చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మా లక్ష్యం

ఉండి నియోజకవర్గంలో మంత్రి లోకేష్‌ సుడిగాలి పర్యటన

by చైతన్యరధం
Jan 7, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మా లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మంత్రి లోకేష్‌ ఉద్ఘాటన
  • అందుకే స్పూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు!
  • చాగంటి సలహాలతో నైతిక విలువలపై పాఠ్యాంశాలు
  • ఉండి అభివృద్ధికి రఘురామ చేస్తున్న కృషి భేష్‌
  • టాటా సేవలకు గుర్తుగా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌
  • ఉండి నియోజకవర్గంలో మంత్రి లోకేష్‌ సుడిగాలి పర్యటన

ఉండి/భీమవరం (చైతన్యరథం): విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకే విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను, సంస్కృతిని గుర్తుచేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి, వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతమన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని మంత్రి అయిన తరువాత మొదటి నిర్ణయం తీసుకున్నాను. నేను మంత్రి అయిన వెంటనే రాజకీయ నాయకుల ఫోటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేసాను. స్కూల్స్‌లో ఒక్క జాబ్‌ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాను. రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకోని వెళ్ళకూడదు అని కచ్చితంగా చెప్నా చెప్పానని మంత్రి లోకేష్‌ తెలిపారు.
108 ఏళ్ల చరిత్ర కలిగి, ఇటీవల ఆధునీకరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లోని జెడ్పీ హై స్కూల్‌ భవనంతోపాటు బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ కోర్టులను మంత్రి లోకేష్‌ సోమవారం ప్రారంభించారు. హైస్కూలునుంచి గ్రామంలోకి రూ.18లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఉండి హైస్కూలు నుంచి పెదఅమిరం చేరుకుని అక్కడ దివంగత రతన్‌ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత రతన్‌ టాటా మార్గ్‌గా నామకరణం చేసిన భీమవరం ` ఉండి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సాగి ప్రసాదరాజు సౌజన్యంతో 35లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ను వేదికపై నుంచి మంత్రి లోకేష్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన అమిరంలోని ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… 108ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
సంకల్పం ముఖ్యం
మనసున్న మహారాజు పీవీజీ రాజు విద్యాభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. ఆయన ఆస్తులు దానం చేసి ఎన్నో స్కూల్స్‌ ఏర్పాటు చేసారు. విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఎయిడెడ్‌ స్కూల్స్‌ వ్యవస్థను ప్రారంభించారు. సిరీస్‌ రాజు లాంటి ఎంతో మంది గొప్ప వాళ్ళు ఈ స్కూల్‌లో చదువుకున్నారు. సమావేశానికి వచ్చిన విద్యార్థులను చూస్తే కాలేజీ రోజులు గుర్తు వస్తున్నాయి. కాలేజీలో ఫ్రెండ్‌ షిప్‌ జీవితాంతం గుర్తుంటుంది. 2019-24 మధ్యలో కుటుంబం ఇబ్బందులు పడ్డప్పుడు నాకు స్నేహితులు అండగా నిలిచారు. తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలను మిత్రులకు చెప్పి పరిష్కరించుకోవాలి. నాకు కఠినమైన ప్రయాణం ఇష్టం. మంగళగిరిలో 1985 తర్వాత టిడిపి గెలవలేదు. 2019లో 5300 ఓట్లతో ఓడిపోయా. అయిదేళ్లు నియోజకవర్గాన్ని వదలకుండా కష్టపడ్డా. ప్రజల ఆశీస్సులతో ఈ సారి 91వేల మెజారిటీతో గెలిచాను. దేవుడు ఒక్కొకరికి ఒక్కో రకమైన పరీక్ష పెడతాడు. పరీక్షను జయించే శక్తి మనకు ఇస్తాడు. సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించగలం. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి జీవన ప్రయాణం చేయాలని మంత్రి లోకేష్‌ ఉద్బోధించారు.
దేశాభివృద్ధిలో రతన్‌ టాటా కీలకపాత్ర
ఒక వ్యాపార వేత్తగా ఉండి కంట్రీ ఫస్ట్‌ అనే నినాదానికి కట్టుబడి, దానికోసం చివరి వరకు పనిచేసిన మహావ్యక్తి రతన్‌ టాటా. భారతీయ కంపెనీల సమర్థతను ప్రపంచానికి చాటిన గొప్ప పారిశ్రామిక వేత్త, విజనరీ రతన్‌ టాటా. ఇతర దేశాల కంపెనీలను కొనుగోలు చేసి విజయవంతంగా నడిపిన గొప్ప వ్యక్తి ఆయన. టాటా కంపెనీ పేరు వినగానే ఒక గౌరవం, ఒక ఆదరణ, ఒక నమ్మకం కలుగుతుంది. కోట్ల మంది విశ్వాసాన్ని పొందడం, దాన్ని దశాబ్దాలుగా కొనసాగించడం చిన్న విషయం కాదు. దీని వెనక ఎంతో దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధి ఉంది. రతన్‌ టాటా సామాజిక కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. మా అమ్మమ్మ క్యాన్సర్‌తో చనిపోతే హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ వైద్యం ఉండాలనే ఉద్దేశంతో దివంగత ఎన్టీఆర్‌ బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటుచేశారు. ఆ సంస్థ కోసం 1992లో రతన్‌ టాటా రూ.25 కోట్లు విరాళం ఇచ్చారు. 2014 హుద్‌హుద్‌ తుపాను సమయంలో టాటా ట్రస్ట్‌ సీఈఓకు నేను ఫోన్‌ చేస్తే 30 సెకన్లలో రూ.3 కోట్లు సమకూర్చారు. డబ్బివ్వడం గొప్పకాదు, మాకు ఎటువంటి ప్రచారం అవసరం లేదని చెప్పటం వాళ్ల గొప్పతనం. ఆ మహనీయుడు చనిపోయేముందు నేను బాంబే హౌస్‌కు వెళ్లాను. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. టాటా సంస్థల చైర్మన్‌ చంద్రశేఖరన్‌..విశాఖలో టీసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి 10వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో ప్రజా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుచేసి యువతకు మెరుగైన నెట్‌ వర్కింగ్‌ అందించేందుకు కృషిచేస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
టాటా గ్రూపును అగ్రగామిగా తీర్చిదిద్దిన రతన్‌
టాటా గ్రూప్‌ రతన్‌ టాటా హయాంలోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. టాటా గ్రూపును సాల్ట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు తీసుకెళ్లారు. లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 50 స్టార్టప్‌ల్లో పెట్టుబడి పెట్టారు. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టాటా పవర్‌, టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎస్‌ను.. దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. ‘ఇండికా’ కారును దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా, భారత ఆటోమొబైల్‌ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న వాదానికి ఆయన తెరదించారు. టాటా గ్రూప్‌ నుంచి గతంలో ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పరిధిలోకి తేవాలన్నది రతన్‌ టాటా చిరకాల వాంఛ. అందులో భాగంగానే తమ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా ప్రారంభించిన ఎయిర్‌ ఇండియాను మళ్లీ తమ పరిధిలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్‌ ఇండియాను టాటా కొనుగోలు చేశారు. టాటాను ఇండియాలోనే కాకుండా ప్రపంచ పటంపై సగర్వంగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి పద్మవిభూషణ్‌ రతన్‌ టాటా. 1961లో టాటా గ్రూప్‌లో చేరిన రతన్‌ టాటా దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలకపాత్ర పోషించించారు. వ్యాపారాలు చేయడం వేరు…విలువలతో కూడిన వ్యాపారాలు చేయడం వేరు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. ఆ కోవలోకి వచ్చే మహనీయుడు రతన్‌ టాటా. అహర్నిశలు దేశం గురించి ఆలోచించిన రతన్‌ టాటా విగ్రహం ఏర్పాటు చేసిన రఘురామ కృష్ణంరాజుకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ అభినందనలు తెలియజేశారు.
చదువుతోపాటు నైతిక విలువలూ ముఖ్యమే
ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లినా మీరు చదువుకున్న స్కూల్స్‌ను మర్చిపోకండి. మీరు చదువుకున్న గ్రామాల్లో కంపెనీల శాఖలు ఏర్పాటుచేయండి. ఆంధ్రా మోడల్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రూపొందిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లను గౌరవిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నాం. టీచర్లు చదువు మాత్రమే చెప్పాలనే ఉద్దేశంతో ఇతర పనులు, పనికిమాలిన యాప్స్‌ తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం. 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 944 కోట్లతో ఉచితంగా ‘‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర స్టూడెంట్‌ కిట్స్‌’’ పంపిణీ చేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. త్వరలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నాం. కేజీ టూ పీజీ కరిక్యులం మారుస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యం. మహిళల్ని గౌరవించడం చిన్న వయస్సు నుండే నేర్పించాలి. గతంలో నేను పాదయాత్ర చేసినపుడు అనేకమంది మహిళలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు గౌరవించేలా చట్టాలుచేస్తే సరిపోదు, సమాజంలో మార్పురావాలి. మార్పు ఇంటినుంచే మొదలుకావాలి. మార్పు తేవడానికి ఆడ-మగ సమానమనే భావన కల్పిస్తాం. మహిళలను చులకనగా చేసే పదాలు వాడకూడదు. ఆడ, మగ సమానం అనే భావన పాదుకొల్పేలా ప్రత్యేక పాఠాలు తీసుకొస్తాం. పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వర రావుని నియమించాం. వారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక పాఠాలు రూపొందిస్తామని మంత్రి లోకేష్‌ వెల్లడిరచారు.
అవిశ్రాంత పోరాట యోధుడు ట్రిపుల్‌ ఆర్‌
ఉండి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఉండి నియోజకవర్గం ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమ నేను అప్పటికీ మర్చిపోలేను. మన ఫైర్‌ బ్రాండ్‌ ట్రిపుల్‌ ఆర్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే.. రియల్‌, రెస్పాన్సిబుల్‌, రెబల్‌. గత ఐదేళ్లు ఎలా పోరాడారో చూసారు కదా. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్యే అయ్యాను, డిప్యూటీ స్పీకర్‌ అయ్యాను అని ఆర్‌ఆర్‌ఆర్‌ రిలాక్స్‌ కాలేదు. కొన్ని సందర్భాల్లో నేను రఘురామతో విభేదించాను. చంద్రబాబు అరెస్టు సమయంలో నాకు ట్రిపుల్‌ ఆర్‌ అండగా నిలబడ్డారు. తనను కొట్టిన పోలీసులకు వాహనాలు కొనిచ్చిన విశాల హృదయుడు ట్రిపుల్‌ ఆర్‌. రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతినెలా రూ.4వేల కోట్ల లోటు ఉంది. అయినప్పటికీ సవాళ్లను అవకాశంగా తీసుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం రఘురామ పనిచేస్తున్నారు. కలెక్టర్‌ అధారిటీగా ఉండి డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఏర్పాటు చేసారు. రఘురామ, ఆయన మిత్రులు చేస్తున్న అభివృద్ధి పనులు గురించి తెలుసుకున్న తరువాత ఆశ్చర్యానికి గురయ్యాను. సుమారుగా రూ.60 లక్షలు ఖర్చు చేసి ఉండి జెడ్పీ హై స్కూల్‌ను పునర్నిర్మించారు. నియోజకవర్గంలో 34 స్కూల్స్‌ ఉంటే 31 స్కూల్స్‌లో ఇప్పటికే మరమత్తులు పూర్తి చేసి ప్లే గ్రౌండ్స్‌ కూడా ఏర్పాటు చేసారు. బీసీ, ఎస్సీ వెల్ఫేర్‌ హాస్టల్స్‌లో బెడ్స్‌ ఏర్పాటు చేసారు. పోలీస్‌ స్టేషన్లను ఆధునీకరించి, కొత్త వాహనాలు కూడా సమకూర్చారు. డ్రెయిన్స్‌, పంట కాలువలు శుభ్రం చేస్తున్నారు. సురక్షిత తాగునీరు అందించేందుకు 34 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు – జువ్వలపాలెం రోడ్డును కలిపే లింక్‌ రోడ్డును రతన్‌ టాటా పేరుతో రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ఆయన, ఆయన మిత్రులు సుమారుగా రూ. 10 కోట్లు ఖర్చు చేసారు. నియోజకవర్గ అభివృద్ధికి డిప్యూటీ స్పీకర్‌ రఘురామ చేస్తున్న కృషిని మంత్రి లోకేష్‌ అభినందించారు. రఘురామరాజు చేసిన అభివృద్ధి చూశాక.. ఉండితో మంగళగిరి పోటీపడాలని భావిస్తున్నా. ఉండి అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం నుంచి సహకారం అందించే బాధ్యత తీసుకుంటా. డ్రగ్స్‌, గంజాయి వల్ల భవిష్యత్‌ తరాలు నాశనమయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా చంద్రగిరిలో గంజాయి కారణంగా తన బిడ్డ నాశనమైందని ఒక తల్లి చెప్పింది. మత్తు పదార్థాల నివారణకు డ్రగ్స్‌ వద్దు బ్రో పేరుతో క్యాంపెయిన్‌ రూపొందించాం. ఈగల్‌ టీమ్‌లు ఏర్పాటుచేస్తున్నాం. గంజాయి నిర్మూలనను ప్రభుత్వం చాలా సీరియస్‌ గా తీసుకుంటోంది. సినిమా ట్రయిలర్‌ లో వచ్చే ముఖేష్‌ మాదిరిగా డ్రగ్స్‌ వల్ల యువత బతుకు దుర్భరంగా మారుతుంది. డ్రగ్స్‌ వద్దు బ్రో, డోన్డ్‌ బి ముఖేష్‌ అని ప్రచారం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసశర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ సి.నాగరాణి, ఎమ్మెల్యేలు పులివర్తి రామాంజనేయులు (భీమవరం), కామినేని శ్రీనివాస్‌ (కైకలూరు), మద్దిపాటి వెంకట్రాజు (గోపాలపురం), తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..

జగన్‌రెడ్డి ట్రాక్టర్ల బూమరాంగ్‌

పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

Previous Post

ఏపీ పర్యాటకం..పెట్టుబడులకు అనుకూలం

Next Post

గల్ఫ్‌ లో చిక్కుకున్న కదిరి మహిళకు అండగా నిలిచిన మంత్రి లోకేష్‌

మరిన్ని వార్తలు

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..
ఆంధ్రప్రదేశ్

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..

చైతన్యరధం
@ July 11, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి ట్రాక్టర్ల బూమరాంగ్‌

చైతన్యరధం
@ July 11, 2025
పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

చైతన్యరధం
@ July 11, 2025
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్

కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి

చైతన్యరధం
@ July 11, 2025
ఇబ్బందులు తీర్చి ఆదుకుంటాం
ఆంధ్రప్రదేశ్

ఇబ్బందులు తీర్చి ఆదుకుంటాం

చైతన్యరధం
@ July 11, 2025
ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్‌
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ July 11, 2025
మహిళలను కించపరిచే పదాలు మానేయాలి
ఆంధ్రప్రదేశ్

మహిళలను కించపరిచే పదాలు మానేయాలి

చైతన్యరధం
@ July 11, 2025
ఆద్యంతం పండుగ వాతావరణం!
ఆంధ్రప్రదేశ్

ఆద్యంతం పండుగ వాతావరణం!

చైతన్యరధం
@ July 11, 2025
Load More

ముఖ్య వార్తలు

బాలల భవిత.. గురువులదే బాధ్యత

బాలల భవిత.. గురువులదే బాధ్యత

చైతన్యరధం
@ July 11, 2025
కుట్రల నిగ్గు తేలుద్దాం!

కుట్రల నిగ్గు తేలుద్దాం!

చైతన్యరధం
@ July 10, 2025
అమరావతికి క్వాంటమ్‌

అమరావతికి క్వాంటమ్‌

చైతన్యరధం
@ July 10, 2025
విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌

విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌

చైతన్యరధం
@ July 9, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

గొంతులు కోసే.. చెట్లు నరికే..గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్‌ ముఠావే

చైతన్యరధం
@ July 8, 2025 6:15 AM

మామిడిపై మొసలి కన్నీరు!?

చైతన్యరధం
@ July 8, 2025 6:05 AM

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..

చైతన్యరధం
@ July 11, 2025

జగన్‌రెడ్డి ట్రాక్టర్ల బూమరాంగ్‌

చైతన్యరధం
@ July 11, 2025
పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

చైతన్యరధం
@ July 11, 2025
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి

కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి

చైతన్యరధం
@ July 11, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist