్లకు పడగలెత్తారు. పెద్దిరెడ్డి, చంద్రబాబు క్లాస్‌మేట్ కాదు. 1973`75లో పెద్దిరెడ్డి సోషియాలజీలో ఎంఏ చేశాడు. 1975నాటికే చంద్రబాబు ఎకనామిక్స్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. ఎస్వీ యూనివర్శిటీ హాస్టల్లోని ‘ఎ’ బ్లాక్‌లో చంద్రబాబు వుండగా.. పెద్దిరెడ్డి ‘సి’ బ్లాక్‌లో ఉండేవారు. డిగ్రీలో కూడా చంద్రబాబు ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో చదవగా.. పెద్దిరెడ్డి ఎస్‌జీఎస్ కాలేజీలో చదివేవారు. ఇరువురకూ ఎక్కడా ప్రత్యక్షంగా కొట్లాడుకున్న రుజువు ఒక్కటి కూడా లేదు. క్లాస్‌మేట్స్ కొట్టారనే జగన్ ప్రచారం పెద్ద అబద్ధం మాత్రమే.
వాస్తవానికి ‘సి’ బ్లాక్ హాస్టల్లో పెద్దిరెడ్డి గ్రూప్‌నకు నారాయణప్ప, పద్మనాభనాయుడు మధ్య కొట్లాట జరిగింది. అందులో పెద్దిరెడ్డి హాస్టల్‌లోని ఫస్ట్‌ప్లోర్ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌కు దూకి తప్పించుకుని పారిపోయాడు. మరో సందర్భంలో పురుషోత్తమరెడ్డికి, పెద్దిరెడ్డికి మధ్య అమ్మాయిల విషయంగా కొట్లాట జరిగింది. పెద్దిరెడ్డికి చంద్రబాబుకు మధ్య కొట్లాట ఎప్పుడూ జరగలేదు. జగన్ చెప్పేది అబద్ధం. ఎకనామిక్స్‌లో రీసెర్చ్ స్కాలర్‌గావున్న చంద్రబాబు 1977లో బీసీ సామాజిక వర్గానికి చెందిన గీతానాథ్‌ను ఛైర్మన్‌గాను, బలిజ సామాజిక వర్గానికి చెందిన అంతరాజ్ మోహన్‌ను ఎస్వీ యూనివర్శిటీ సెక్రటరీగా గెలిపించారు. ఒక బీసీ విద్యార్థి ఎస్వీ యూనివర్శిటీ ఛైర్మన్ కావడం అదే మొదటిసారి. బీసీలకు, బలిజలకు కొమ్ములు తెచ్చారన్న కక్ష పెద్దిరెడ్డికి చంద్రబాబుపై ఉండేది. చంద్రబాబు అభివృద్ధికాముకుడు, పోరాటధీరుడేగాని.. కక్షసాధింపు మనిషి కాదు. చంద్రబాబుకు కక్ష అంటగట్టి.. జె`బ్రాండ్ మద్యం పాపాలనుంచి జగన్ ప్రజాదృష్టిని మళ్లించలేరు. ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదు. వెయ్యి గొడ్లుతిన్న రాబందు ఒక గాలివానకు కూలక తప్పదు.
జగన్?
అబద్ధాల పుట్ట
అవినీతి దిట్ట
నేరాల పరాకాష్ట
రాష్ట్రానిక అరిష్టం.
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్