- ప్రపంచానికి తెలుగువారి ప్రతిష్ట చాటిచెప్పావు
- సెంచరీ వీరుడికి మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి (చైతన్యరథం): తీవ్రమైన ఒత్తిడిలోనూ ఏకాగ్రత కోల్పోకుండా ధైర్యంగా, పట్టుదలతో ఆడి అద్భుతమైన సెంచరీ సాధించాడిని విశాఖ కుర్రాడు నితీష్ రెడ్డిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆస్ట్రేలియాపై నితీష్ సెంచరీ చేయడం చూసి ఆనందించా. తీవ్ర ఒత్తిడిలోనూ ఏకాగ్రతను కోల్పోకుండా తొలి శతకం పూర్తి చేసినందుకు అభినందనలు. నితీష్ ఆట చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలానే మున్ముందూ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సంవత్సరం గుర్తుండిపోయేలా చేసినందుకు, తెలుగువారి ప్రతిష్టను ప్రపంచ యవనికపై మారుమోగిస్తున్నందుకు ధన్యవాదాలు. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ స్వర్ణాంధ్ర దిశగా సాగిపోదాం.. అని నారా లోకేష్ పోస్ట్ చేశారు.