విశాఖ: రుషికొండపై ఏపీ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి లీలానందన్‌కు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. రుషికొండ నిర్మాణాలపై గతంలోనే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. తీరప్రాంత నియంత్రణ జోన్(సీఆర్‌జెడ్) పరిధిలో ఏపీటీడీసీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు స్పష్టమైందని తెలిపారు.
భవనాలు పర్యాటకులకు కాకుండా సీఎం కార్యాలయ ఏర్పాటుకేనని స్పష్టమైంది. పర్యాటకుల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు. గతంలో కేరళలోని కొచ్చిలో మరడు ప్లాట్ల విషయంలోనూ భవనాల కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మరడు ప్లాట్ల యజమానులకు ఒక నియమం… ఏపీటీడీసీకి మరో నియమమా అని శర్మ ప్రశ్నించారు. మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పును జత చేస్తూ కేంద్రానికి ఆయన లేఖ రాశారు.