చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

1000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న యువగళం

by చైతన్యరధం
Apr 21, 2023 at 7:18pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh

nara lokesh Yuva Galam pada yatra reaches 1000 km milestone

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్ర్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్మాత్మక యువగళం పాదయాత్ర 5కోట్లమంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. జనవరి 27వతేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించిన యువనేత ఉక్కుసంకల్పంతో అవిశ్రాంతంగా లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు. 77రోజులపాటు 27 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్షలాది ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువనేత సఫలీకృతమయ్యారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి అనంతపురంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగిన యువగళం పాదయాత్ర 77వరోజు ఆధోనిలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఇంతింతై వటుడింతై అన్నచందంగా రోజురోజుకు యువనేత లోకేష్ పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేష్… వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాలని తొలుత నిర్ణయించగా, లక్ష్యానికి మించి ఇప్పటివరకు పాదయాత్ర చేసిన 77రోజుల్లో సగటున రోజుకు 13కిలోమీటర్లు నడక సాగించారు.

సంబంధితవార్తలు

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – అనంతపురం నియోజకవర్గం

మండుటెండలను సైతం లెక్కచేయకుండా అడగడుగునా వేలాది ప్రజలు యువనేతను కలిసి సమస్యలు చెబుతుండగా, మరికొందరు వినతిపత్రాల రూపంలో సమస్యలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటివరకు 1,300 వినతిపత్రాలు యువనేత కు అందాయి. యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, ఐటి ప్రొఫెషనల్స్, కార్మికులు, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధుల తో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటుచేస్తూ అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు తాము ఏం చేస్తామన్నది స్పష్టంగా తెలియజేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖాముఖి సమావేశంలో వివిధ వర్గాల ప్రజలు అడిగే ప్రజలకు నిర్మొహమాటంగా సమాధానాలిస్తున్నారు.

యువగళం గొంతునొక్కేందుకు విఫలయత్నాలు

యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లనియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25పోలీసు కేసులు నమోదయ్యాయి. సగటున రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయించారంటే యువగళం గొంతునొక్కేందుకు ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో యువనేత లోకేష్ పై 3కేసులు నమోదు చేశారు.

ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. చివరకు వైసిపి పెద్దలు ఏస్థాయికి దిగజారారంటే పీలేరులో బాణాసంచా కాల్చారని కూడా అక్కడి ఇన్ చార్జి నల్లారికిషోర్ కుమార్ రెడ్డి, మరికొందరిపై పోలీసులు 3కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు ఇది పరాకాష్ట. యువనేత లోకేష్ తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కుప్పం పీఎస్ మనోహర్, పలమనేరు ఇన్ చార్జి అమర్ నాథ్ రెడ్డి, చంద్రగిరి ఇన్ చార్జి పులివర్తి నాని, పీలేరు ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో సహా పలువురు టిడిపి నేతలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేశారు.

యువగళం దెబ్బకు మైండ్ బ్లాంక్

యువగళం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యాత్ర పూర్తయ్యే సమయంలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించడంతో పాటు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో అధికారపార్టీ పెద్దల మైండ్ బ్లాంక్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 109 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వైసిపి కోట్లాది రూపాయలు వెదజల్లినా విజ్ఞులైన యువఓటర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగుతున్న యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో, ఈ విషయాన్ని పసిగట్టిన అధికారపార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి యువగళం యాత్రపై తప్పుడు కేసులకు స్వస్తిపలికింది. అయితే అక్కడక్కడా వైసిపి నేతలు రెచ్చగొడుతున్నా ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా యువగళం లక్ష్యం దిశగా ముందుకు సాగిపోతోంది.

పదునైన ప్రసంగాలు, స్థానిక ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను ప్రజల్లో ఎండగట్టడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు:

యువనేత లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట బహిరంగసభ నిర్వహిస్తూ వాడి,వేడి వాగ్భాణాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తుండటంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. చిత్తూరు జిల్లా పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతూ పాపాల పెద్దిరెడ్డీ… అంటూ సింహగర్జన చేశారు. చిత్తూరు జిల్లాకు ఎవరేంచేశారో చర్చకు రావాలంటూ యువనేత విసిరిన సవాల్ కు ఉక్కిరిబిక్కిరైన మిథున్ రెడ్డి… చివరకు ఎన్నికల కోడ్ నెపంతో లోకేష్ ను జిల్లానుంచి పంపించేశారంటే ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

సెల్ఫీ ఛాలెంజ్ తో ఉక్కిరిబిక్కిరి:

యువనేత నారా లోకేష్ తమ హయాంలో తెచ్చిన పరిశ్రమల వద్ద సెల్ఫీలు దిగుతూ విసురుతున్న సవాళ్లకు అధికారపార్టీనేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కియా, డిక్సన్, టిసిఎల్, జోహా కంపెనీల వద్ద సెల్ఫీలు దిగి నా హయాంలో తెచ్చిన పరిశ్రమలు ఇవి, మీరు ఏం తెచ్చారో చెప్పాలంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. ఇది ప్రజలను ముఖ్యంగా యువతీయువకులను ఆకట్టుకుంటోంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ మూసివేసిన అన్నాక్యాంటీన్లు, దిశ పోలీస్ స్టేషన్, ఫిష్ ఆంధ్రా పాయింట్ల వద్ద సెల్ఫీ దిగుతూ పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో పాటు అధికారపార్టీ పెద్దల అవినీతిని ఎండగడుతూ చేస్తున్న సెల్ఫీ ఛాలెంజ్ లు ప్రకంపనలు సృష్టిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, సత్యవేడు, పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలను పెద్దిరెడ్డి కుటుంబం తమ అక్రమాలకు అడ్డాగా మార్చుకుంది. పిఎల్ఆర్ కంపెనీకి చెందిన టిప్పర్లలో గ్రావెల్, ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న తీరును లోకేష్ సెల్ఫీద్వారా ప్రజల కళ్లకట్టారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం చెరువు, ఎర్రగుట్టలను ఆక్రమించి నిర్మించిన ఫామ్ హౌస్ ను వీడియో ఆధారాలతో సహా బయటపెట్టారు. నియోజకవర్గం నుంచి పొరుగురాష్ట్రాలకు తరలిస్తున్న ఇసుక లారీల వద్ద సెల్ఫీ దిగి అవినీతిని ఎండగట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలను కూడా బట్టబయలు చేశారు. కర్నూలుజిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. బెంజిమంత్రి భూ కబ్జా బాగోతాలు, కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారాన్ని బయటపెట్టారు. ప్రభుత్వ ధర ప్రకారం 180ఎకరాల ఇటీనా భూములను కొనుగోలు చేసి రైతులకు అందిస్తామని బెంజి మంత్రిని ఇరకాటంలో పెట్టారు.

సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి అనూహ్య స్పందన:

ప్రతిరోజూ ఉదయం అభిమానులతో యువనేత నిర్వహిస్తున్న సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ప్రతిరోజు సగటున 1000 నుంచి 1500 మంది కార్యకర్తలు, అభిమానులు యువనేత తో ఫోటోలు దిగుతున్నారు. అభిమానులు ఫోటోలు దిగిన తర్వాత ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా నేరుగా వారి వాట్సాప్ కు ఫోటో చేరుతోంది. తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటోల పట్ల అభిమానులు, కార్యకర్తలు అమితానందం పొందుతున్నారు.

ప్రతి 100 కిలోమీటర్లకు ఓ వరం

యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వందకిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ… తాము అధికారంలోకి వచ్చిన ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటిస్తున్నారు.

• యువనేత పాదయాత్ర 8వరోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో 100కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.ఈ సందర్భంగా బంగారుపాళ్యంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శిలఫలకాన్ని ఆవిష్కరించారు.

• 16వరోజు జిడినెల్లూరు నియోజకవర్గం కత్తెరపల్లిలో 200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో జిడి నెల్లూరులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

• 23వరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద యాత్ర 300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అక్కడ 13 గ్రామాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో చేపడతామని ప్రకటించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

• యువ‌గ‌ళం పాదయాత్ర 31వరోజు 400 కి.మీ చేరుకున్నసంద‌ర్భంగా పాకాల మండ‌లం నేండ్రగుంట మ‌జిలీలో ఆధునిక వ‌స‌తుల‌తో 10 ప‌డ‌క‌ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫ‌ల‌కం వేశారు.

• 39వరోజు మదనపల్లి శివారు చినతిప్పసముద్రంలో పాదయాత్ర 500వరోజుకు చేరుకున్న సందర్భంగా మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

• 47వరోజు కదిరి నియోజకవర్గం చిన్నయ్యగారిపల్లి వద్ద పాదయాత్ర 600 కి.మీ. చేరుకున్న సందర్భంగా ఆ ప్రాంతంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

• 55వరోజు పెనుగొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా గోరంట్ల, మడకశిర ప్రాంతాల తాగు,సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి హంద్రీనీవా కాల్వ నుంచి ఎత్తపోతల పథకం నిర్మిస్తామని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

• యువగళం పాదయాత్ర 63వరోజు 800 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ కు యువనేత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

• యువగళం పాదయాత్ర 70వరోజు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో ఈరోజు 900 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆలూరు, ప‌త్తికొండ‌, డోన్, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల ప్రజ‌ల‌కు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు.

• యువగళం పాదయాత్ర 77వరోజు ఆదోనిలోని సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించిన యువనేత అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇదే స్పూర్తిని కొనసాగించాలి!

యువగళం సైనికులకు లోకేష్ అభినందనలు

1000 కి.మీ. చేరుకున్న సందర్భంగా యువనేత పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను యువనేత నారా లోకేష్ అభినందించారు. అధికారపార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనవరి 27న పాదయాత్ర ప్రారంభం నుంచి వివిధ కమిటీలు క్రమశిక్షణతో యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా తాను చేస్తున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్రలో సేవలందిస్తున్న వివిధ కమిటీలు, వాలంటీర్లను యువనేత లోకేష్ పేరుపేరునా అభినందిస్తూ… లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో 13కమిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు.రాజేష్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం యువనేతను వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 100మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ యువనేతను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

1. యువగళం పాదయాత్ర మెయిన్ కోఆర్డినేటర్ – కిలారు రాజేష్.

2. యువగళం అధికార ప్రతినిధులు – ఎం ఎస్ రాజు, దీపక్ రెడ్డి.

3. మీడియా కమిటీ – మెయిన్ కోఆర్డినేటర్ బి.వి. వెంకట రాముడు, సభ్యుడు జస్వంత్.

4. భోజన వసతుల కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్, సభ్యుడు లక్ష్మీపతి.

5. వాలంటీర్ కోఆర్డినేషన్ కమిటీ – రవి నాయుడు, ప్రణవ్ గోపాల్.

6. రూట్ కోఆర్డినేషన్ కమిటీ – రవి యాదవ్.

7. అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.

8. వసతి ఏర్పాట్ల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలా, శ్రీధర్, ఐనంపూడి.రమేష్.

9. యువగళం పిఆర్ టీమ్ – కృష్ణా రావు, మునీంద్ర, కిషోర్.

10. యువగళం సోషల్ మీడియా కోఆర్డినేషన్ – కౌశిక్, అర్జున్.

11. అలంకరణ కమిటీ – మలిశెట్టి వెంకటేశ్వర్లు, బ్రహ్మం.

12. రూట్ వెరిఫికేషన్ కమిటీ – అమర్నాథ్ రెడ్డి, కస్తూరి కోటేశ్వరరావు.

13. తాగునీటి సదుపాయం – భాస్కర్, వెంకట్

విరామం లేని యువగళం

యువగళం పాదయాత్ర విరామం లేకుండా ముందుకు సాగుతోంది. 77రోజుల ప్రయాణంలో యువనేత కేవలం మూడు సార్లు తప్పని పరిస్థితుల్లో మాత్రమే సెలవులు తీసుకోవాల్సి వచ్చింది. 1. తారకరత్న మరణం 2.ఎన్నికల కోడ్ 3.ఉగాది సందర్భంలో మాత్రమే లోకేష్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. దీనిపై ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. గతంలో వీక్లీ ఆఫ్ పాదయాత్రను చూసిన ప్రజలు నేడు విరామం లేని పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా వాటిని సైతం లెక్కచేయకుండా కష్టాల్లో ఉన్న ప్రజల చెంతకు చేరేందుకు యువనేత వెనకడుగు వేయడం లేదు. శని, ఆదివారాల్లో కూడా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

యువ‌గ‌ళం లోకేష్‌..త‌గ్గని జోష్‌

– పాద‌యాత్రలో నారా లోకేష్ ఉరిమే ఉత్సాహం

– డైట్, వ్యాయామం, టైమింగ్‌, నిద్ర ప్లానింగ్ తో చ‌క్కని ఫిట్నెస్‌

– యువ‌నేత‌తో పోటీప‌డి న‌డ‌వ‌లేక‌పోతున్న టిడిపి నేత‌లు

యువ‌గ‌ళం పాద‌యాత్ర 77రోజులు, వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. అయినా లోకేష్ లో ఎక్కడా జోష్ తగ్గలేదు. ఉరిమే ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. లోకేష్‌ని అందుకోలేక యువ‌కులు సైతం ప‌రుగులు పెట్టాల్సి వ‌స్తోంది. పాద‌యాత్రలో పాల్గొనాలంటే ముందుగా ఓ ఐదు రోజులుగా ప‌రుగు అల‌వాటు చేసుకోవాలి అంటూ టిడిపి గ్రూపుల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ యువ‌గ‌ళం షెడ్యూల్ చూస్తే ఊపిరి స‌ల‌ప‌ని విధంగా రూపొందించారు. ఉద‌యం క్యాంప్ సైట్ వ‌ద్ద సెల్ఫీ విత్ లోకేష్‌, త‌రువాత వివిధ సామాజిక‌వ‌ర్గాలు, సంఘాల‌తో స‌మావేశాలు, పాద‌యాత్రలో ముఖాముఖీలు, బ‌హిరంగ‌స‌భ‌లు, నాయ‌కుల‌తో సమీక్షలు.. పోలీసుల అడ్డంకులు-వైసీపీ కవ్వింపులను ఎదురొడ్డి మ‌రీ పూర్తి చేస్తున్నారు. షెడ్యూల్‌లో ఏ ఒక్కటీ మిస్ కాకుండా ఓపిక‌, స‌హ‌నం, శ‌క్తితో నారా లోకేష్ పూర్తి చేస్తున్న తీరుతో పార్టీ నేత‌లే ఆశ్చర్యపోతున్నారు. లోకేష్ కష్టం దగ్గరుండి చూసిన వాళ్లు కన్నీళ్లు పెడుతున్నారు. ప‌ట్టుద‌ల‌, క్రమశిక్షణ, ఫిట్నెస్ వంటి విష‌యాల‌లో తండ్రి చంద్రబాబును త‌న‌యుడు లోకేష్ మించిపోయాడు. 77రోజుల్లో గ‌రిష్టంగా రోజుకి 20 కిలోమీట‌ర్లు న‌డిచిన రోజులున్నాయి.నారా లోకేష్ తీసుకునే ఆహారం, వ్యాయామం, నిద్ర స‌మ‌యంపై తెలుగుదేశం నేత‌లు ఆచరించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

యువనేత నారా లోకేష్ దినచర్య-ఆహారపు అలవాట్లు:

ఉద‌యం:-

6:00: క్యాంప్ సైటులో నిద్రలేస్తారు.

6:30: ఫ్రెష్ అయి బ్లాక్ కాఫీ తాగుతారు

7:00: పేప‌ర్లు చదివి, పీఆర్ టీమ్ బ్రీఫింగ్ తీసుకుంటారు.

7:30: అరగంట సేపు వ్యాయామం.

8:15: స్నానం చేసి రెడీ అవుతారు.

8:15-8:30: అల్పాహారం తీసుకుంటారు.

8:30 -9:30: సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం.

9:30: పాద‌యాత్ర ప్రారంభం అయ్యాక లీట‌ర్ వ‌ర‌కూ నీరు తీసుకుంటారు.

మ‌ధ్యాహ్నం:

12.00 గంట‌లకు కొబ్బరినీళ్లు త్రాగుతారు.

1:00- 1:30 మ‌ధ్యాహ్న భోజ‌నం (క్వినోవా విత్ వెజిట‌బుల్స్‌), అల్లం టీ

1:30-2:00 నాయ‌కుల‌తో భేటీ.

3:00: పాద‌యాత్ర ప్రారంభం

4:00: లీట‌ర్ మంచినీరు తీసుకుంటారు.

5.00: కొబ్బరినీళ్లు త్రాగుతారు.

7:00: పాదయాత్ర ముగించుకుని విడిది కేంద్రానికి చేరుకుంటారు.

7:00-7:30: నాయ‌కుల‌తో స‌మీక్ష

8:00-8:15: రాత్రి భోజ‌నం (లైట్‌)

Tags: lokesh pada yatralokesh padayatralokesh padayatra 1000 kmNara lokeshnara lokesh 1000kmsnara lokesh completes 1000kmsnara lokesh latest newsnara lokesh padayatranara lokesh padayatra updatesnara lokesh padayatra yuvagalamnara lokesh yuva galamnara lokesh yuva galam padayatraNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatraTDPTDP Padayatrayuvagalam 1000 km
Previous Post

LIVE : యర్రగొండపాలెం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో

Next Post

కష్టం మాది… రంగులు మీవా? సగంచెరువు బ్రిడ్జి పై నిమ్మల రామానాయుడు ఫైర్‌

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

విసిరికొట్టినా.. అదే వంచన!

చైతన్యరధం
@ May 25, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి
ఆంధ్రప్రదేశ్

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు
ఆంధ్రప్రదేశ్

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!
ఆంధ్రప్రదేశ్

చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చైతన్యరధం
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

పొగాకు పంట చివరి ఆకు వరకూ కొంటాం

చైతన్యరధం
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

చైతన్యరధం
@ May 25, 2025
కోకో రైతులను ఆదుకుంటాం
ఆంధ్రప్రదేశ్

కోకో రైతులను ఆదుకుంటాం

చైతన్యరధం
@ May 24, 2025
ఆంధ్రప్రదేశ్

లక్ష్యం మేరకు ప్రాజెక్టుల పనులు పూర్తి

చైతన్యరధం
@ May 24, 2025
Load More

ముఖ్య వార్తలు

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

చైతన్యరధం
@ May 22, 2025
ప్రపంచానికి వరం మన యోగా

ప్రపంచానికి వరం మన యోగా

చైతన్యరధం
@ May 22, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విసిరికొట్టినా.. అదే వంచన!

చైతన్యరధం
@ May 25, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చైతన్యరధం
@ May 25, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist