- అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యంపై చర్యలు
- సమగ్ర విచారణకు మంత్రి సత్యకుమార్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): ప్రభుత్వాసుపత్రుల్లో సేవలను మెరుగుపర్చే ప్రయత్నా ల్లో భాగంగా విధులు సరిగా నిర్వర్తించకుండా అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకు మార్ యాదవ్ ఆదేశించారు. 2019-24 కాలంలో అప్పటి ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రభుత్వ వైద్యుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, సర్వీసు నిబంధనల ఉల్లంఘనపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దారితప్పి వ్యవహరిస్తున్న వైద్యుల వైఖరిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా విశాఖ కింగ్ జార్జ్ ప్రభుత్వాసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అంపోలు అచ్యుతరావును తక్షణమే ఏలూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఆయనపై వచ్చిన పలు ఫిర్యాదులపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఉత్తర్వులిచ్చా రు.
దివ్యాంగులకిచ్చే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడటం, ఆపరేషన్లు చేయడానికి డబ్బు తీసుకోవడం, శస్త్రచికిత్సల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉండటం, సహ చర సిబ్బంది, వైద్య విద్యార్థులపై దురుసు ప్రవర్తనతో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర సీనియర్ల ఆదేశాలు ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు మంత్రి దృష్టికొచ్చాయి. ఈ వైఖరి ద్వారా అచ్యుతరావు వైద్యుల ప్రవర్తన, సర్వీసు నియమాలు ఉల్లంఘించినం దున మంత్రి చర్యలకు ఆదేశించారు. డాక్టర్ల అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణా రాహి త్యం వల్ల ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యం దెబ్బ తింటుందంటూ అటువంటి విషయాల్లో కఠిన చర్యలు ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.