తిరుపతి (చైతన్యరథం): ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్సీ) చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను ఏపీఈఆర్సీ చైర్మన్ గురువారం విడుదల చేశారు. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. మార్చి 31లోపు టారిఫ్‌లు విడుదల చేయాల్సి ఉన్నా.. ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నామన్నారు. మూడు డిస్కంల ద్వారా రాబడి అంచనా.. రూ.44,323 కోట్లు కాగా, వ్యయ అంచనా రూ. 57,544 కోట్లు అని చైర్మన్ తెలిపారు. రాబడి వ్యయాల మధ్య అంతరం రూ.12,632 కోట్లుగా ఉందని వెల్లడిరచారు. అంతరాన్ని భరించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.