` కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై మంత్రి లోకేష్ హర్షం
` ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏపీకి వస్తోందన్నారు. రూ. 4,600 కోట్ల బడ్జెట్ కేటాయింపులో భాగంగా రాష్ట్రానికి సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (AూIూ) దక్షిణ కొరియాకు చెందిన AూAజుకో. లిమిటెడ్‌తో 96 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిపారు. సెమీకండక్టర్లను మొబైల్ ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్‌లో ఉపయోగిస్తారని.. తద్వారా ఆత్మనిర్భర భారత్‌కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని లోకేష్ పేర్కొన్నారు.