- 15 నెలల పాలనలో లక్ష కోట్లు దాటిన సంక్షేమం
- అభివృద్ధి దిశగానూ కూటమి సర్కారు పరుగులు
- సూపర్ సిక్స్ హిట్పై అనంతపురంలో ఎన్డీయే సభ
- 10న అనంతలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభ
- 15 నెలల పాలనా విజయాలను ప్రజల్లోపెట్టే ఉత్సాహం
- సవాళ్లున్నా సంక్షేమం.. అడ్డంకులను అధిగమించి అభివృద్ధి
- మేనిఫెస్టో అమలులో డిస్టింక్షన్ సాధించిన చంద్రబాబు సర్కారు
- సుపరిపాలనతో ఏపీకి సరికొత్త బ్రాండ్ ఇమేజ్
- రూ.పది లక్షల కోట్లమేర పెట్టుబడుల ఒప్పందాలు
- అన్ని వర్గాలకు బాసటగా కూటమి సంతృప్తికర పాలన
అమరావతి (చైతన్య రథం): సూపర్ సిక్స్ విజయంపై రాష్ట్రంలో కూటమి పార్టీలు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ఉమ్మడి సభనిర్వహిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ 15 నెలల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అనంతపురంలోని ఇంద్రప్రస్థనగర్లో సభా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి సభ కావటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతోపాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించటంపై సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
మొత్తంగా 15 నెలల పాలనా విజయాలను ఆవిష్కరించేలా సభను నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పార్టీలవారీగా టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. 2024 ఎన్నికలముందు కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు ప్రజల ముందుకు కలిసి వెళ్లాయి. 94శాతం స్ట్రైక్ రేట్తో సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాయి. 164 సీట్లతో కనీవినీ ఎరగని విజయాన్ని దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం సంయుక్త నిర్ణయాలతోనే ప్రజాపాలన సాగిస్తున్నాయి. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో లక్షకోట్లకు పైగా సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరింది. అలాగే ప్రభుత్వంగా ఇప్పటి వరకూ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి బహిరంగ సభ ద్వారా ప్రజలకు చెప్పాలని కూటమి అగ్రనాయకత్వం భావిస్తోంది.
సవాళ్లున్నా సంక్షేమం అభివృద్ధివైపే అడుగులు
గత పాలకులు చేసిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ అప్పులకుప్పగా మారింది. వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అవినీతి అక్రమాలతో రాబడి కుంటుపడింది. పరిశ్రమలూ పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. ఏపీ రోడ్ల గురించి పొరుగు రాష్ట్రాల్లోనూ హేళనగా మాట్లాడిన దుస్థితి. అనేక ఆర్థిక సవాళ్లున్నా ఊహించని స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. 15 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా నిర్ణయాలు అమలు చేసింది. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఇంకోవైపు అంటూ పాలనను పరుగులు పెట్టించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే పాలనా పగ్గాలు చేపడుతూనే పెంచిన పెన్షన్లను అమలు చేసేలా తొలిసంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హామీ ఇచ్చిన నాటినుంచే పెంచిన పెన్షన్లు అమలయ్యేలా మూడు నెలల బకాయిలు కలిపి వృద్ధులు, దివ్యాంగులు, ఇలా వివిధ కేటగిరీలకు చెందిన పెన్షనర్లకు అందించింది కూటమి సర్కారు. ప్రతీ నెలా జరిగే సామాజిక పండుగగా పెన్షన్ల పథకం అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు రూ.45 వేల కోట్లను వెచ్చించింది. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇచ్చేలా దీపం 2.0 పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తోంది. 2.3 కోట్ల ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇచ్చలా దేవర 2.0 పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తోంది. 23 కోట్ల ఉచిత గ్యాస్ సిలెండర్లు. మహిళల ఇళ్లల్లో వెలుగులు నింపాయి.
తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచింది. 67 లక్షలమంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.13 వేల చొప్పున నిధుల్ని జమ చేసింది. దీని కోసం రూ.10 వేల కోట్లను కూటమి వెచ్చించింది. గతంలో ఒక్కరికి మాత్రమే ఈ సాయం అందేది. కానీ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా వర్తింప చేస్తోంది. అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ 44 లక్షలమంది రైతులకు రూ.20 వేల చొప్పున మూడు విడతలుగా ఆర్ధిక సాయం అందించేలా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. గత పాలకులు ఏడాదికి రూ.7,500 విదిలిస్తే.. కూటమి సర్కారు ఒక్క విడతకే రూ.7 వేలను వారి ఖాతాల్లో వేసింది. దీనికోసం రూ.3,200 కోట్లను వెచ్చించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్త్రీశక్తి పథకం అమలు చేస్తోంది కూటమి. 5 కోట్ల పైచిలుకు ప్రయాణాలతో మహిళలు ఈ పథకాన్ని సూపర్హీట్ చేశారు. దీనికోసం రూ.2 వేల కోట్లను వెచ్చిస్తున్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీనీ నిలబెట్టుకుంది ప్రభుత్వం. అలాగే ఇచ్చిన హామిని నిలబెట్టుకుంది ప్రభుత్వం. అలాగే పెట్టుబడులను ఆకర్షించడం… పరిశ్రమలు స్థాపించడం ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగా కూటమి ప్రభుత్వం. అడుగులేస్తోంది. సుపరిపాలనతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని పునరుద్ధరించి.. 15 నెలల కాలంలో దాదాపు రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది ప్రభుత్వం. వీటిద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
అందరికీ ఆరోగ్య సేవ
పేదవాడికి ఆకలి తీర్చేలా రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.5కే భోజనం అందిస్తోంది. ఇప్పటి వరకూ 5.6 కోట్ల భోజనాలు అన్నార్తుల కడుపు నింపాయి. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య ధీమా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా పేద ధనికా అనే తారతమ్యం లేకుండా 5 కోట్లమంది ప్రజలకు వర్తింప చేస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు కూటమి నిర్ణయించింది. రూ.25 లక్షలవరకూ వైద్య చికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్షేమాన్ని-అభివృద్ధిని కలగలిపి పాలన చేస్తూ ఇప్పటికే సంక్షేమంపై రూ. లక్షకోట్లకు పైగా వెచ్చించింది. కూటమి సర్కారు. గత పాలకులు ఐదేళ్ల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని గొప్పలు చెప్పుకుంటుంటే.. కేవలం 15 నెలల కాలంలోనే రూ. లక్ష కోట్లకు పైగా వ్యయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదిలోనే ఇరిగేషన్ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది ప్రభుత్వం. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు తొలిసారి సాగునీరు అందించింది. ప్రభుత్వం.
అన్ని వర్గాలకు అండగా…
బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. చేతి వృత్తులు, కులవృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తోంది. బీసీల రక్షణ చట్టం తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గిస్తే… తిరిగి 34 శాతానికి పెంచేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు రూ.98,000 సబ్సిడీ ఇస్తోంది. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ.25 వేలకు ప్రభుత్వం పెంచింది. అలాగే ఈ వర్గాలకు దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో చోటు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోంది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్లు కేటాయించింది. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని ఇస్తోంది.
మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి రూ.259 కోట్లు అందించింది. చేనేతకు అండగా డ్లూమ్స్్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5 శాతం
రీయింబర్స్మెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు సాయంగా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 10 శాతం కేటాయింపు,
కురబలకు, యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాథి కల్పిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా… ఏవర్గాన్నీ నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ‘అడవితల్లి బాటలో’ కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టింది. మైనారిటీల హక్కులు పరిరక్షిస్తూ, అవసరాలు తీరుస్తోంది. ఇమామ్లకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. హజ్ యాత్రికులకు ఒకొక్కరికి రూ. లక్ష ఆర్థికసాయం అందిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్టును ఎంబార్కేషన్ పాయింట్గా చేసింది. 8,427 మంది పాస్టర్లకు రూ.5,000 గౌరవ
వేతనాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఇక అర్చకుల జీతాలను రూ.15 వేలు చేసిన ప్రభుత్వం… ధూప దీప నైవేద్యాలకు ఆలయానికి రూ.10 వేల చొప్పున చెల్లిస్తోంది. ఇక వేద విద్యార్థులకు రూ.3 వేల స్టయిఫండ్ కూటమి ప్రభుత్వం అందిస్తోంది.
టీమ్ ఎన్డీఏగా సక్సెస్…
చిన్నపాటి పొరపొచ్చాలు లేకుండా కూటమి సర్కారు పాలన కొనసాగిస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రభివృద్ధే లక్ష్యంగా… సీట్ల సర్దుబాటు చేసుకున్న మూడు పార్టీలు… అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాతో వెళ్తున్నాయి. కలిసికట్టుగా నడుస్తున్నాయి. 15 నెలల కాలంలో సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ -మంత్రి లోకేష్ -బీజేపీ అగ్ర నేతలు అత్యంత సమన్వయంతో పని చేస్తున్నారు.. అవసరమైన సమయాల్లో కేంద్రంతో, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ మూడు పార్టీల మధ్యే అంతే సమన్వయం, సహకారం కన్పిస్తోంది. ప్రాంతాలు, జిల్లాలవారీగా… ఆయా సామాజిక వర్గాల సమీకరణాలను బేరీజు వేసుకుని నామినేటెడ్ పదవుల కూర్పు చేపడుతున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఇప్పటి వరకు సుమారు 60 వేల నామినేటెడ్ పదవుల భర్తీ సాఫీగా జరిగింది. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పని చేస్తున్నాం.. ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే రీతిలో ఓ బలమైన సంకేతాన్ని ఈ వేదిక ద్వారా పంపాలన్నది కూటమి నేతల లక్ష్యంగా కన్పిస్తోంది.