- నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి
- పెండిరగ్ సమస్యలకు పరిష్కారం రావాలి
- రైల్వేకు గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అనుసంధానం
- మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశం
- టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్షలో సూచనలు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండిరగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుని, ఆయా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఒక నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు రోడ్లు భవనాలు, పెట్టుబ డులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. సచి వాలయంలోని ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన జాతీయ రహదా రులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులతో 2వ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్ష జరిగింది. గతంలో డిసెంబర్‌లో నిర్వహించిన తొలి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలు, సాధించిన ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండిరగ్ సమస్యలను పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో జాతీయ రహదారులను పూర్తి చేయాలని ఆదే శించారు. గతంలో జాతీయ రహదారుల పనుల్లో భాగంగా సీనరేజీ ఛార్జీలు ముం దస్తుగా చెల్లింపులు చేయడం జరిగేదని, ప్రస్తుతం బిల్లు వచ్చిన తర్వాత చెల్లించే వెసు లుబాటు కాంట్రాక్టర్లు ఇవ్వడం జరిగిందని మంత్రికి తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించిన రోడ్ల మెటీరియల్ ఆయా రోడ్లపై వాడిన పక్షంలో దానిపై సీనరేజీ రాయల్టీకి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. అదే సమయంలో నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక క్వారీలను ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీ కరించదని అధికారులు తెలిపారు.
237 కి.మీ మేర భూసేకరణ పూర్తి
రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల సంబంధించి ఇప్పటివరకు మొత్తం 579 కి.మీ రోడ్ల భూసేకరణకు సంబంధించి 237 కి.మీ మేర భూసేకరణ పూర్తయిందని అధికారులు వివరించారు. మిగిలిన భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేసి, రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ఫారెస్ట్ క్లియరె న్స్ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల పెండిరగ్ సమస్యల పరిష్కారానికి సెక్రటరీ స్థాయిలో వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించుకుని, వచ్చే 3 నెలల్లో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అడిషనల్ సీసీఎల్ ఏ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఏపీసీసీఎఫ్ రాహుల్ పాండ్, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ వి.రామచంద్ర, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి సింగ్ పాల్గొన్నారు.
రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష
2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేయాలని రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇండస్ట్రీయల్ కారిడార్లకు సంబంధించి ఓర్వకల్లు, కృష్ణపట్నం పారిశ్రామిక పట్ట ణాలను రైల్వే లైన్లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల లో రైల్వే సబ్ వే నిర్మాణాన్ని ప్రారంభించాల్సిందిగా రైల్వే అధికారులను ఆదేశించారు.. అనంతరం నడికుడి ` శ్రీకాళహస్తి, కోటిపల్లి ` నర్సాపురం, అమరావతి ` ఎర్రుబాలెం నూతన రైల్వే మార్గాల భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో మంజూరైన అన్ని రైల్వే మార్గాలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంజూరు కాబడిన రైల్వే వంతెన పనులకు లెవల్ క్లోజర్ సర్టిఫికెట్‌లను వెంటనే జారీ చేసేలా కలెక్టర్లను ఆదేశించేలా నిర్ణయం తీసుకోవడం జరి గింది..
రైల్వే వంతెన పనుల్లో సమన్వయం కోసం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, విద్యుత్ శాఖ అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించాలని నిర్ణ యం తీసుకున్నారు.. కోరాపూట్ ` కొత్తవలస రైల్వేలైన్ అటవీ అనుమతుల మంజూరు కు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అమృత్ భారత్‌లో మంజూరైన అన్ని రైల్వే స్టేష్టన్‌లను ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి సంకల్పించారు. నిర్మాణంలో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబర్ లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, సౌత్ సెంట్రల్ రైల్వే సీఈ సూర్యనారాయణ, ఈస్ట్ కోస్ట్ రైల్వే సీఈ శ్రీనివాస్, రైల్వే సేప్టీ ప్రాజెక్ట్స్ సీఈ, మనోజ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ పోర్టుల రోడ్లు, రైల్వే అనుసంధానంపై సమీక్ష
మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు లు రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్లను జాతీయ రహదారులతో త్వరితగతిన అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశిం చారు. రాష్ట్రంలో మారిటైమ్ బోర్డుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న జాతీయ రహ దారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై మంత్రి ఆ శాఖ ఉన్నతాధి కారులతో చర్చించారు. రాష్ట్రంలోని పోర్టులతో నేషనల్ హైవేలు, రైల్వే లైన్లకు అను సంధానంలో కొన్ని చోట్ల తలెత్తిన పెండిరగ్ సమస్యలు పరిష్కరించడం ద్వారా సీ పోర్టు ల నిర్మాణం సకాలంలో పూర్తికావడానికి తోడ్పాటు అందించినట్లవుతుందని తెలిపారు. మారిటైమ్ బోర్డు అధికారులు లేవనెత్తిన సమస్యలను సాధ్యమైనంత వేగంగా పరిష్క రించి వాటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో నిర్మా ణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవులకు రైల్వే లైన్ల పనుల ను కూడా త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రీన్ ఫీల్డ్ పోర్టులకు సంబంధించి పోర్టు రైల్వే సైడిరగ్‌కు సంబంధించి రైల్వే అధికారులతో చర్చించారు. రామాయపట్నం పోర్టు రైల్వే సైడిరగ్‌కు సంబంధించిన పనులు వేగవంతం చేయవల్సిందిగా మంత్రి రైల్వే అధికారులను ఆదేశించారు.. మచిలీపట్నం, మూలపేట పోర్టులకు సంబంధించిన పోర్టు సైడిరగ్స్ యొక్క ఇంజనీరింగ్ స్కేల్డ్ ప్లాన్స్ అనుమ తులు త్వరితగతిని ఇవ్వాలని రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావే శంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఆర్.యువరాజ్, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, మారిటైం బోర్డు సీఈ జీవీ రాఘవరావు పాల్గొన్నారు.