టిడిపి అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జాబ్ నోటిఫికేషన్
యువత పేదరికంలో వుండాలన్నదే క్విడ్ ప్రోకో జగన్ కోరిక
మైనారిటీలను మోసం చేసిన పాపం ఊరికే వదలదని జగన్ కు హెచ్చరిక
దళితుల సంక్షేమ పధకాలు అన్నీ తిరిగి ప్రారంభిస్తాం
జగన్ బెదిరిస్తే భయపడే బచ్చాలు ఎవరూ లేరు
నంద్యాల బహిరంగ సభలో నారా లోకేష్ ధ్వజం
…….
రాష్ట్రం నుండి కంపెనీలు తరలిపోతున్నాయి. జగన్ పాలనలో కంపెనీలు అన్ని బై బై ఏపీ అంటున్నాయి. లక్ష ఉద్యోగాలు కల్పించే ఫ్యాక్స్ కాన్ కంపెనీ తెలంగాణకి తరలిపోయింది. ఆ కంపెనీని ఏపీకి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అలాంటి కంపెనీలను తరిమేసి యువతకు ఉద్యోగాలు లేకుండా చేసాడు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు, నంద్యాల జిల్లాలకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం రాత్రి నంద్యాలలో జరిగిన భారీ బహిరంగసభలో లోకేష్ ప్రసంగించారు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడని లోకేష్ విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. క్విడ్ ప్రో కో జగన్, జగన్ కట్టింగ్ మాస్టర్ అని విమర్శించారు. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ క్విడ్ ప్రో కో జగన్ అని వివరించారు.
క్విడ్ ప్రో కో జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడన్నారు. క్విడ్ ప్రో కో జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు అని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు అని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం అని లోకేష్ చెప్పారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో క్విడ్ ప్రో కో జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. క్విడ్ ప్రోకో జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు.
జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమలో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు, మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు అని లోకేష్ హెచ్చరించారు. క్విడ్ ప్రోకో జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని లోకేష్ ధ్వజమెత్తారు.
మైనారిటీలను మోసం చేశారు
మైనారిటీలను మోసం చేసిన పాపం క్విడ్ ప్రోకో జగన్ ఊరికే వదలదు అని లోకేష్ హెచ్చరించారు. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. నంద్యాల లో మైనార్టీల పై జరుగుతున్న దాడులు, వేధింపు ల గురించి తెలుసుకున్న తరువాత నాకు కన్నీరు ఆగలేదు. ఊసరవెల్లి జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకూ దోషులకు శిక్షపడలేదు. నంద్యాలలో ఆర్టీఓ అధికారుల వేధింపులు తట్టుకోలేక కరిముల్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.ముగ్గురు పిల్లలతో కరిముల్లా భార్య పడుతున్న బాధలు జగన్ కి కనపడవు. ఇప్పటి వరకూ దోషులకు శిక్ష పడలేదు.
నంద్యాల మున్సిపల్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సమస్యల గురించి మాట్లాడిన ముస్లిం కౌన్సిలర్లను ఎమ్మెల్యే భార్య గొర్రెల్లా అరవొద్దు అంటూ అవమానించారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలులో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీకి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు. ఈ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి అని పోరాటం చేసింది టీడీపీ అని వివరించారు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు.
జగన్ దళిత ద్రోహి
క్విడ్ ప్రో కో జగన్ దళిత ద్రోహి అని లోకేష్ ధ్వజమెత్తారు. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను
చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసాడు జగన్. టిడిపి గెలిచిన వెంటనే దళితుల 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం అనిలోకేష్ హామీ ఇచ్చారు.
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు క్విడ్ ప్రో కో జగన్ అని లోకేష్ విమర్శించారు. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం అని లోకేష్ వివరించారు. రెడ్డి సోదరులు కూడా ఆలోచించండి. మీరు కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. మీకు ఇప్పుడు వైసిపి లో కనీస గౌరవం దక్కుతుందా అని లోకేష్ ప్రశ్నించారు. ఒక్క టిడిపి లోనే అందరికి గౌరవం దక్కుతుందన్నారు.
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ
క్విడ్ ప్రోకో జగన్ నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ అని లోకేష్ ధ్వజమెత్తారు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. రాయలసీమ ఎత్తిపోతల పధకం ఎత్తిపోయింది. ఎన్జిటిలో స్టే ఉంటే కనీసం లాయర్ ని పెట్టే దిక్కులేదు. బాబాయ్ హత్య కేసు నిందితులను కాపాడటానికి పెద్ద లాయర్లను పెట్టాడు. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నందీశ్వరుడు తప్పస్సు చేసిన నేల నంద్యాల.
నవనందులు కొలువైన పుణ్య భూమి నంద్యాల. ఇక్కడికి సమీపంలోనే మహనంది క్షేత్రం ఉంది. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అందరికి అన్నం పెట్టిన దానకర్ణుడు బుడ్డా. వెంగళరెడ్డి తెలుగువారికి ప్రధాని పదవి దక్కుతుందని నాడు పివి. నరసింహారావు నంద్యాల నుండి పోటీ చేసినప్పుడు అభ్యర్థిని పెట్టకుండా భారీ మెజారిటీతో గెలవడానికి సహకరించింది టిడిపి అని లోకేష్ పేర్కొన్నారు. శోభానాగి రెడ్డిని నంద్యాల అభివృద్ధిలో చూసుకోవాలి అని కలకన్నారు భూమా నాగిరెడ్డి. భూమా నాగిరెడ్డి 10 వేల ఇళ్లు, రోడ్డు విస్తరణ చేస్తానని చెబితే అందరూ నవ్వారు. చనిపోయే ముందు చంద్రబాబుని కలిసి నంద్యాల అభివృద్ధి గురించి అడిగారు.
భూమా నాగిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం నంద్యాలని అభివృద్ధి చేసారు చంద్రబాబు అని లోకేష్ వివరించారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నంద్యాలలో పాదయాత్ర చెయ్యడం తన అదృష్టమన్నారు. ఒక్క అడుగు. ఒక్క అడుగుతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్క అడుగుతో నా ప్రయాణం మొదలైంది. యువగళం మహా ఉద్యమం గా మారింది. 100 రోజులు పూర్తయిన సందర్భంగా 10 లక్షల మంది యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయ్యారు అని వివరించారు. జగన్ బెదిరిస్తే భయపడే బచ్చాలు ఎవరూ లేరు. థిస్ ఈజ్ యూత్ పవర్. అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దండయాత్రే. జగన్ మాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావ్ జాగ్రత్త అని హెచ్చరించారు.
జగన్ ఈ మధ్య జబర్దస్త్ కామిడీ చేస్తున్నాడు. జగన్ పేదవాడు అంట, జగన్ ఒంటరి వాడు అంట. లక్ష కోట్ల ప్రజా ధనం కొట్టేసినవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే జగన్ పేదవాడా? వెయ్యి రూపాయల నీళ్ల బాటిల్ తాగే వాడు పేదవాడా? బెంగుళూరు యలహంక లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లిలో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, విశాఖ లో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా? అని ప్రశ్నించారు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత పేపర్, ఛానల్ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? జగన్ దేశంలోనే ధనిక సీఎం, రాష్ట్రం మాత్రం అప్పుల్లో నంబర్1. ఒంటరి అన్న మాట నిజమే ఎందుకో తెలుసా? జగన్ క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకున్న తల్లి, చెల్లి దూరం అయ్యారు. అందుకే జగన్ ఒంటరి అయ్యాడు అని చెప్పారు.
జగన్ .. జంగిల్ రాజ్
చంద్రబాబుది రామ రాజ్యం. జగన్ ది జంగిల్ రాజ్ అని లోకేష్ విమర్శించారు. చంద్రబాబువి అంబేద్కర్ చట్టాలు. జగన్ వి బ్రిటిష్ చట్టాలు. బ్రిటిషు చట్టం వాడి నన్ను అడ్డుకోవడానికి ఏ1, జిఓ.1 తీసుకొచ్చాడు. నేను ఆనాడే చెప్పా ఏ1 నువ్వు తెచ్చిన జిఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని. జిఓ.1 ని కోర్టు చించి చెత్త బుట్టలో వేసింది. జిఓ.1 పోవడంతో ఏ1 కి పిచ్చెక్కింది. మళ్లీ బ్రిటిషు చట్టాలను పట్టుకొని బయలుదేరాడు అని విమర్శించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి జరిగింది అంటూ కన్నింగ్ ఐడియాతో ముందుకు వచ్చాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులే మొదలు కాలేదు.
క్విడ్ ప్రో కో ఎక్కడుంది జగన్?
సిఐడి కాస్తా జేకేడిగా మారిపోయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాస్తా జగన్ కక్ష సాధింపు డిపార్ట్మెంట్ గా మారింది అని ఆరోపించారు. నాలుగేళ్ళలో మా బాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా జగన్ పీకలేకపోయాడు. నా పాదయాత్రలో నాలుగు స్టూళ్లు లాక్కున్నారు. ఇప్పుడు క్విడ్ ప్రో కో అంటూ మేము అద్దెకు ఉంటున్న ఇంటిని జప్తు చేసే దుస్థితికి దిగజారిపోయాడు. క్విడ్ ప్రో కో, సూట్ కేసు కంపెనీలు, హవాలా కి పుట్టినిల్లు జగన్. సీబీఐ,ఈడీ,ఫెమా దేశంలో ఉన్న అన్ని దర్యాప్తు సంస్థలు వెతుకుతున్న దొంగవి నువ్వు జగన్. 31 కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ క్విడ్ ప్రోకో గురించి మాట్లాడటం కామిడీ గా ఉంది. జగన్ ఏ పని చేసినా అందులో క్విడ్ ప్రోకో ఉంటుంది అందుకే ఆయనకు క్విడ్ ప్రో కో అని పేరు పెట్టాను అని లోకేష్ పేర్కొన్నారు.
బాబాయ్ మర్డర్ కేసులో కూడా క్విడ్ ప్రో కో ఉంది అని లోకేష్ ఆరోపించారు. చేతికి మట్టి అంటకుండా బాబాయ్ ని లేపేస్తే అవినాష్ ని ఎంపీ చెయ్యొచ్చు అని ప్లాన్ చేసాడు క్విడ్ ప్రో కో జగన్. బాబాయ్ ని ఒప్పించి తప్పిస్తే అవినాష్ ఎంపీ అవుతాడు. బాబాయ్ ని లేపేస్తే అబ్బాయిలు నిందితులు అవుతాడు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి జగన్ క్విడ్ ప్రో కో ప్లాన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు సీబీఐ పేరు చెబితే అబ్బాయిలు గజగజా వణుకుతున్నారు. బాబాయ్ మర్డర్ కేసులో అబ్బాయిలు చెప్పిన కథల్ని ఖతం చేసింది సీబీఐ. అవినాష్ రెడ్డి కథ ముగిసింది. త్వరలో జగన్ దంపతులు కూడా జైలు బాట పట్టడం ఖాయం. చంచల్ గూడా జైలులో ఉన్న ఖైదీలు అంతా రావాలి క్విడ్ ప్రోకో జగన్. కావాలి క్విడ్ ప్రో కో జగన్ అంటున్నారని విమర్శించారు.
క్విడ్ ప్రో కో జగన్ వి అన్ని కన్నింగ్ ఆలోచనలే. ఆయన ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్ అని వియంర్శించారు. ఆయనికి రెండు బటన్లు ఉంటాయి. బల్ల పైన బటన్ నొక్కితే 10 రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి. బల్ల కింద బటన్ నొక్కితే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతాయి. కట్టింగ్ మాస్టర్ ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.
క్విడ్ ప్రో కో జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి అని సవాల్ చేశారు. క్విడ్ ప్రోకో జగన్ జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్ అని లోకేష్ వివరించారు.
అసమర్ధ ఎమెల్యే శిల్పా రవి
నంద్యాలను టిడిపి ఎంతో అభివృద్ధి చేసింది. అయినా మీరు టిడిపి ని 2019 ఎన్నికల్లో మీరు ఓడించారు. భారీ మెజారిటీ తో శిల్పా రవి గారిని గెలిపించారు అని లోకేష్ చెప్పారు. టిడిపి చేసిన అభివృద్ధిలో కనీసం 10 శాతం కూడా చెయ్యలేని అసమర్ధ ఎమ్మెల్యే శిల్పా రవి. మీ ఎమ్మెల్యేకి నేను పేరు పెట్టడం లేదు. ఆయనకి వైసిపి కార్యకర్తలే ముద్దుగా సండే ఎమ్మెల్యే అని పేరు పెట్టుకున్నారు. మొన్న జరిగిన గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక వైసిపి కార్యకర్త మాకు ఈ సండే ఎమ్మెల్యే వద్దు అని స్లిప్ రాసి బ్యాలెట్ బాక్సులో వేసారు అంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. సండే ఎమ్మెల్యే పాలనలో నంద్యాల నేరాలకు అడ్డాగా మారిపోయింది. నడిరోడ్డు మీద 15 హత్యలు జరిగాయి. కానిస్టేబుల్ సురేంద్రను ఎంత కిరాతకంగా చంపారో చూసాం. సురేంద్ర ను చంపిన వారిని శిక్షించాలి అని కుటుంబం నన్ను కలిసి కోరారు. వారికి హామీ ఇస్తున్నా.
సురేంద్రను చంపిన వారిని శిక్షించే బాధ్యత నాది అని లోకేష్ హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా ఏర్పడిన తరువాత చాబోలు, అయ్యలూరు, కొండాపురం, సాంబవరం గ్రామాల్లో 3,500 ఎకరాలను ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించారు. రైతుల భూములు ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నాయి, సండే ఎమ్మెల్యే కుటుంబం భూములు మాత్రం గ్రీన్ జోన్ లో ఉంటాయి. అక్కడ మార్కెట్ ధర ఎక్కువ ఉంది ఇండస్ట్రియల్ జోన్ కారణంగా నష్టపోతున్నాం అని రైతులు ఆందోళన చేస్తున్నారు. అంతే కాదు ఎదో కంపెనీ పేరుతో ఆ భూములు తక్కువ ధరకే ప్రభుత్వం నుండి సండే ఎమ్మెల్యే కొట్టేయడానికి స్కెచ్ చేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టిడిపి రైతులకు అండగా ఉంటుంది మీరు నష్టపోకుండా చూసే బాధ్యత మాది అని చెప్పారు. ఎంపీ బ్రహ్మానందరెడ్డి భూములు, సండే ఎమ్మెల్యే వెంచర్ పక్కనే నంద్యాల-జమ్మలమడుగు నేషనల్ హైవే రోడ్డు- 167 వెళ్లేలా అలైన్మెంట్ అష్ట వంకర్లు తిప్పారు.
రైతులకు నష్టం జరిగేలా మూడు సార్లు అలైన్మెంట్ మార్చారు. రైతుల పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోని రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. సండే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి భూకబ్జాలు, సెటిల్మెంట్లకు నంద్యాలను అడ్డాగా మార్చేసారు. సండే ఎమ్మెల్యే అనుచరులు రేషన్ బియ్యాన్ని కూడా వదలడం లేదు. అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. నంద్యాల మండలం రాయమలుపురం గ్రామంలో సండే ఎమ్మెల్యే అనుచరుడు శ్రీను శ్మశానాన్ని కబ్జా చేసాడు. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనిలో ఒక రిటైర్డ్ ఎమ్మార్వోకి చెందిన 22 సెంట్ల భూమిని కబ్జా చేసారు సండే ఎమ్మెల్యే అనుచరులు. ఆంధ్రప్రగతి బ్యాంకులో పనిచేసే మ్యానేజర్ కి ఎన్జీఓ కాలనీలో ఉన్న 20 సెంట్ల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసారు సండే ఎమ్మెల్యే అనుచరులు. నంద్యాల టౌన్ బొగ్గులైన్ లో 40 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు తొలగించి ఎంపీ బ్రహ్మానంద రెడ్డి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు విస్తరించాలి అని చూస్తున్నారు. టిడిపి పేదలకు అండగా ఉంటుంది అని లోకేష్ హామీ ఇచ్చారు.
కుందూ నదిని దోచేస్తున్నారు సండే ఎమ్మెల్యే అని ఆరోపించారు. ఒక్కో కిలోమీటర్ ఒక్కో అనుచరుడుకి కేటాయించి మట్టి దోచేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ నంద్యాల వచ్చినప్పుడు అగ్రిగోల్డ్, కేశవ రెడ్డి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ గాల్లో కలిసిపోయింది. బాధితులకు న్యాయం చేసే బాధ్యత టిడిపి తీసుకుంటుంది అని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా అన్నాడు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు వేస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. టిడిపి హయాంలో నంద్యాల కు స్వర్ణయుగం. రూ.1500 కోట్లతో అభివృద్ధి చేసాం. పేదవాళ్లకు ఇళ్లు, రోడ్ల విస్తరణ, సాగు, తాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది టిడిపి. టిడిపి హయాంలో 10వేల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని ప్రజలకు ఇవ్వలేని దద్దమ్మ సండే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పించి ఇళ్లు కేటాయిస్తాం.
రోడ్లు విస్తరణ, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాల టౌన్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. నంద్యాల ను మోడల్ టౌన్ గా అభివృద్ది చేస్తాం అని వివరించారు. నంద్యాల టౌన్ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వెలుగోడు జలాశయం నుంచి తాగునీటి సరఫరా కోసం పైపులైను పనులు మొదలు పెట్టాం. 80 శాతం పనులు పూర్తి చేసాం. మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయలేక వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసింది. టిడిపి గెలిచిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. నంద్యాల జిల్లా ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యులు, మందుల కోరత ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చికిత్సలు అందేలా ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తాం.
నంద్యాల నుంచి భీమవరం వెళ్లాలంటే మద్దిలేరు వాగు దాటాలి. టీడీపీ ప్రభుత్వంలో వంతెన నిర్మాణం కోసం టెండర్లు కూడా పిలిచాం. సండే ఎమ్మెల్యే కమిషన్ కక్కుర్తితో పనులు ఆపేసారు. నంద్యాలలో మెయిన్ సెంటర్లలో నిత్యం వందల మందికి కడుపు నింపిన అన్న క్యాంటిన్ ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. విజయ డైరీ లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, కార్మికుల తొలగింపు అన్ని నా దృష్టికి వచ్చాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత దీని పై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. విజయ డైరీ భూములు అమూల్ కి అప్పజెప్పి రైతులకు తీరని అన్యాయం చెయ్యాలని చూస్తున్నారు. రైతులకు అండగా టిడిపి ఉంటుంది. విజయ డైరీ భూములు కాపాడతాం అని చెప్పారు. స్త్రీ నిధి లోన్స్ ఇవ్వడం ఆపేసారు.
గతంలో ఉన్న బకాయిలు టిడిపి ప్రభుత్వం చెల్లించింది. ఆ లోన్స్ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పే ధైర్యం సండే ఎమ్మెల్యే కి ఉందా? సెంటు స్థలాలకు టిడిపి అడ్డుపడుతుంది అని సండే ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నాడు. అడ్డుపడింది, కోర్టుకు వెళ్లింది వైసిపి వాళ్ళే. సండే ఎమ్మెల్యే కి ఛాలెంజ్ చేస్తున్నా అడ్డుపడుతుంది వైసిపి వాళ్లే అని ఆధారాలు బయటపెడతా. సండే ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడా? అని ప్రశ్నించారు. టిడిపి కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎవ్వరినీ వదలం వడ్డీతో సహా చెల్లిస్తాం రాసిపెట్టుకోండి అని లోకేష్ హెచ్చరించారు.