- పోలీసు అంక్షలను అధిగమించి జైలువద్దకు వేలాదిగా చేరుకున్న అభిమానులు
- ఉద్విగ్నభరిత వాతావరణంలో జైలునుంచి బయటకు వచ్చిన చంద్రబాబు
- జై బాబు నినాదాలతో హోరెత్తిన జైలు పరిసరాలు
- రోడ్డుమార్గాన ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబు
- న్యాయస్థానం ఉత్తర్వులకు లోబడి వాహనంలోనుంచే చంద్రబాబు అభివాదం
రాజ మహేంద్రవరం : ఉద్విగ్నభరిత, ఉత్సాహపూరిత వాతావరణం, పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానుల కోలాహలం మధ్య రాజ మహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్డుమార్గం ద్వారా ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు. ఈ క్షణం కోసం యావత్ తెలుగుదేశం శ్రేణులు, అభిమా నులు 52రోజులుగా ఎదురుచూశారు. చంద్రబాబుపై కేసు అక్రమం.. అరెస్టు అంతకుమించి అక్రమం.. అస లు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్‌కు పంపినా వెంటనే బెయిలు వస్తుందని తెలుగు ప్రజలు భావిం చారు. కింది కోర్టు కాదంటే పైకోర్టులోనైనా ఉపశమ నం లభిస్తుందని ఆశించారు. కానీ.. ఇవేవీ జరగలేదు. ఆయనను స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టుచేశారు.ఆ మరు సటి రోజున ఏసీబీ కోర్టు ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి ఆయన రాజ మహేంద్రవరం జైల్లోనే ఉన్నారు.చంద్రబాబు అరెస్టు… రిమాండ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయ న రెండు మూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అందరూ అనుకున్నారు కానీ.. 52రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు ఉండాల్సి వచ్చింది. మంగళవారం జైలు నుంచి చంద్రబాబు విడుదల అయ్యారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకొని వేలాది గా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.. చంద్ర బాబునాయుడును చూడగానే జై బాబు నినాదాలతో కేరింతలు కొట్టారు. 52రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబునాయుడుపై అభిమానం ఉప్పొంగి జై బాబు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు బయటకి రాగానే.. టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలకు అభివాదం చేస్తూ, తన ట్రేడ్ మార్క్ విక్టరీ సింబల్ చూపించారు. మనవడు దేవాన్ష్‌ను ముద్దాడి కాన్వాయ్ ఎక్కారు. బాబు రాకతో టీడీపీ శ్రేణులు, వీరాభిమా నులు, తెలుగు ప్రజల్లో ఎనలేని సంతోషం వచ్చింది.
రాజమండ్రి నుంచి బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంది. దారి పొడవునా వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి సంఫీుభావం తెలు పుతున్నా, చంద్రబాబు మాత్రం న్యాయస్థానం ఉత్తర్వు లకు లోబడి వ్యవహరించారు. వాహనంలో నుండే అభి వాదంతో పలకరిస్తూ జన సందోహం మధ్య ముందుకు సాగారు. కార్యకర్తలు కూడా సంయమనం పాటిస్తూ సహకరించాలని అదే వాహనంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. రాజమహేంద్రవ రం శివారు వేమగిరిలో వేలాదిగా అభిమానులు జాతీ యరహదారిపైకి చేరుకున్నారు. అడుగడుగునా పోలీసు ఆంక్షలను లెక్కచేయకుండా కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబునాయుడుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజల అపూర్వస్వాగతం పలికారు. జై బాబు..జై తెలు గుదేశం నినాదాలతో చంద్రబాబును స్వాగతించారు.
జొన్నాడ సెంటర్‌లో…
తూర్పుగోదావరిజిల్లా జొన్నాడ సెంటర్‌లో చంద్రబా బుకు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగే శ్వరరావు, జనసేన ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు స్వాగతంపలికేందుకు వేలా దిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. చంద్రబాబు జొన్నాడ సెంటర్‌కు రాగానే పూలవర్షం కురిపించి, బాణాసంచాతో హోరెత్తించారు.
రావులపాలెంలో..
చంద్రబాబును చూసేందుకు ఎక్కడికక్కడ వేలాదిగా ప్రజలు రోడ్లపైకి రావటంతో రాజమహేంద్రవరం నుం చి రావులపాలెంకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణా నికి 3గంటలకు పైగా సమయం పట్టింది. చంద్రబా బుకు దారిపొడవునా జనం నీరాజనాలు పలికారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం భారీగా రోడ్ల పైకి వచ్చారు.చంద్రబాబునాయుడు చూసేందుకు రావు లపాలెంలో రోడ్లకు ఇరువైపులా వేలసంఖ్యలో అభిమా నులు, ప్రజలు వేచిచూశారు. కోనసీమ నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో 5కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అమలాపురం, కొత్తపేట, ముమ్మడివరం, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి వేలసంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చా రు. గజమాలలు, బాణాసంచా మోతమోగిస్తూ కార్యక ర్తలు అభిమానాన్ని చాటుకున్నారు. రావులపాలెంలో అధినేతకు ఘనస్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నాయకులు గంటి హరీష్ మాధుర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంతకుమారి, బండారు సత్యానందరావు, అయి తాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, గొల్లపల్లి సూర్యారావు, మెట్ల రమణబాబు, డొక్కా నాధబాబు, బోళ్ల వెంకటరమణ తదితరులు ఉన్నారు.
సిద్ధాంతం సెంటర్‌లో..
రావులపాలెం మీదుగా సిద్ధాంతం సెంటర్‌కు చేరు కున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్‌కు ఆచంట,నర్సా పురం నియోజకవర్గాల కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టీడీపీి పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, నర్సాపురం ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఆచంట పరిశీలకులు బోళ్ల సతీష్ బాబు ఆద్వర్యంలో కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు.
పెరవలిలో..
సిద్ధాంతం సెంటర్ నుంచి చంద్రబాబునాయుడు కా న్వాయ్ పెరవలిచేరుకోగా మాజీఎమ్మెల్యే బూరుగు పల్లి శేషారావు, ఖండవల్లి వద్ద టీడీపీ సీనియర్ నాయకుడు కుందుల వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. చంద్రబాబును చూసేందుకు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు.
తణుకులో చంద్రబాబుకు ఘనస్వాగతం :
పశ్చిమగోదావరి జిల్లా తణుకుపట్టణం చేరిన టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్‌కి వేలాదిగా తరలివచ్చి న కార్యకర్తలు ఘనంగా స్వాగతంపలికారు. దారి పొడ వునా అభిమానుల తాకిడితో కాన్వాయ్ నెమ్మదిగా సాగి ంది. రాజమండ్రి నుంచి 40కిలో మీటర్ల దూరానికి 4 గంటలకు పైగా సమయం పట్టింది. తణుకులో ఇన్ చార్జి ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది.అభిమాననేతను చూసేందుకు తణుకు పరి సర గ్రామాల నుంచి ప్రజలుపెద్దఎత్తున తరలివచ్చారు.
జాతీయ రహదారి బారులు తీరిన జనం :
ఆలంపురం వద్ద తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజకవర్గాల కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. చంద్రబాబు కోసం జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్లవద్ద వేలాది ప్రజలు బారులు తీరారు. తణుకు నుంచి దువ్వమీదుగా అధినేత కాన్వాయ్ ఆలం పురం మీదుగా తాడేపల్లిగూడెం శివార్లకు చేరుకోగానే కార్యకర్తలు బాణాసంచా కాల్చికేరింతలు కొట్టారు. అధి నేత ప్రయాణిస్తున్న వాహనంపై పూలవాన కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.
ఉంగుటూరులో..
ఏలూరు జిల్లా ఉంగుటూరు చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్‌కి ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాం జనేయులు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. తాడే పల్లిగూడెం టీడీపీ ఇంఛార్జి వలవల బాబ్జీ,గోపాలపురం ఇంఛార్జి మద్దిపాటివెంకటరాజు,నెల్లిమర్ల ఇంఛార్జి కర్రో తు బంగార్రాజు తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలి కినవారిలో ఉన్నారు. జయహో చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో ప్రధాన రహదారి హోరెత్తిం ది.టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు, సామాన్య ప్రజ లుకూడా జాతీయ రహదారిపైకి వేలాదిగా తరలి వచ్చారు.
ఉంగుటూరు టోల్ గేట్ వద్ద ప్రకాశం జిల్లానేతల స్వాగతం :
కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ చంద్ర బాబు కాన్వాయ్ భీమడోలు చేరుకుంది. ఉంగుటూరు టోల్ గేట్ వద్ద చంద్రబాబునాయుడుకు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూ రు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనా ర్దన్, బీఎన్ విజయకుమార్ స్వాగతం పలికారు. భారీ వాహనశ్రేణితో వచ్చిన ప్రకాశంజిల్లా టీడీపీ నేతలు అధి నేతకు సంఫీుభావం తెలిపారు. భీమడోలు టోల్ గేట్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అనుసరిస్తున్న వాహనాలను అడ్డుకునేందు కు యత్నించారు.అయితే కార్యకర్తలు,నాయకులు బారి కేడ్లను తోసుకుంటూ అధినేతను అనుసరించారు.
చంద్రబాబుకు దెందులూరు ప్రజల బ్రహ్మరథం :
ఏలూరు శివార్లలోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలవద్ద చంద్రబాబునాయుడుకు దెందులూరు,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో కార్యకర్త లు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ప్రధాన రహదారిపై సెల్ ఫోన్ లైట్లతో చంద్రబాబునాయుడుకు ప్రజలు సంఫీుభావం తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని అభిమానులు పూలవర్షం తో ముంచెత్తారు. జై బాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో జాతీయ రహదారిపై హోరెత్తించారు.
కృష్ణాజిల్లాలో పోటెత్తిన జనం :
చంద్రబాబు కాన్వాయ్ కృష్ణాజిల్లాకు చేరుకోగా స్వాగతం పలికేందుకు జనం పోటెత్తారు. హనుమాన్ జంక్షన్ సమీపంలోని కలపర్రు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైకి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. చంద్రబాబును చూడనీయకపోతే కాన్వాయ్ ని కదలనీయబోమంటూ అడ్డుపడ్డారు. రాత్రి 11.30గంటల ప్రాంతంలోనూ మహిళలు, అభిమానులు జాతీయరహదారిపై చంద్రబాబు కోసం వేచిఉన్నారు. భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై గంటకు 20 కిలోమీటర్లు కూడా కాన్వాయ్ సాగని పరిస్థితి నెలకొంది. వేలాదిగా తరలివస్తున్న ప్రజలను అదుపుచేయలేక పోలీసులు ఆపసోపాలు పడుతున్నారు.