- నందమూరి తారక రామారావు అద్భుత విజయాలు అందుకోవాలి
- తొలి సినిమా ప్రారంభ వేళ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
అమరావతి (చైతన్యరథం): నందమూరి తారక రామారావు తొలి సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దివంగత జానకిరామ్ కుమారుడు, దిగ్గజం ఎన్టీఆర్ మునిమనవడు నందమూరి తారక రామారావు సినీ అరంగేట్రాన్ని చూసి మనసు గర్వంతో, భావోద్వేగంతో నిండిపోయిందన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని తారక్ మరింత ముందుకు తీసుకెళ్లటం చూసి ఆయన మనవడిగా తాను ఎంతో ఆనందిస్తున్నానన్నారు. అతడు ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అతడి ద్వారా నందమూరి వారసత్వ కీర్తి, ప్రతిష్టలు మరింత దేదీప్యమానంగా, ఉజ్వలంగా ప్రకాశిస్తాయని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
“