- 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కీలక ఘట్టం
- సంక్షేమాన్ని పరిచయం చేసిన మహోన్నతుడు ఎన్టీఆర్
- తెలుగు వైభవం.. ఎన్టీఆర్
- ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తాం
- అమరావతిలో తెలుగు వైభవం పేరిట ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటు
- సజీవ చరిత్ర 1984- ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ మొబైల్ యాప్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
విజయవాడ(చైతన్యరథం): తెలుగుదేశం ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రతిపాలసీ దేశానికే ఆదర్శం గా నిలిచా యని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో తెలుగువైభవం పేరిట ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటుచేస్తామని, ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని, పేదరికంలేని సమాజం సాధిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ
పోరంకిలో నిర్వహించిన ‘సజీవ చరిత్ర-1984 ప్రజా స్వామ్య పరిరక్షణ ఉద్యమం’ పుస్తకావిష్కరణ కార్య క్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈపుస్తకాన్ని రూపొందించింది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “సజీవ చరిత్ర పుస్తకం 40ఏళ్లు వెనక్కి తీసు కెళ్లింది. ఆనాటి జ్ఞాపకాలన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి. దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలు తెరవెనుక కుట్ర లకు తెరతీశారు. ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని 20నెలలకే ఇంటికి పంపించాలని చూశారు. గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన రోజే కుట్రకు తెరలేపారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.
సమిష్టిగా పోరాడాం
“ఆ రోజు ఏదో కుట్ర జరుగుతోందని అర్ధమైంది. దాన్ని తిప్పి కొట్టాలంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండా లని రాత్రికి రాత్రే 161 ఎమ్మెల్యేలను ముషీరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో పెట్టాం. అదో గేమ్ ఛేంజర్. ఆనాడు ఎమ్మెల్యే క్వార్టర్స్కి ఎమ్మెల్యేలను తీసుకురావడంలో ఇంద్రసేనారెడ్డి ముఖ్య పాత్ర పోషిం చారు. వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ వెనుకే ఉండి, దేశంలో ఉండే నేతలందరికి ఒకతాటిపైకి తీసుకొచ్చా రు. ఎన్టీఆర్ కు వెంకయ్యనాయుడంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆనాడు అప్రజాస్వామికంగా నాటి రాష్ట్ర గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అసమ్మతి నాయకుడిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రిగా గవర్నరును కలవడానికి వెళ్లిన ఎన్టీఆర్ను తిరిగి పోలీస్ వ్యాన్లో కంట్రోల్ రూమ్కు తీసుకెళ్లిన ఘటన ఎప్పటికీ మర్చి పోలేను” అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం… ఓ చరిత్ర
“కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు మొత్తం దేశమంతా భగ్గుమంది. నాడు ఎన్టీఆర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ… ఇలా ప్రాంతంతో సంబం ధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ పరిరక్షణ ఉద్యమంచేపట్టారు. ఓనాయకుడికి చరిత్రలో ఎప్పుడూ చూడని సంఘీభావం చూశాను. ఆనాడు ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే మా ముందున్న అతిపెద్ద సవాల్. ఒక్కో ఎమ్మెల్యేకి మంత్రి పదవి, రూ. కోటి డబ్బు ఆఫర్ చేశారు. కానీ ఎందరో మాకు సహకరించారు. కర్ణాట కలో రామకృష్ణ హెగ్దే ప్రభుత్వం మాకు షెల్టర్ ఇచ్చింది. నాటి మంత్రి రఘుపతి మాకు ఎంతో సాయం చేశారు” అని సీఎం చంద్రబాబు చరిత్ర జాడను గుర్తు చేశారు.
మహా పోరాటంలో గెలిచిన ఎన్టీఆర్
“1947 నుంచి 1984 వరకు 26 కాంగ్రెసేతర ప్రభుత్వాల్ని కూల్చేశారు. 18నెలలకు ఒక్కో ప్రభుత్వం పోయింది. కానీ మహా పోరాటంలో గెలిచిన ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. జాతీయస్థాయిలో 18 పార్టీలు జట్టు కట్టాయి. గవర్నర్ రామ్లాలు రీకాల్ చేయాలనే నినాదం హోరెత్తింది. కట్టుబట్టలతో వెళ్లి 30 రోజులకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగొచ్చాను. నాలాంటి లక్షలమంది త్యాగాలు చేసి పోరాడారు. చరణ్సింగ్, చంద్రశేఖర్, వాజపేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండజ్, కరుణానిధి, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య… కేంద్రస్థాయి అఖిలపక్ష సారధ్య సంఘంలో ఉన్నారు. వెంకయ్యనాయుడు, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, సుందరయ్య పోరాడారు” అంటూ నాటి రోజులను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం… ఓ చరిత్ర
“కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు మొత్తం దేశమంతా భగ్గుమంది. నాడు ఎన్టీఆర్ కాశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ… ఇలా ప్రాంతంతో సంబం ధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ పరిరక్షణ ఉద్యమంచేపట్టారు. ఓనాయకుడికి చరిత్రలో ఎప్పుడూ చూడని సంఘీభావం చూశాను. ఆనాడు ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే మా ముందున్న అతిపెద్ద సవాల్. ఒక్కో ఎమ్మెల్యేకి మంత్రి పదవి, రూ. కోటి డబ్బు ఆఫర్ చేశారు. కానీ ఎందరో మాకు సహకరించారు. కర్ణాట కలో రామకృష్ణ హెగ్దే ప్రభుత్వం మాకు షెల్టర్ ఇచ్చింది. నాటి మంత్రి రఘుపతి మాకు ఎంతో సాయం చేశారు” అని సీఎం చంద్రబాబు చరిత్ర జాడను గుర్తు చేశారు.
మహా పోరాటంలో గెలిచిన ఎన్టీఆర్
“1947నుంచి 1984 వరకు 26 కాంగ్రెసేతర ప్రభుత్వాల్ని కూల్చేశారు. 18నెలలకు ఒక్కో ప్రభుత్వం పోయింది. కానీ మహా పోరాటంలో గెలిచిన ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. జాతీయస్థాయిలో 18 పార్టీలు జట్టు కట్టాయి. గవర్నర్ రామ్లాలు రీకాల్ చేయాలనే నినాదం హోరెత్తింది. కట్టుబట్టలతో వెళ్లి 30 రోజులకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగొచ్చాను.
నాలాంటి లక్షలమంది త్యాగాలు చేసి పోరాడారు. చరణ్సింగ్, చంద్రశేఖర్, వాజపేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండజ్, కరుణానిధి, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య… కేంద్రస్థాయి అఖిలపక్ష సారధ్య సంఘంలో ఉన్నారు. వెంకయ్యనాయుడు, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, సుందరయ్య పోరాడారు” అంటూ నాటి రోజులను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్
“సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నమ్మిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. సజీవ చరిత్ర పేరుతో ఈ పుస్తకాన్ని భావితరాలకు అంద జేసిన టీడీ జనార్ధన్, విక్రమ్ పూలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను నేడు దేశమంతా అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన నదుల అనుసంధానం దేశ మంతటా అమలవుతోంది. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే మనం స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఎన్టీఆర్ మహిళలకు స్థానిక సంస్థల్లో 9శాతం రిజర్వేషన్లు పెడితే.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో చట్టసభల్లో ఆడ బిడ్డలకు 33శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి. ఆనాడు ఎన్టీఆర్ యాంటీ కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించారు. నేడు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. ప్రధాని మోదీ సారధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి తెచ్చారు. భవిష్యత్లో ప్రపంచంలోనే మన దేశం అగ్రస్థానంలో నిలవబోతోంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలుగుజాతిని నెంబర్ వన్ చేస్తాం
“ఎన్టీఆర్ విగ్రహం చూసి సంకల్పం తీసుకుంటే ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ తెలుగు వైభవం, తెలుగుదనానికి ప్రతిబింబం. తెలుగుజాతి ఆత్మగౌర వానికి ప్రతీక. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. పట్టుదల, ఆత్మ విశ్వాసంతో ఒక్కో మెట్టు ఎదిగారు. మనకు దేవుడంటే ఎన్టీఆరే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలోనే చూశాం. ప్రజా స్వామ్యంలో నియంత పోకడలకు చోటులేదని 2024 ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు. దేశానికి సంక్షేమం పరిచయంచేసిన ఎన్టీఆర్ స్పూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అర్హులందరికీ సంక్షేమం అందిస్తాం. ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.