- పేదల ఇళ్లస్థలాల పేరుతో రూ.18 కోట్ల దోపిడీ
- రూ.700 కోట్ల విలువైన ఎన్‌ఎస్‌పి భూములపై కన్ను
- అడుగడుగునా భూదందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం
- బ్రోకర్లతో ఇసుక మాఫియా.. నెలకు రూ.6కోట్లు హాంఫట్
- గిరిప్రదక్షణ రోడ్డుచుట్టూ బొల్లా రియల్ ఎస్టేట్ మాఫియా
- రేషన్ బియ్యం నుంచి బార్లదాకా అన్నింటా బ్రహ్మనాయుడు బినామీలే!
అమరావతి : వేషధారణ, ఆహార్యం, హావాభావాలు చూసిన వారెవరైనా ఆహా ఎంత పెద్దమనిషి..అనవసరంగా ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయని అపార్థం చేసుకుంటారు. నిజజీవితంలో ఆయన రూటే సపరేటు. కల్లాకపటం తెలియని వినుకొండను మాఫియాలకు అడ్డాగా మార్చి కోట్లు కొల్లగొడుతున్న ఆ పెద్ద మనిషి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. పేదల ఇళ్లస్థలాల నుంచి వారుతినే చౌక బియ్యం వరకు, ఇసుక మాఫియా నుంచి భూదందాల వరకు అన్నింటా తానై వ్యవహరిస్తూ అవినీతి సామ్రాజ్యానికి అనకొండలా మారారు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదల భూములను లాగేస్తూ వందలకోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్న అక్రమార్కుడాయన. తన చేతికి మంటి అంటకుండా ఒక్కోవిభాగానికి ఒక్కో బ్రోకర్ ను ఏర్పాటుచేసుకొని వ్యవస్థీకృత అవినీతికి తెరలేపారు.
జగనన్న కాలనీల పేరుతో రూ.18 కోట్ల దోపిడీ
వినుకొండకు 10కిలోమీటర్ల దూరంలోని వెంకుపాలెం శివార్లలో ఆవాస యోగ్యంకాని 120 ఎకరాల పనికిరాని తన భూమిని ఎకరా 18లక్షల రూపాయలకు జగనన్న కాలనీ కోసం ప్రభుత్వానికి అంటగట్టి భారీఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. కేవలం 4లక్షల రూపాయల విలువచేసే ఆభూమిని 18లక్షల కు ప్రభుత్వానికి అప్పగించి 18 కోట్లరూపాయల ప్రభుత్వ సొమ్ము కొట్టేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టకుండా సొంత భూములకు రేటు పెంచుకు నేందుకు తన తెలివితేటలను చూపించి పేదల కోసమంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కూడా ఆదాయవనరుగా మార్చుకున్నారు.
700 కోట్ల ఎన్‌ఎస్ పి భూములపై కన్ను
ఎన్‌ఎస్ పి కాలనీకి చెందిన 22.18 ఎకరాల విలువైన స్థలాన్ని అడ్డదారుల్లో తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి విలువ సుమారు 700 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఉంది. పట్టణ నడిబొడ్డున 4.5ఎకరాల అత్యం త విలువైన భూమిని కొట్టేసేందుకు ఇండోర్ స్టేడి యం చుట్టూ ప్రహరీగోడ కూలదోశారు. డిగ్రీ కాలేజి భూమిని కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్నారు. తన తిరుమల హాస్పటల్ రోడ్డు కోసం ఆర్యవైశ్యులు పెనుగొండ శ్రీనివాసరావు, సుబ్బారావులకు చెందిన 11 సెంట్లలో ఉన్న పెట్రోలు బంకును కొట్టించేసి సుమారు 40లక్షల రూపాయలతో రోడ్డు వేయించు కున్నాడు.
అధికారం అండతో యథచ్చేగా రియల్ వ్యాపారం
వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయాన్ని అడ్డంపెట్టుకొనిచేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోనే వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో ప్రముఖ కాంట్రాక్టర్ విసి నరసింహారెడ్డి, తెనాలికి చెందిన వ్యాపారుల మధ్య సుమారు పది ఎకరాల భూ వివాదాన్ని బెదిరించి చౌకబారుగా కొట్టేసి ఒక్క సారిగా 40కోట్ల రూపాయల లబ్ధిపొందారు. ఆయన తన బినామీలతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో ఆక్రమించి, వెంచర్లు వేయిస్తూ వం దల కోట్లు గడిస్తున్నాడు. వెల్లటూరు రోడ్డులో 18 ఎకరాల పోరంబోకు భూమికిట్టాలు సృష్టించి అను చరుల పేర్లు రాయించుకున్నారు. ఈపూరు మండ లంలో 32ఎకరాల భూమిని ఎమ్మెల్యే దగ్గరుండి అన్యాక్రాంతం చేశారు. జల్లపాలెం వద్ద రైతులను భయపెట్టి తక్కువ రేటుకు 30 ఎకరాలు కొనుగోలు చేశారు. వినుకొండ పట్టణానికి ఆనుకుని ఉన్న 8 ఎకరాలు ప్రభుత్వ భూమిని రికార్డులు తారుమారు చేసి మింగేశారు.
బొల్లాపల్లి మండలంలో 132 ఎకరాలు ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్ల మీద రాయించుకున్నారు. వెల్లటూరు రోడ్‌లోని వినుకొం డ కొండ చుట్టూ ఉన్న వివాద భూములను తన అనుయాయులతో రౌడీయిజం చేసి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ వెంచర్లువేసి రియల్‌ఎస్టేట్ వ్యాపా రం చేస్తున్నారు.
రామలింగేశ్వరస్వామి ఘాట్ రోడ్డు నిర్మాణం అంటూ కొండచుట్టూ గిరి ప్రదక్షణ రోడ్డు ను పట్టణ పురపాలక సంఘం నిధులతో ఏర్పాటు చేసి తన భూములకు విలువ పెంచుకొని విల్లాస్, టవర్స్ నిర్మిస్తూ కోట్లకు పడగలెత్తాడు. గిరిప్రదక్షిణ రోడ్డు చుట్టూ భూములను చౌకగా లాగేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశాడు.
ఇసుక దందాతో రోజుకు రూ.6కోట్లు
గుండ్లకమ్మ నుంచి ప్రతిరోజు 200 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరు డైన ములకలూరు సర్పంచ్ బాబు, రామిరెడ్డి, దద్దాల వీరయ్య, డాన్ చౌదరి అనే వారి యథేచ్చగా అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం వినుకొండలో ట్రాక్టర్ ఇసుక 10వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజూ 20లక్షల రూపాయల చొప్పున నెలకు 6కోట్లరూపాయలు దోచుకుంటు న్నారు. గుండ్లకమ్మ నదితో పాటు దగ్గరలో ఉన్న వాగుల్లో ఇసుక అక్రమంగా తరలించి విక్రయిం చేందుకు తన ఇసుక మాఫియా టీంని ఏర్పాటు చేసుకొని యదేచ్చగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు ఇసుక దందా చేస్తున్నాడు.
మాఫియా సామ్రాజ్యాధినేత ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
పల్నాడులో ప్రశాంతతకు పెట్టింది పేరైన విను కొండను బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మాఫియాల రాజ్యంగా మార్చేశాడు. భూ మాఫియా, రేషన్ మాఫియా,మద్యం మాఫియా, ఇసుక మాఫియా లను నడుపుతూ కోట్లాదిరూపాయల అక్రమార్జనకు తెరలేపారు. రేషన్ బియ్యం : పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని మూడో కంటికి తెలియకుండా దారి మళ్ళించేందుకు కొప్పెర్ల దేవదాసును నియమించారు. ఇతనే సర్పంచ్ గా పనిచేస్తూ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతు న్నాడు. ఇక్కడి నుంచి తెలంగాణాకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. విను కొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఈపూరు, శావ ల్యాపురం, నూజెండ్ల, వినుకొండ మండలాల్లో అక్రమ రేషన్ మాఫియా నడిపేందుకు బొల్లా బ్రహ్మనాయుడు ఒక కోటరిని ఏర్పాటు చేసుకొని మూడేళ్లగా రేషన్ మాఫియా సాగిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు.
మద్యం మాఫియా : పొరుగున ఉన్న తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని దిగుమతి చేసు కుని అమ్మే బాధ్యతను వెంకట్రామిరెడ్డి అప్పగించారు. నెలకు రూ.20 లక్షలకు పైగా ప్రత్యేక సూట్ కేసులో బ్రహ్మనాయుడు ఇంటికి తరలిస్తుంటారు. నియోజక వర్గంలోని బార్లన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఉంటాయి. రాత్రయ్యేసరికి లెక్కలు చూసి వాటా ఎమ్మెల్యే ఇంటికి పంపడంలో లేటయితే ఎట్టి పరిస్థితిలోను సహించరు. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన బార్ల టెండర్లలో కూడా బెదిరింపులకు పాల్పడి తన అనుచరులకే టెం డర్ దక్కేలా చక్రం తిప్పాడు రియల్టర్ బ్రహ్మనాయు డు. ప్రభుత్వ మద్యం షాపుల్లో తన బినామీ వర్గీయు లను చేర్చి మండలానికి 20 బెల్ట్ షాపులు పెట్టించి మద్యం మాఫియాతో కోట్లు గడిస్తున్నారు.
ఇసుక మాఫియా: గుండ్లకమ్మ నుండి, ములక లూరు, పిట్టంబండ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నిర్వహించే బాధ్యత స్థానిక వైసీపీ నేతలకు అప్పగించి 50పైసలు వాళ్లకు, మరో 50పైసలు ఎమ్మెల్యే ఇంటికి పంపించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ 200 ట్రాక్ట ర్లకుపైగా ఇసుకను అనధికారికంగా విక్రయిస్తూ నెల కు ఆరుకోట్ల రూపాయలు గడిస్తున్నారు.
భూ మాఫియా: వినుకొండలో వెల్లటూరు రోడ్డులో 4 ఎకరాల వివాదాస్పదమైన భూమిని స్వాధీనం చేసు కుని అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులు తారుమారు చేశారు. ఈ భూమి ధర పెంచడానికి ప్రభుత్వ ధనం తో ఆగమేఘాల మీద రహదారులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అపార్ట్‌మెంటు కట్టేందుకు పనులు కూడా మొదలుపెట్టారు. ఎవరైనా రైతుల భూములకు పాస్‌బుక్ ఇవ్వాలన్నా, ఆన్‌ల్కెన్‌లో పొందుపరచాలన్నా బొల్లా బినామీలు ప్రత్యేకమైన రేటు నిర్ణయించారు. బొల్లాపల్లి మండలంలో 10వేల ఎకరాల్లో పాస్‌బుక్‌లు ఇప్పించి ఒక్కో రైతుల నుంచి ఎకరాకు రూ.10 వేలు వసూలు చేశారు. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేయించడం,ప్రభుత్వ భూములకు పాస్‌బుక్‌లు ఇప్పిం చడం, ఆ భూములను బ్యాంకులో పెట్టి రుణాలు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దారిమళ్లించడం బొల్లా బ్రహ్మనాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. మండలాని కో మాఫియా ముఠాలను ఏర్పాటు చేసుకుని రైతుల భూముల్లో వాలిపోతున్నారు. తక్కువ ధరకు అమ్మా లంటూ బెదిరింపులకు దిగుతున్నారు, లేదంటే అధి కార బలాన్ని ప్రయోగిస్తున్నారు. బొల్లాపల్లిలో రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టిం చి అత్యంత విలువైన భూమిని తనతోపాటు, అనుచ రుల పేరుమీద మ్యుటేషన్ చేయించుకున్నారు.