అమరావతి (చైతన్య రథం): విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. నిన్న కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె హైస్కూల్లో అధునాతన అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్తో పాటు, సమీప పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తరలించే వాహనాలను మంత్రి ప్రారంభించారు. వాహనాలపై పసుపు రంగు ఉండటాన్ని గమనించిన లోకేశ్.. వెంటనే ఆ రంగు మార్చాలని కలెక్టర్‌కు సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కలర్ కోడ్ అయిన గ్రీన్, బ్రౌన్, రెడ్ కలర్స్ వాడాలని సూచించారు.