- పాల్గొన్న ఎమ్మెల్యేలు గంటా, అమిలినేని
- రాష్ట్ర ప్రగతిలో ప్రవాసులు ఎప్పుడూ భాగమే
- అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని ప్రశంసలు
- తారకరామం, మహాస్వాప్నికుడు పుస్తకాల ఆవిష్కరణ
అమరావతి(చైతన్యరథం): ఎన్‌ఆర్‌ఐ విభాగం ఖతార్ ఆధ్వర్యంలో అక్కడి టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశంతో పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వెలువరించిన తారకరామం పుస్తకంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు జీవిత ప్రస్థా నాన్ని తెలియజేస్తూ ప్రముఖ రచయత విక్రమ్ పూల రచించిన మహా స్వాప్నికుడు అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖతార్‌లో తెలుగువారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రపంచ వేదికపై తెలుగువారు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారంటే అందుకు ఎన్టీఆర్, చంద్రబాబే కారణమన్నారు. కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపుచ్చుకు ని నేడు ప్రపంచ వేదికపై తెలుగువారు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన ఒరవడి ఏర్పడిరదని, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్మరణీయు డిగా నిలిచిపోతారన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతికి ప్రపంచఖ్యాతి తీసుకువస్తే చంద్రబాబు తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపునిచ్చారని కొనియాడారు. ఉమ్మడి ఆంద్ర óప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించారని అన్నారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేశారని, చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరుగెత్తుకుంటూ వస్తాయన్నారు. సంపద సృష్టి అన్న దాన్ని పాలనలో ప్రవేశపెట్టిన మేధావి చంద్రబాబు అని కొనియాడారు. రాజకీయ అంతిమ లక్ష్యం ప్రజాసేవేనని, ప్రవాసులు ఇక్కడి నుంచి సైతం రాష్ట్రం గురించి ఆలో చించి పలు రంగాల్లో చేయూతనందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు మాట్లాడుతూ ప్రవాసులు ఎప్పుడూ రాష్ట్ర ప్రగతిలో భాగమేనని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఖతార్ టీడీపీ అధ్యక్షుడు జి.రమణయ్య, గల్ఫ్ కౌన్సిల్ మెం బర్ ఎం.సత్య, వైస్ ప్రెసిడెంట్ ఎం.నరేష్, రవి పోనుగుమాటి, గోవర్థన్, విక్రమ్, రమేష్, రవీంద్ర, కవీంద్ర, అనిల్, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.