- ప్రధాని మోదీకి, భారత సైన్యానికి సెల్యూట్
- మంత్రి కొలుసు పార్ధసారధి
అమరావతి (చైతన్యరథం): భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్థాన్‌కు అర్ధమయిందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందన్నారు. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాద అంతానికి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడనున్నాయన్నారు. సిందూర్ ఆపరేషన్‌తో భారత దేశ సైన్యం సత్తా ఏమిటనేది ప్రపంచ దేశాలకు తెలిసిందిదన్నారు. ఈ ఆపరేషన్‌తో శత్రు దేశానికి వణుకు పుట్టిందన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి, భారత దేశ సైనానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.