అమరావతి (చైతన్యరథం): మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల సంతాపం విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలందిస్తున్నారన్నారు. రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పాలకొండ్రాయుడు ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. పాలకొండ్రాయుడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అంటూ ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.