- వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు
విశాఖపట్నం(చైతన్యరథం): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విశా ఖపట్నంలో విలువిద్య(ఆర్చరీ) పోటీలను గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారా ణి ప్రారంభించారు. ఏపీతో పాటు ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన యువత తమ సంప్రదాయ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇది ఒక గొప్ప వేదిక. వారి వేసిన చిత్రాలను చూసి అందరూ ప్రశంసిస్తారు. మన చంద్రన్న ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 27.39 లక్షల గిరిజనుల (ఎస్టీ) సమగ్ర సామా జిక-ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో మొత్తం 34 షెడ్యూల్డ్ తెగలు, వాటిలో 11 ప్రత్యేకంగా బాధపడే తెగలు (పీవీటీజీలు) ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తూ అండగా ఉన్నాయని తెలి పారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా, రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి గిరిజన కళా ప్రదర్శనలు, నృత్యోత్సవాలు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గిరిజన పండుగలు విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని వివిధ చోట్ల నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. పీఎం-జన్‌మన్, డీఏజేయూఏ కింద పక్కా ఇళ్లు నిర్మాణం, రోడ్లను కలిపే కార్యక్రమాలు, పైప్‌ద్వారా తాగునీటి సరఫరా, మొబైల్ మెడికల్ యూనిట్లు, హాస్టళ్ల నిర్మాణం నిర్వహణ, ఆంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం నిర్వహణ, బహుళ ప్రయోజన కేంద్రాల నిర్మాణం, విద్యుత్తు లేని ఇళ్లకు విద్యుదీకరణ మొబైల్ టవర్ల సంస్థాపన, 0.3 కిలోవాట్ల సోలార్ ఆఫ్-గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటు, వనధన వికాస కేంద్రాల స్థాపన కార్యక్రమాల గురించి తెలిపారు. విలు విద్య పోటీల్లో ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ ద్వీప సమూహం నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.