టిడిపి అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం, దుల్హన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా అమలుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ధర్మవరం నియోజకవర్గంలో ముస్లిం లు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ దేశంలోనే తొలిసారిగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది ఎన్టీఆర్ అని చెప్పారు.
మైనారిటీల స్వావలంబనకు ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి ఆర్థికంగా చేయూతనిస్తామన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తాంమని హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10మంది మైనారిటీలు హత్యకు గురికాగా, 40మందిపై దాడులు జరిగాయన్నారు. మైనారిటీలకు చెందాల్సిన రూ.5వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా గత నాలుగేళ్లుగా ముస్లిం మైనారిటీలపై వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యువనేతను కలిసిన ముస్లిం మైనారిటీలు :
• ధర్మవరం నియోజకవర్గ ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చట్టపరంగా రక్షణ కల్పించాలి.
• ముస్లిం మైనారిటీలు వివక్షకు గురికాకుండా ప్రత్యేక అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి.
• దుల్హన్ పథకాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలుచేయాలి. ఆ పథకం కింద ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలి.
• మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువత ఉపాధికి 50శాతం సబ్సిడీపై రుణాలు అందించాలి.
• గార్మెంటు, చిన్నపరిశ్రమలకు రుణాలిచ్చి మైనారిటీ యువతను ప్రోత్సహించాలి.
• మైనారిటీ ముస్లిం విద్యార్థులకు గతంలో మాదిరిగా విదేశీవిద్య పథకాన్ని అమలుచేయాలి.
• మౌజమ్, ఇమామ్ లకు ఇస్తున్న గౌరవవేతనాలను పెంచాలి.
• ముస్లిం మైనారిటీల కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి, విరివిగా రుణాలివ్వాలి.
• ముస్లిం మైనారిటీల కోసం ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటుచేయాలి.
యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా గత నాలుగేళ్లుగా ముస్లిం మైనారిటీలపై వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయి.
• మైనారిటీలకు చెందాల్సిన రూ.5వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10మంది మైనారిటీలు హత్యకు గురికాగా, 40మందిపై దాడులు జరిగాయి.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తాం.
• దేశంలోనే తొలిసారిగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది ఎన్టీఆర్.
• మైనారిటీల స్వావలంబనకు ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి ఆర్థికంగా చేయూతనిస్తాం.
• ముస్లిం మైనారిటీలకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం, దుల్హన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా అమలుచేస్తాం.