- గోపాలకృష్ణ సేవలు అభినందనీయం
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
- గొప్ప మానవతామూర్తి: టీడీ జనార్దన్
- తల్లికి వందనంపై పాట విడుదల
మంగళగిరి(చైతన్యరథం): తల్లికి వందనం పథకంపై ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ రచించిన పాటను గురువా రం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీ జనార్దన్ విడుదల చేశారు. అనం తరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతటా పేద, మధ్య తరగతి ప్రజలు చంద్రబాబ నేతృత్వంలో నడుస్తున్న కూటమి ప్రభు త్వంపై సంతోషంగా ఉన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్ పథకాలు నేడు అమలు అవ్వడంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి ఆర్థిక భారం ఉండకూడదని, తన బిడ్డలను చదివించుకొనడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15 వేలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇస్తుంది. చలన చిత్రాల్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎలానో..నాట్యమండలిలో కృష్ణుడిగా గుమ్మడి గోపాలకృష్ణ పేరొందారు. దేశ విదేశాల్లో ఆయన రంగ స్థల నటుడు. నాటక అకాడమీకి చైర్మన్‌గా, నటుడుగానే కాకుండా గాయకుడు, రచయితగా ఉంటూ ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు. ఆయన రచించిన ప్రతి పాట ప్రజలను ఉత్తేజరుస్తున్నాయి. ప్రభు త్వం ప్రజలకు చేస్తున్న సేవలను తన రచనలతో పాట రూపంలో ప్రజల్లోకి తీసుకెళుతున్న గోపాలకృష్ణ సేవ అభినందనీయం. నేడు తల్లికి వందనం పథకంపై ఆయన రచించిన పాట చాలా అద్భు తంగా వచ్చిందని పేర్కొన్నారు. ఈ పాటను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలని యువనేత నారా లోకేష్ గారు ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
గొప్ప మానవతామూర్తి గుమ్మడి గోపాలకృష్ణ
టీడీ జనార్దన్ మాట్లాడుతూ దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీకి గుమ్మడి గోపాలకృష్ణ ఎనలేని సేవ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో సాంస్కృతిక విభాగాన్ని పెంపొందిస్తూ నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ. మొదట్లో ఆయన పద్యాలు మాత్రమే రాసేవాడు. కాలం మారుతుంది.. పద్యాలతో పాటు పాటలు కూడా రాయి అని ఓ సందర్భంలో చంద్రబాబు.. గోపాల కృష్ణకు చెప్పారు. జానపదాలు కూడా ప్రజలు వింటారు ఒకసారి ఆలోచించండని నేనూ అన్నాను. అలానే ఆయన పద్యాలు రాస్తూ నే ఓ వైపు జానపదాలు, మరోవైపు పాటలు రాస్తూ స్వయంగా ఆయనే పాడడం గొప్ప విషయం. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఒక పాట రాసి ప్రజలను ఆలోచింపజేశారు. ఈ రోజు తల్లికి వం దనంపై రాసిన ఈ పాట కూడా మొత్తం సూపర్‌సిక్స్ పథకాలన్నింటినీ ప్రజలకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుం ది. అమెరికాలో తెలుగు ప్రజలకు నటనలు నేర్పుతూ ఉండేవారు. కరోనా సమయంలో అక్కడి వారికి ఆన్‌లైన్‌లో నేర్పించేవారు. అక్కడ వచ్చిన డబ్బును ఇక్కడ నాటకాలు లేక ఇబ్బందులు పడుతు న్న కళాకారులకు ఆర్థిక సాయం చేసిన గొప్ప మానవతామూర్తి గుమ్మడి గోపాలకృష్ణ. నేడు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని పాట రూపంలో ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతు న్నాం. అందుకే ఆయన సేవలను గౌరవించి ఏపీ నాటక అకామడీ చైర్మన్ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. గత పాలకులు వారిపై పాటలు పాడాలి, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని ఆఫర్ చేసినా.. నా గొంతు ఎప్పుడో చంద్రబాబుకు అప్పగించే శానని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అని కొనియాడారు.
గత ప్రభుత్వం ఆఫర్స్‌ను రిజెక్ట్ చేశాను: గుమ్మడి
గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ నేను పద్యాలు రాసుకుం టుంటే మారుతున్న కాలానికి అనుగుణంగా జానపదాలు కూడా రాయి అని ప్రోత్సహించిన మార్గదర్శి టీడీ జనార్దన్. చంద్రబాబు ను అరెస్ట్ చేసినప్పుడు, ప్రభుత్వం వచ్చాక బుడమేరు పొంగిన ప్పుడు ఇలా అనేక సందర్భాల్లో మనుషుల్లో దేవుడు ఉంటాడని నిరూపించిన చంద్రబాబుపై నేను ప్రత్యేకంగా పాట రాశాను. అందుకుగాను వాషింగ్టన్‌లో నాకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నాకు అనేక ఆఫర్లు వచ్చాయి. పద్మశ్రీకి అయితే నీ పేరే రికమండ్ చేయనని గత పాలకులు అన్నారు. చంద్రబాబు పేరుకంటే నాకు పద్మశ్రీ ఎక్కువ కాదని తిరస్కరించాను. చంద్రబా బు చేసిన సేవలను ఇంతకుముందు నాటకాల్లో వాడేవాడిని. దాదా పు 15 నంది అవార్డులతో పాటు అనేక దేశాల్లో పురస్కారాలు అం దుకున్నాను. నా గొంతును చంద్రబాబుకు తప్పించి మరెవ్వరికీ వాడను అని గత ప్రభుత్వంలో కూడా చెప్పాను. ఓ సందర్భంలో ‘‘మోస్ట్ కమిటెడ్ పర్సెన్’’ అని డిప్యూటీ సీఎంకు నన్ను స్వయంగా సీఎం చంద్రబాబు పరిచయం చేయడం నాకు పద్మశ్రీ కంటే ఎక్కు వ. పీ4 పథకం ఆదర్శంగా తీసుకుని నాకు వస్తున్న గౌరవ వేతనం లో నుంచి నా ఊరులోని రోడ్లను బాగు చేయిస్తున్నాను. ఎప్పటికీ చంద్రబాబు బాటలో నడుస్తున్నానని స్పష్టం చేశారు.