- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి దర్శనం
- గురుగోవింద్ సింగ్ సాయిబా సమాధి వద్ద ప్రార్ధనలు
- అతిథి హోదాలో స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం మహారాష్ట్ర నాందేడ్లోని తఖ్ సచ్ కండ్ గురుద్వారాను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు గురుగోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురుద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ వచ్చిన పవన్ మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు. ఆయనకు గురుద్వారా చైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగ తం పలికారు. గురుద్వారా ప్రముఖుల చేతులమీదుగా పవన్కు సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు.
అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్తో తో కలసి గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ను సమర్పించి నమస్కరించారు. అనంతరం గురుద్వారా గ్రంథాలు పవిత్ర వస్త్రాన్ని వారికి వేసి ఆశీర్వదించారు. అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకుని. వెలుపలికి వచ్చారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీను ప్రారంభించారు. అంతకు ముందు మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాకు వచ్చిన పవన్కు చైర్మన్ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్ను బహూకరించారు.
గురు తేగ్ బహదూర్ సింగ్ స్ఫూర్తిని త్యాగం స్ఫూర్తిదాయకం
గురుద్వారా సందర్శన అనంతరం పవన కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తినినింపారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.
అతిథి హోదాలో స్వాగతం
ప్రముఖ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఆదివారం నాందేడ్ చేరుకున్నారు. ప్రభుత్వ అతిథిగా మహారాష్ట్ర సర్కార్ స్వాగతం పలి కింది. నాందేడ్ గురు గోవింద్సింగ్ విమానాశ్రయంలో మహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్, ఆయన కుమార్తె భోకార్ ఎమ్మెల్యే శ్రీజయ చవాన్, శాసన మండలి సభ్యులు రాజార్ కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. బస దగ్గర నాందేడ్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు అజిత్ గోప్ చడే, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు రాజేంద్ర కోడగే తది తరులు స్వాగతించారు.
పవన్ ను కలిసిన అటవీ, పర్యావరణ మంత్రి
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఢిల్లీ అటవీ పర్యావరణ మరియు పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.















