అమరావతి: జగన్ రెడ్డి కళ్లు తెరిచి రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న కరువును చూడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 70 శాతం పొలాలు ఎండిపోయాయి. కరువు దెబ్బకు 24 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయలేదు. రాయలసీమ తీవ్ర కరవుతో అల్లాడుతోంది. జగన్ నీటి నిర్వహణ చర్యలు పరిస్థితిని దిగజార్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందని లోకేష్ ట్వీట్ చేశారు.
	    	
 













