కుప్పం (చైతన్యరథం): ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులను ప్రేమగా చూసుకోవాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఉద్బోధించారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో రెండోరోజు గురువారం కుప్పంలోని ఏరియా హాస్పిటల్ని భువనేశ్వరి పరిశీలించారు. హాస్పటల్లో రోగులకు అందిస్తున్న ఉచిత సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ ఇంటి లాంటిదని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్పటల్కి వచ్చే రోగులను ఆప్యాయంగా పలకరించి, అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు.













