• వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది, మా మండలం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం కావడంతో నిత్యం అనారోగ్యాలకు గురవుతున్నాం.
• గ్రామంలో డ్రైనేజీలు లేక మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నాం.
• మా గ్రామం నాగార్జునసాగర్ ఆయకట్టు చివరిప్రాంతంలో ఉండటంతో సాగునీటి సమస్య ఉంది.
• ప్రకాశంజిల్లా నుండి సాగర్ నీరు వచ్చి మా ప్రాంతంలో రెండు కాలువలుగా విడిపోయి గుంటూరుకు కూడా నీరు వెళుతుంది.
• ప్రకాశంజిల్లా నుండి మా ప్రాంతానికి నీరు రాకుండా ఎగువ రైతులు అడ్డుకుంటున్నారు.
• నీరు అందక పంటలు దెబ్బతినడంతో జీవనోపాధి కోసం వలసలు వెళ్లాల్సివస్తోంది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది.
• గ్రామీణ ప్రాంత ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది.
• జల్ జీవన్ మిషన్ అమలులో బీహార్ కంటే ఏపీని వెనుకంజలో నిలబెట్టిన దద్దమ్మ జగన్.
• టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.
• గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నీ పునరుద్ధరిస్తాం.
• సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి కాల్వల చివరి వరకు రైతులకు సాగునీరు అందిస్తాం.
• వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందజేసి వలసలను నివారిస్తాం.