- టీడీపీ అంటే నమ్మకం, దైర్యం
- దానికి పునాది వేసింది ఎన్టీఆర్
- ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళుతున్న చంద్రబాబు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటన
- ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు
అమరావతి (చైతన్యరథం తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం దివంగత ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహానాయకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం “తెలుగు తేజోమూర్తికి నివాళులు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎన్టీఆర్‌కు తమ సేవా నివాళులు అర్పించారు. రక్తదానం చేసిన ప్రతి కార్యకర్తను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి న మహానాయకుడు అని కొనియాడారు. తెలుగువారికి ఆత్మవిశ్వాసం, రాజకీయ చైతన్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశంపార్టీలో ఉన్నా మంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం.. ఆ నమ్మకానికి పునాది వేసింది ఎన్టీఆరేనని స్పష్టం చేశారు.
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి, సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో దేశానికి చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఢిల్లీ పెద్దలను వణికించిన ధైర్యశాలి ఎన్టీఆర్ అని కొనియాడారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా పేదవాడి కడుపు నింపిన నాయకుడు ఎన్టీఆర్ అని, కూడు-గుడ్డ-నీడను పేదలకు హక్కుగా అందించిన మహానుభావుడని అన్నారు. స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించి సామాజిక విప్లవానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించి రాజకీయ చైతన్యం తెచ్చిన గొప్ప నేతగా ఎన్టీఆర్‌ను గుర్తు చేశారు. రాజకీయ, సామాజిక, సంక్షేమ రంగాల్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు పేదల జీవితాలను మార్చాయని తెలిపారు. గురుకుల పాఠశాలల స్థాపనతో విద్యలో సమానత్వానికి దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పేదవాడికి రాజకీయ భిక్ష కాదు – రాజకీయ హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు..ఎన్టీఆర్ తర్వాత రాష్ట్ర పాలక పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఐటి రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే మార్గదర్శకంగా నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని అన్నారు. నేను నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ, ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళు _న్నారని ప్రశంసించారు.
పేదవాడికి కేవలం సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను భుజాలపై వేసుకుని చంద్రబాబు. నాయుడు రాష్ట్రాభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు.
అలాగే, ఎన్టీఆర్-చంద్రబాబు రాజకీయ వారసత్వ బాటలో ముందుకు సాగుతున్న మంత్రి నారా లోకేష్ యువతరానికి స్పష్టమైన విజన్ తో నాయకత్వం అంది స్తున్నారని అన్నారు. ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల స్థాపన ద్వారా రాష్ట్రాన్ని భవిష్యత్ దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో నాయకత్వంపై సందేహాలు ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ఆ ప్రశ్నకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని, పసుపు సైనికులు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు, కష్టాలు భరించినా పార్టీని అధికారంలోకి తీసుకురావ డంలో వారిత్యాగాలు అమూల్యమని పల్లా శ్రీనివాస రావు కొనియాడారు. ఏ కార్యకర్తకు “మాకు అండ లేదు” అనే భావన రాకూడదని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలో కొనసాగిస్తూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ కర్తవ్యమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.















