(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
డిల్లీ పాలకుల చెంత బందీ అయిన తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించి ప్రపంచం ముందు మేం తెలుగువారమని తలెత్తుకుని తిరిగేలా చేసిన మహ నీయుడు అన్న ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి నేటికి 28 సంవత్సరాలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా యావత్ తెలుగుప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుజాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పరిరక్షించాలనే సదాశయంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న కష్టాలకు చరమగీతం పాడాలన్న దృఢ సంకల్పంతో 1982 మార్చి 29న ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు అన్న ఎన్టీఆర్. 1982లో తెలుగుదేశం రూపంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
డిల్లీ పాలకుల చెంత బందీ అయిన తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించి ప్రపంచం ముందు మేం తెలుగువారమని తలెత్తుకుని తిరిగేలా చేసిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి నేటికి 27సంవత్సరాలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా యావత్ తెలుగుప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుజాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పరిరక్షించాలనే సదాశయంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న కష్టాలకు చరమగీతం పాడాలన్న దృఢ సంకల్పంతో 1982 మార్చి 29న ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు అన్న ఎన్టీఆర్. 1982లో తెలుగుదేశం రూపంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు మదరాసీలుగా గుర్తింపబడే తెలుగుజాతికి ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తే, చంద్రబాబు తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. తెలుగు గడ్డ మీదనే కాదు యావత్ భారతదేశంలోనే అనితర సాధ్యమ్కెన చరిత్ర సృష్టించిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్. ‘’సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు’’ అని నినదించి ఆచరించిన నిజమ్కెన మానవత్వం నిండిన నిండు మనిషి ఎన్టీఆర్. రాజకీయం అనే బ్రహ్మ పదార్థాన్ని సామాన్య ప్రజానీకానికి చేరువ చేసిన మొట్ట మొదటి నాయకుడు. తొమ్మిది నెలల కాలంలో చ్కెతన్యరథంపై రాష్ట్రాన్ని చుట్టి 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి అయిదున్నర కోట్ల జనాభాలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలసి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు బిబిసి వంటి ఛానల్ ప్రసారం చేసింది. సమాజంలో అట్టడుగున్న ఉన్న పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే లక్ష్యంగా 2రూపాయల కిలోబియ్యం, జనతావస్త్రాలు, పక్కాగృహాల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను తొలిసారిగా ప్రవేశపెట్టి సంక్షేమానికి కేరాఫ్ అఢ్రస్ గా నిలిచారు అన్న ఎన్టీఆర్.
జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలకపాత్ర
ఆనాడు డిల్లీ పెత్తనం పెరిగిపోయి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూల్చడం, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడం, పదవులు కాపాడుకోవడానికి, ఢల్లీి చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని డిల్లీ పెద్దల పాదాలముందు తాకట్టు పెట్టారు. ఫెడరల్ వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని ఘోరంగా దెబ్బ తీశారు ఆ నాటి కాంగ్రెస్ పాలకులు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీశారు. ఆ తరుణంలో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీని స్థాపించి నవ మాసాల్లోనే కాంగ్రెస్ విష వృక్షాన్ని కూకటి వేళ్ళతోనే పెకిలించి వేశారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడారు, ఆనాటి దుష్పరిపాలనను అంతమొందించారు. అప్పటి నిరంకుశ పాలన నుండి దేశాన్ని కాపాడటం కోసం జాతీయ స్థాయిలో అన్నీ రాజకీయ పక్షాలను ఏకతాటి పైకి తెచ్చారు. నేషనల్ ప్రంట్ ఏర్పాటు చేసి భారత ప్రజా స్వామ్యానికి కొత్త వూపిరిని అందించారు. 1985పార్లమెంటు ఎన్నికల్లో 33ఎంపిలతో 8వ లోక్ సభలో ప్రధాన ప్రతిక్షంగా టిడిపి వ్యవహరించింది. ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ ప్రణాళికను రూపొందించించారు. తెలుగు భాషకు నిండు గౌరవం, రైతులకు చేయుత, గ్రామీణాభివృద్ది, గ్రామీణ విధ్యుదీకరణ, పంచాయితీరాజ్ సంస్థలకు హెచ్చు అధికారాలు, విద్యావిధానంలో మౌలిక మార్పులు, పోలీసు శాఖ ప్రక్షాళన,వైద్య ఆరోగ్య సేవలు,సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం,మహిళాభ్యుదయం,కేంద్ర-రాష్ట్ర సంబంధాలు,ఎన్నికల సంస్కరణలు, గృహవసతికి ప్రాధాన్యం,సెక్యులర్ విధానం,అంతర్జాతీయ దృక్పధం వంటి కార్య క్రమాలతో కూడిన ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ పరిపాలన సాగించింది.
సంక్షేమ పథకాల ఆధ్యుడు అన్న ఎన్టీఆర్
దేశరాజకీయ చరిత్రలో ఎందరో రాజకీయనాయకులు ఒకవెలుగు వెలిగి తర్వాతతెరమరుగైనా సంక్షేమ పథకాల ఆద్యుడిగా ఇప్పటికీ తనదైనముద్ర వేసుకున్న చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు. పట్టుదల, మొక్కవోని ధైర్యం, ప్రగతిశీల ఆలోచనా విధానమే ఆయన రాజకీయాల్లోకి రావడానికి బలమైన కారణం. అగ్రకులాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలకు చేరువ చేశారు. వారిలో రాజకీయ చైతన్యం తెచ్చి,ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల్లో గెలిపించి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత ఎన్టీఆర్ దే. విద్యాధికులను రాజకీయాల్లో ప్రోత్సహించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో 289 స్థానాల్లో 125మంది గ్రాడ్యుయేట్లను, 28స్థానాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లను, 20చోట్ల డాక్టర్లను, 8చోట్ల ఇంజనీర్లను, 47స్థానాల్లో లాయర్లను పోటీకి నిలబెట్టి బలవంతులు, ధనవంతులకే పరిమితమైన రాజకీయాన్ని యువతకు, మేధావులకు,మహిళలకు, బలహీన వర్గాలకు చేరువ చేశారు.
అణగారిన వర్గాలకు అండగా…!
సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలకు, సాంఘిక అసమానతలకు గురవుతున్న బడుగు బలహీనవర్గాలకు అండగా నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. అణగారిన వర్గాల్లో నూతన చ్కెతన్యం కల్పించేలా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అర్హుల్కెన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం అందేలా తెలుగుదేశం పార్టీ కృషి చేయడం జరిగింది. దేశంలోనే ఎక్కడాలేని సంక్షేమ పథకాలను తెలుగు ప్రజలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. రూ.2లకే కిలో బియ్యం, పక్కా ఇల్లు, తొక్కేవాడికే రిక్షా, జనతా వస్త్రాలు, రూ.50 కే హార్స్‌పవర్ విద్యుత్, గ్రామాల్లో ఆధునిక చాకిరేవుల నిర్మాణం, వృద్ధాప్య పింఛన్లు, గిరిజన, హరిజన వాడల్లో ఇంటింటికీ విద్యుత్ సౌకర్యం వంటి ఎన్నో కార్యక్రమాలకు స్వర్గీయ ఎన్‌టి రామారావు గారు నాంది పలికారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద విద్యార్థులకు నాణ్యమ్కెన విద్యకు నాంది పలికారు.
పాలనా సంస్కరణలకు శ్రీకారం
పరిపాలన వికేంద్రీకరణ కొరకు జిల్లాలోని పంచాయతీ సమితులను, తాలూకాలను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తెచ్చింది మన తెలుగుదేశం పార్టీనే… మన నాయకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారే. గ్రామీణ ప్రజలకు విముక్తి కలిగేలా రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి గ్రామాలలో అట్టడుగు వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వీఏఓ, ఎమ్మార్వో, ఎండీవో వ్యవస్థలను తీసుకువచ్చింది మన తెలుగుదేశం పార్టీనే. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రాథమిక స్థాయిలో దృశ్య, శ్రవణ విద్యా బోధనను ప్రవేశపెట్టింది ఎన్‌టి రామారావే. మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టి ప్రజల ముంగిట పాలనను తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పలికి తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు పాటుపడిరది తెలుగుదేశం పార్టీనే.
బలహీనవర్గాలకు చేయూత
సంక్షేమ పథకాలతో తమదైన ముద్రవేసిన ఎన్టీఆర్… బిసి, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారికి ఆరాధ్యదైవంగా నిలచారు. ముందడుగు, మలుపు, చ్కెతన్యం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 32 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు, సుమారు కోటి మంది మహిళలకు డ్వాక్రా సంఘాల కింద లబ్ధి చేకూర్చారు. గీత కార్మికులు చెట్లు పెంచుకునేందుకు 5 ఎకరాలు భూమి ఇస్తూ జీవో నెంబర్ 560, బంజరు భూముల్లో, చెరువుల్లో గొర్రెలను పెంచుకునేందుకు, రోడ్లకు ఇరువ్కెపులా ఉండే తుమ్మకాయలను గొర్రెల కాపరులు ఉపయోగించుకునేందుకు జీవో 559, 1016ను చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసింది. రజకులకు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడానికి జీవో నెంబర్ 27, నాయి బ్రాహ్మణులు పుణ్యక్షేత్రాలలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ జీవో నెంబర్ 254, మత్స్యకారులకు రుణాలందించి చేప పిల్లలు, వలలు, సైకిళ్లు ఇచ్చేందుకు జీవో నెంబర్ 353ను ఇవ్వటం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. బీసీలకు ఆదరణ, మ్కెనార్టీలకు రోష్నీ, మ్కెనార్టీ అనాధ మహిళల కోసం తత్కాల్ వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.
సామాజిక న్యాయం-రాజకీయాధికారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వమూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి గురించి పట్టించుకోలేదు. శ్రీ ఎన్‌టి రామారావు, శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని బలహీనవర్గాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగింది. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలాంటి వారు. వెనుకబడిన తరగతులకు చట్టసభల్లో 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కొన్ని థాబ్దాలుగా వేళ్ళూనుకున్న అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించింది తెలుగుదేశం పార్టీయే. రెండు గ్లాసుల విధానం, ఆలయాల్లోకి దళితుల ప్రవేశం నిషేధం వంటి సామాజిక రుగ్మతలను రాష్ట్రం నుంచి పారద్రోలింది. దళితులతో సహపంక్తి భోజనాలు నిర్వహించి దళితుల ఆత్మగౌరవం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను నియమించింది, జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది, దళితులను పార్లమెంటు స్పీకర్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా నియమించింది కూడా తెలుగుదేశం పార్టీయే. భారత రాజ్యాంగ నిర్మాత డాపప బి.ఆర్. అంబేద్కర్‌కు ‘’భారతరత్న’’ పురస్కారం అందించడంలో కీలకపాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీయే. మహిళల సర్వతోముఖ వికాసానికి కృషి చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీనే. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతోపాటు వారిని విద్య, రాజకీయ రంగాల్లో ప్రోత్సహించింది.మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ నెలకొల్పింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన డ్వాక్రా సంఘాలను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనే.
తెలుగుప్రజల సత్తాచాటిన ఉద్యమం
అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, తిరిగి నెలరోజుల్లోనే (16 సెప్టెంబర్ 1984లో) ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో నాడు నారా చంద్రబాబు నాయుడు చూపిన రాజకీయ కౌశలం నేటికీ మరువలేనిది. అన్నఎన్టీఆర్ కు మద్దతు ఊరువాడా కదిలివచ్చి డిల్లీపాలకులకు తెలుగువాడి తెగువచూపారు. తెలుగువారిలో ఆత్మవిశ్వాసం నింపిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. 1996 తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పాలనను దూరం చేయడంలో నారా చంద్రబాబు నాయుడుగారు పోషించిన పాత్ర దేశ చరిత్రలో చిరస్మరణీయం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల సంక్షేమానికి పాటుపడే పార్టీ తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చివేసిన అన్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో కానరాని లోకాలకు తరలివెళ్లారు. ఎన్టీఆర్ లేరన్న చేదునిజాన్ని జీర్ణించుకోలేక వేలాది గుండెలు ఆగిపోయాయి. భౌతికంగా దూరమై 28సంవత్సరాలు గడిచినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి మనసుల్లో ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్థాయిగా నిలచిపోయే ఏకైక రూపం అన్న ఎన్టీఆర్.