- ఆయన చిట్టా మొత్తం బయటపెడతాం
- కేంద్రస్థాయి వరకు సామ్రాజ్యం విస్తరణ
- నేడు ఏమీ ఎరగనట్టు నంగనాచి కబుర్లా?
- ఓటర్ల జాబితా కన్నా పాపాల జాబితా పెద్దది
- అటవీ భూకబ్జాపై దర్యాప్తునకు కమిటీ వేశాం
- నిగ్గు తేల్చి కూటమి చర్యలు తీసుకుంటుంది
- శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే.. ఆయనను మించినవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని శాసనమండలి చీఫ్ విప్ పంచు మర్తి అనురాధ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్‌పై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి..లక్షల కోట్లు దోచేశాడు..420 సీఎంగా గూగుల్‌లో దర్శనమిచ్చే వ్యక్తి జగన్ అని విమర్శించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటికొస్తుందని తెలిపారు. పగలేమో పూజలు, రాత్రంతా దోపిడీలు చేస్తుంటాడు. ఇలాంటి స్లిప్ట్ పర్సనాలిటీ గలవారు ఎక్కడా ఉండరు.. అతని అవినీతి సామ్రాజ్యాన్ని పీలేరు మొదలుకుని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి వరకు అన్ని దిక్కులా విస్తరించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నేనే పాపం ఎరుగను, నాకేమీ తెలియదు అని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రెస్మీట్లో తాను అమాయకుడినని మాట్లాడటం విడ్డూ రంగా ఉందని మండిపడ్డారు.
అవినీతి చేయలేదని చెప్పగలరా?
శాండ్ మాఫియా చేయలేదని పెద్దిరెడ్డి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? ల్యాండ్ మాఫియా చేయలేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకున్నారు. శివశక్తి డెయిరీ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకు పాలు కొని ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా? మదనపల్లిలో ఒక గవర్న మెంట్ ఆఫీస్‌లో ఫైల్ దహనం అయితే ఏ సంబంధం లేదని చెప్పి ముందస్తు బెయిలు ఎందుకు తెచ్చుకున్నారు? అసైన్డ్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఇరిగేషన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? శాండ్ మాఫియాలో కోట్లు సంపా దించి అవినీతి సొమ్మును కూడగొట్టుకుంది వాస్తవం కాదా? ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఒక ఎకరం మొదలుకొని వెయ్యి ఎకరాల వరకు భూములు కొట్టేసిన బాపతి మీరు. నేనేమీ ఎరగను, నాకు ఏ సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? మీ పుంగనూరు ఓటర్ లిస్టు కన్నా మీ అవినీతి పాపాల లిస్టే పెద్దదిగా ఉంది. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో అసైన్డ్ భూములు కాజేసిన మాట వాస్తవం కాదా? 982 ఎకరాల భూమి కబ్జా చేశారని మీడియాలో సైతం వచ్చింది. మీరు దానికి వివరణ ఇచ్చే పరిస్థితి లో లేరు. పుంగునూరు మండలం రాగాని పల్లెలో భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? రేణిగుంట ఎయిర్ పోర్టులో 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్‌లో మధ్యలో 20 ఎకరాలు మీ భార్య పేరు మీద ఎలా వచ్చింది? ప్రభుత్వ భూములు కూడా మీరు కొట్టేసి న పరిస్థితి. గవర్నమెంట్ పర్మిషన్లు లేకపోయినా ఎత్తిపోతల పథకాలు అని చెప్పి తమ స్వార్థం కోసం పనులు మొదలుపెట్టారు. ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆవులపల్లిలో నేతిగుట్ల పల్లెల్లోని ప్రజలను అనధికారికంగా రాత్రికి రాత్రి ఖాళీ చేయించేసి వారి ఉసురు పోసుకున్నారు. మీరు ఇలా చేసినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీకు వంద కోట్లు ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా? తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి చేశారో అందరికీ తెలుసు. అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కై ఏం చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఇంత అవినీతి చేసిర పెద్దిరెడ్డిని ఏం చేసినా పాపం లేదనే మాటే వస్తది తప్ప ఇంకో మాట రాదు.
అటవీ భూమని కబ్జా చేసి గెస్ట్‌హౌస్ కట్టలేదా?
75 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్‌ను మీరు కబ్జా చేయడమే కాకుండా మీ పేరు మీద రాయించుకోవడమే కాకుండా ఏకంగా రోడ్డు వేసి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు. ఆ గెస్ట్ హౌస్ ఏ అవినీతి కార్యకలాపాలకు ఉపయోగపడుతుందో మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ప్రస్తుత ప్రభుత్వం దాని మీద కమిటీ వేసింది. అవన్నీ కూడా త్వరలో బయటికి వస్తాయి. కచ్చితంగా నిగ్గు తేలుస్తాం. అక్కడ రోడ్లు ఎవరు ఎవరి సొమ్ముతో వేశారు? పన్నుల రూపేణ ప్రజలు కట్టిన సొమ్ముతోనే రోడ్లు వేశారు కానీ సామాన్య ప్రజలకు ఎక్కడైనా ఒక తట్టెడు మట్టితో ఒక మట్టి రోడ్డు వేశావా? మీరు ఇంత పాపాలు ఇంత అవినీతి చేసి ఏమీ ఎరగని అన్నట్టుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా వాళ్ల మీద డిఫమేషన్ కేసులు వేయటం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.
భూ కబ్జాను ప్రశ్నిస్తే తాళిబొట్టు తెంపుతారా?
మదనపల్లిలో ఐదున్నర ఎకరాలు ఉన్న ఒక ఆవిడ భూమిని నీ తరపు వాళ్లు ఎలా కబ్జా చేస్తారు? నా పొలం నాకు ఇవ్వండి అని అడిగితే ఆవిడ తాళిబొట్టు కూడా తెంచేశారు. ఇంతటి అరాచకమా? ఇంత అవినీతి చేసి అడ్డమైన ప్రగల్భాలు పలకడం అన్యాయం. అప్పుడు కుప్పం మున్సిపాలిటీ నాదే..కుప్పంలో నేనే గెలుస్తా..కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తా అన్నావు? ఇప్పుడు ఏమైంది? మీరు ఎంతమంది గెలిచారు? అక్కడ ముగ్గురు అంటే ఇంకొక అతను మొన్న ఎన్నికల్లో ఇంకో అతను థర్డ్ పార్టీ వచ్చి నిలబడకపోతే మీకు ఆ 6000 ఓట్లు కూడా వచ్చేవి కావు. ఏదో కన్ను లు లొట్టబోయి బయటపడ్డావు. కచ్చితంగా మీ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవ డానికి ముందుకు వస్తుంది. మీ అవినీతి చిట్టా అంతా బయటపెడతాం. మిమ్మల్ని మీ పక్కనున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే, అంతకు ముందున్న మీ తమ్ముళ్లు, మీ కొడుకులు, ఆ ఫ్యామిలీ ప్యాకేజ్లాగా మీరందరూ ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము తినేసి దేనికి చలనం లేకుండా తయారయ్యారు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి సంగతి కూటమి ప్రభుత్వం తేలుస్తుందని స్పష్టం చేశారు.