అమరావతి (చైతన్యరథం): ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం ఒక ప్రగతిశీల చర్యగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. క్రియోటర్ ఎకానమీని బలోపేతం చేయడం.. సామాజిక, విద్యా కంటెంట్‌ను పరిపుష్టం చేయటంతో పాటు, ఆన్‌లైన్ మనీ గేమ్‌ల దుష్ప్రభావాల నుండి ఇది యువతను, కుటుంబాలను రక్షించేందుకు ఈ బిల్లు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. బాధ్యతాయుతమైన, ప్రపంచ స్థాయి గేమింగ్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మా నవకల్పనల రూపకర్తలు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించుకుంటారని మంత్రి లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.